జాను వాళ్ల  డాడీ ఇద్దరూ కలిసి ముస్లీం వేషాలేసుకుని వాళ్లను ఎవరైనా  గుర్తుపడతారో లేదో టెస్ట్ చేసుకుందామని  విక్రమ్‌ వాళ్ల రూం దగ్గరకు వచ్చి వాళ్లను ఇరవై రూపాయలకు ఛేంజ్‌ అడుగుతారు. విక్రమ్‌, దివ్య నవ్వుకుంటూ ఇరవై రూపాయలకు ఛేంజ్‌ ఏంటి? అంటూ అడుగుతారు. ఛేంజ్‌ లేకపోతే పర్వాలేదు మీరు గుర్తు పట్టలేదు మాకదే చాలు అన్నట్లు తిరిగి వెళ్తారు.


లాస్య కోపంగా అరుస్తూ.. రత్నను పిలుస్తుంది. రత్న నింపాదిగా పైనుంచి దిగివచ్చి


రత్న: ఏంటా కేకలు..


లాస్య: దీన్నే అంటారు అవసరానికి మనుషుల్ని వాడుకోవడం అని.


రత్న: ఇప్పుడేం జరిగింది.


లాస్య: ఏం  జరిగిందా? మీకు అవసరం ఉన్న టైంలో నన్ను వాడుకున్నారు. ఇప్పుడు మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదేనా మీరు నాకిచ్చే విలువ.


రత్న: హని విషయంలో నువ్వు మాకు సపోర్టుగా నిలబడ్డావు అందుకు థాంక్స్‌. అలా అని మాకు సంబంధించిన ప్రతి ఇష్యూలోనూ నీ సలహా తీసుకోవాలని ఏం లేదుగా?   


అనగానే తులసి సరేలే కానీ హని విషయంలో వేసిన కేసు ఎందుకు వాపస్‌ తీసుకున్నారు. అంటూ లాస్య అడగ్గానే ఈ విషయంలో మేము మా నిర్ణయం తీసుకున్నాం. తులసి ఉండగా హనిని కానీ కంపెనీని కానీ ఏమీ చేయలేమని అర్థం అయ్యింది. అందుకే కేసు వాపసు తీసుకున్నాం. అలాగే మేమే తిరిగి యూఎస్‌ వెళ్లిపోతున్నాం అంటూ చెప్తారు. దీంతో లాస్య అసహనంగా చూస్తుండిపోతుంది.


నందగోపాల్‌ లెటర్‌ తీసుకుని చదువుకుంటూ లోపలికి వస్తూ..


నంద: తులసి గుడ్‌ న్యూస్‌ ఈ రోజుతో మనకో పెద్ద తలనొప్పి వదిలిపోయింది. ఈరోజు నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు.


అనగానే అందరూ ఏంటా గుడ్‌ న్యూస్‌ అని అడుగుతారు. రత్న వాళ్లు హని విషయంలో వేసిన కేసును వాపసు తీసుకున్నారు. కోర్టు నుంచి ఇంటిమేషన్‌ వచ్చింది. అంటూ నంద చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. హనీ చాక్లెట్‌ తీసుకుని నందగోపాల్‌కు ఇస్తుంది. తర్వాత కొత్త ఆంటీ వాళ్లు ఇల్లు ఖాళీ చేసి పోయారు మనం అక్కడికి వెళ్దాం అని అడుగుతుంది హని. వద్దని తులసి పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది.


జాను వాళ్ల డాడీ రూంలో ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో విక్రమ్‌ వాళ్ల రూంలోంచి అరుపులు వినిపిస్తాయి. వెంటనే విక్రమ్‌ వాళ్ల రూంలోకి జాను వాళ్ల డాడీ పరిగెత్తుకొస్తారు. దీంతో విక్రమ్‌ కోపంగా


విక్రమ్‌: మా రూం తలుపులు తోసుకుని వచ్చేయడమేనా? కాలింగ్‌ బెల్‌ కొట్టాలన్న మర్యాద తెలియదా?  


జాను డాడీ: నీది మొగుడు గరంగా ఉంది ఏం జరిగింది బేటీ?


విక్రమ్‌: బేటీ లేదు లాటీ లేదు వెళ్లిపో.. మొగుడు పెళ్లాలన్న తర్వాత మాకు సవాలక్ష ఉంటాయి. అన్నీ మీకు చెప్పాలా? ఏంటయ్యా మీ డౌటు మేమేదో సరసాలాడుకుంటున్నాం చాలా..!


జాను: పప్ప సరసాలు ఆడుకుంటున్నాయి అంట మరి ఆ అరుపులు


విక్రమ్‌: నీకు పెళ్లయింది. కానీ నీ మొగుడు పారిపోయిండు. అరుపుల సంగతి నీకేం తెలుస్తాయి. చాచా నా బాష కూడా మారిపోతుంది.


వెళ్లండి అనగానే వాళ్లు బయటికి వెళ్లిపోతారు. తులసి వాళ్ల అమ్మకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడుగుతుంది. ఇంతలో తులసి వాళ్ల తమ్ముడు వచ్చి ఫోన్‌ తీసుకుని అమ్మ ఆరోగ్యం అసలు బాగాలేదని నిన్నటి నుంచి గుండె దడగా ఉందని పడుకుందని చెప్తాడు. నేను ఎన్ని చెప్పినా వినటం లేదని నువ్వైనా చెప్పు అంటాడు. దీంతో వాళ్ల అమ్మ తులసితో వాడి మాటలు పట్టించుకోవద్దని టైంకు టాబ్లెట్స్‌ వేసుకుంటున్నానని చెప్తుంది. ఇక్కడ అంత సర్దుకున్నాక నిన్ను మా ఇంటికి తీసుకొచ్చుకుంటానమ్మ అంటూ తులసి చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.