దివ్య ఇంట్లోకి వచ్చేసరికి నందు తులసికి నాకు మధ్య ప్రేమ లేదని అంటావా అని వాసుదేవ్ ని అడుగుతాడు. దివ్య నందు డివోర్స్ విషయం వాసుదేవ్ ముందు నోరు జారితే కొంప కొల్లేరు అవుతుందని లాస్య టెన్షన్ పడుతుంది. తనని లోపలికి పంపించేయాలని లాస్య ట్రై చేస్తుంది కానీ వాసుదేవ్ మాత్రం తనకి ఫుల్ గా గడ్డిపెట్టేస్తాడు. అప్పుడే నందు తులసిని గదిలోకి రమ్మని సైగలు చేస్తూ ఉంటే వాసుదేవ్ పసిగట్టేసి బయటకి అనేస్తాడు. తల్లి గురించి దివ్య బాధగా మాట్లాడుతుంది. కలిసి ఉండాల్సిన వాళ్ళతో విడిపోయి దూరంగా ఉంటే అసంతృప్తిగా ఉంటే బాధగా ఉండదా అని దివ్య అంటుంది. ఆ మాటకి ఎవరితో దూరం అయ్యిందని వాసుదేవ్ అడుగుతాడు. కానీ లాస్య మాత్రం దివ్యని బలవంతంగా అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది.


Also Read: కావ్యకి బలవంతంగా అన్నం తినిపించిన రాజ్- దుగ్గిరాల ఇంట్లో నిప్పు రాజేసి సంబరపడుతున్న రుద్రాణి


అన్నయ్య దగ్గర నిజాన్ని దాచిపెట్టి తప్పు చేస్తున్నానా అని తులసి మనసులోనే బాధపడుతుంది. బసవయ్య విక్రమ్ గురించి వ్యతిరేకంగా రాజ్యలక్ష్మి దగ్గర మాట్లాడతాడు. వాడు తన గుప్పిట్లో నుంచి ఎప్పటికీ జారిపోడని రాజ్యలక్ష్మి అంటుంది. వాడు కాదు నువ్వు విక్రమ్ గుప్పిట్లో ఉన్నావ్ అని బసవయ్య అంటుండగా విక్కీ వస్తాడు. ఆకలిగా ఉందని భోజనం చేద్దామని రాజ్యలక్ష్మి రమ్మని పిలుస్తుంది కానీ విక్రమ్ తనకి ఆకలిగా లేదని చెప్పేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇదే అదనుగా చూసి చూసి బసవయ్య మరింత రెచ్చగొడతాడు. విక్రమ్ కి నాకు మధ్య మూడో శక్తి ఏదో వచ్చిందని అర్థం అయ్యింది ఎలాగైనా మళ్ళీ వాడిని గుప్పిట్లోకి తీసుకోవాలని రాజ్యలక్ష్మి రగిలిపోతుంది. తులసి పాటలు వింటూ ఉంటుంటే దివ్య కోపంగా వస్తుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందని సీరియస్ గా అడుగుతుంది.


ఎవరినైతే దూరంగా ఉంచాలో వాళ్ళ మాట వింటున్నావ్, తనకి సాయం చేస్తున్నావ్. లాస్య ఆంటీ వినాల్సిన అవసరం ఏంటని దివ్య నిలదీస్తుంది. లాస్య మాట కాదు నీ నాన్న కోసం మనసు చంపుకుని నటిస్తున్నానని చెప్తుంది. నువ్వు, నాన్న కలిసి భార్యాభర్తలుగా కనిపిస్తుంటే పట్టలేనంత సంతోషంగా ఉంది. ఈ క్షణాలు ఇలాగే శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఇది నీ కూతురి కోరిక తీరుస్తావా? అని దివ్య ఎమోషనల్ గా అడుగుతుంది. అదేదో చాక్లెట్ అడిగేసినట్టు అడిగి వెళ్లిపోయిందేంటని తులసి బాధపడుతుంది. విక్రమ్ దివ్య ఊహల్లో తేలిపోతూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. దేవుడు వచ్చి కాసేపు విక్రమ్ ని ఆటపట్టిస్తాడు. అటు ఇంట్లో దివ్య కూడా తనని తాను చూసుకుని మురిసిపోతుంది. రోజు చూసుకునే నవ్వు అయినా ఈరోజు నా నవ్వు అందంగా కొత్తగా అనిపిస్తుంది అబ్బాయి కాంప్లిమెంట్ ఇచ్చినందుకా అని నవ్వుతుంది.


Also Read: షాకింగ్ ట్విస్ట్, యష్ వేదని విడదీసేందుకు విన్నీ స్కెచ్- భార్య అలక తీర్చే పనిలో మిస్టర్ యారగెంట్


దివ్యకి మెసేజ్ పెట్టమని దేవుడు సలహా ఇస్తాడు. హాయ్ అని మెసేజ్ పెట్టమంటే aai అని పెట్టబోతుంటే దేవుడు స్పెల్లింగ్ చెప్పి పెట్టమని చెప్తాడు. విక్రమ్ హాయ్ అని పెట్టి పెట్టగానే దివ్య కూడా రిప్లై ఇస్తుంది. మెసేజ్ పెట్టాడంటే నా గురించి ఆలోచిస్తున్నాడని మళ్ళీ దివ్య మెసేజ్ పెడుతుంది. విక్రమ్ ఫోన్ పట్టుకుని చూసుకుంటూ ‘నాలో చిలిపికల..’ అంటూ బ్యూటీఫుల్ సాంగ్ వేసేసుకుంటాడు. వాసుదేవ్ నందు, తులసి గురించి వద్దన్నా పొగుడుతూనే తలకాయ నొప్పి పెట్టిస్తాడు.