నందు హని రూంలోకి వెళ్లి నిన్ను ఒక ప్లేస్‌కు తీసుకుపోతాను. అక్కడ నీకు కావాల్సినవి దొరుకుతాయి అని చెప్పడంతో హని భయంగా చూస్తుండిపోతుంది. అయితే నందు మాటలు చెప్పి హనిని తీసుకుని వెళ్తాడు.
హని : ఏంటి అంకుల్ ఇది. మీ పద్దతేం నచ్చలేదు.
నందు : ఏంటమ్మా నేను ఏమి చేశాను.
హని : ఇంట్లోంచి బయటి వచ్చే వరకు చాలా హుషారుగా ఉన్నారు. ఇప్పుడేంటి ఇలా డల్ గా ఉన్నారు.
నందు : మీ ఇంట్లో వాళ్ల గురించే ఆలోచిస్తున్నాను. నిన్నెందుకు ఇలా చూస్తున్నారు అని..
హని : ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకు అంకుల్ ఇక లైఫ్ లో వాళ్ల ఇంటికి వెళ్లను. మీ ఇంట్లోనే ఉండి పోతాను. వాళ్ల గురించి నేను అస్సలు పట్టించుకోను. మీరు పట్టించుకోవద్దు సరేనా..
లాస్య, నందుకు ఫోన్ చేస్తుంది. నందు ఫోన్ లిప్ట్ చేయడు...
లాస్య: కాల్ కట్ చేస్తున్నాడు. ఎంత ధైర్యం చెప్తా..
లాస్య ఫ్రెండ్ : సడెన్ గా నీ పవర్ తగ్గిపోయినట్లుంది లాస్య. తులసి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. నందు కూడా అంతే..
లాస్య: రెస్పాన్స్ ఇవ్వకపోతే వాళ్లకే నష్టం. దివ్య వాళ్లకు దక్కదు. పిరికివాళ్లలా మాట్లాడకండి నందు రెస్పాన్స్ ఇచ్చే వరకు వదిలిపెట్టేదే లేదు.
నందు : హలో..
లాస్య : ఎన్ని సార్లు కాల్ చేయాలి దివ్యకు ఏమైనా అయితే నా బాధ్యత కాదు.
నందు : చంపేస్తాను. నువ్వేంటో తెలిసి కూడా నీ మాటకు తల వంచుతొంది. కేవలం దివ్య ప్రమాదంలో ఉందనే.. దివ్యను రక్షించుకుందామనే దివ్యకు ఏమైనా అయితే నీకు సమాధి కడతాను.
లాస్య: దివ్య కావాలి అనుకున్నప్పుడు హనిని తీసుకొచ్చి ఇవ్వాలిగా బొట్టు పెట్టి చెప్పాలా..?
నందు : హనిని తీసుకుని నీ దగ్గరకే బయలుదేరాను. కారులో నా పక్కన హని ఉంది. అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు.
లాస్య: ఒకే త్వరగా వచ్చేయ్ పూల దండ పట్టుకుని గుమ్మం దగ్గరే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా.. త్వరగా వచ్చేయ్. కారాపి కిందకి దిగి మాట్లాడుతున్నావా? జాగ్రత్త హని కారులోంచి పారిపోతే కష్టం.
నందు : నాకు తెలుసు పెట్టేయ్..
హస్పిటల్‌లో దివ్యకు ట్రీట్‌మెంట్ చేస్తుంటారు.
దివ్య: అమ్మ నన్ను కిడ్నాప్ చేసింది ఎవరమ్మా..?
విక్రమ్ : ఇప్పడవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకుందా.
దివ్య: పర్వాలేదు విక్రమ్ ఎవరో చెప్పు..
తులసి : దివ్య ఇప్పుడవన్నీ ఆలోచించకు అసలే చాలా నీరసంగా ఉన్నావ్.
దివ్య : మీరిద్దరూ నా పక్కన ఉన్నారుగా అమ్మ నాకేం కాదులే..
హాస్పిటల్ నుంచి దివ్యను తీసుకుని విక్రమ్, తులసి ఇంటికి వస్తారు. చచ్చి శవమై వస్తుందనుకుంటే ఇలా వస్తుందేంటని విక్రమ్ వాళ్ల మామయ్య, అత్తయ్య అసూయపడుతుంటారు. తులసి వల్లే దివ్యకు ఈ పరిస్థితి వచ్చిందని విక్రమ్ కుటుంబ సభ్యులు నిందలు వేస్తారు. మా అమ్మను తిట్టొద్దని దివ్య కలుగజేసుకుంటే ప్రేమ ఒకవైపు కాదు రెండు వైపులా ఉండాలని దివ్యకు చెప్తారు.
తులసి : ఈ విషయంలో నన్ను ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా.. వాళ్లందరికి నేను చెప్పేది ఒకటే సమాధానం నేను తప్పు చేయలేదు.. ఎప్పటికీ చేయను కూడా..
విక్రమ్ : దివ్యను కిడ్నాప్ చేసిన ఇల్లు దొరకడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటే భయమేస్తుంది అత్తయ్య.
తులసి : చేయగలను అనుకున్నప్పుడే ఎవరైనా ఏదైనా రిస్క్ తీసుకుంటారు. పాము కాటేస్తుందేమోనని భయపడేవాడు పాములు పట్టుకోవడానికి ప్రయత్నించడు. దివ్యను కాపాడగలను అని నమ్మకం ఉంది కాబట్టే హనిని అప్పగించలేదు.
విక్రమ్ : ఈసారికి సరే మళ్లీ ఇంకోసారి ఇలా జరగదని ఏంటి గ్యారంటీ.. హని మీ దగ్గర ఉన్నంత వరకు అక్కడ మీకు రిస్కే.. ఇక్కడ మాకు రిస్కే.. కాదంటారా? ఎంతకాలం ఇలా భయంతో బతకాలి? ఎంతకాలం ఇలా కాపలా కాసుకుంటూ బతకాలి.
విక్రమ్ మాటలకు తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రోడ్డు మీద ఒంటరిగా ఆగి ఎవ్వరూ తనను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది. అందరికి నేను మంచి చేయాలనుకుంటే నాకు ఎప్పుడూ చెడే జరుగుతుంది. ఏదేమైనా సరే హనికి మంచి జీవితం ఇవ్వాలనుకుంటుంది తులసి. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ అయిపోతుంది.