కావ్య భోజనానికి రాలేదా అని కళ్యాణ్ అడుగుతాడు. అందరూ టిని ఆమెని పస్తులతో పడుకోబెట్టడం ఎందుకు శాంతతో భోజనం పంపించమని రాజ్ అంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. తను రావడంతో అపర్ణ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కావ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే రాజ్ తినే ప్లేట్ లో చేయి కడిగేసి కళావతిని తిని వెళ్లమను కడుపు నిండా అనేసి వెళ్ళిపోతాడు. రేఖ తనని అవమానించేందుకు చూస్తుంది కానీ కావ్య తనకి కాస్త గడ్డి పెట్టేస్తుంది. తన వల్ల ఇంతమంది తినకుండా వెళ్లిపోయారు నేను తినలేనని చెప్పేసి కావ్య కూడా బాధగా వెళ్తుంది. జరిగింది తలుచుకుని రాజ్, కావ్య బాధపడుతూ ఉంటారు. కనకం కుటుంబం కావ్య పరిస్థితి ఎలా ఉందోనని దిగులుపడుతుంది.


Also Read: షాకింగ్ ట్విస్ట్, యష్ వేదని విడదీసేందుకు విన్నీ స్కెచ్- భార్య అలక తీర్చే పనిలో మిస్టర్ యారగెంట్


రుద్రాణి కావ్య గదికి వస్తుంది. మీ అమ్మానాన్నకి ఫోన్ చేశానని రుద్రాణి కావ్యకి చెప్తుంది. ఎలా ఉన్నారని ఆత్రంగా అడుగుతుంది. మీ అక్క ఎవరినో నమ్మి వెళ్ళిపోయి ఉండాలి, లేదంటే ఎవరో నమ్మించి ఎత్తుకుపోయి ఉండాలి. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పట్టించుకుని పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుండు. పాపం స్వప్న ఎక్కడ ఉందో ఏమైపోయిందోనని నటిస్తుంది. ఆ మాటలు విని కావ్య టెన్షన్ పడుతుంది. నేనే ఇస్తాను కంప్లైంట్ అనుకుని ముసుగు వేసుకుని ఇంట్లో ఎవరూ చూడకుండా బయటకి వెళ్తుంది. అది రుద్రాణి చూస్తుంది. మొదటి రోజే యుద్ధభూరి మోగిస్తాను, రాజ్ కావ్య మధ్య వార్ మొదలయ్యేలా చేస్తానని మనసులో అనుకుంటుంది.


రాజ్ గదికి వెళ్ళి పెళ్లి కూతురు కనిపించడం లేదని చెప్తుంది. ఇల్లంతా చూశాను ఎక్కడా లేదు సెక్యూరిటీకి ఫోన్ చేస్తే బయటకి వెళ్ళిందని అంటుంది. కళావతి ఎక్కడికి పోతే నాకెందుకని రాజ్ అంటాడు. మంచిదానిలా నటిస్తూ రుద్రాణి మాట్లాడుతుంది. రాహుల్ ఇంకా రాలేదు ఏంటి కావ్య అక్కని అని తెలిసిపోయిందా ఏంటని కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు. నిన్ను వెంటనే వదిలించుకుంటే నేరుగా మా ఇంటికి వెళ్లిపోతావ్, అలా చేస్తే నా అసలు రంగు బయట పడుతుంది. మెల్లగా వదిలించుకుంటానని రాహుల్ అనుకుంటాడు. రాజ్ కావ్య కోసం టెన్షన్ గా ఎదురుచూస్తూ ఉంటాడు. అత్తవారింట్లో కొత్త కోడలు యుద్ధం చూడటానికి నేను సిద్ధం అని రుద్రాణి కవిత్వం పొంగుగొచ్చేలా మాట్లాడుతుంది. అప్పుడే కావ్య ముసుగువేసుకుని ఇంట్లోకి వచ్చేసరికి రాజ్ ఆపుతాడు.


ఎవరి కొంపలు ముంచిరావడానికి ముసుగు వేసుకుని వెళ్ళావ్ అని అడుగుతాడు. తెల్లారి మాట్లాడుకుందామని కావ్య అంటే కాదు ఇప్పుడే పోట్లాడుకుందామని రాజ్ అంటాడు. ముసుగుతీయకుండా మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్లొచ్చావని అంటాడు. పొద్దున్నే చెప్తానని అంటుంటే రాజ్ తనని లాగేస్తాడు. దీంతో కళలు తిరిగి పడిపోబోతుంది. రుద్రాణి కావాలని ఇంట్లో అందరికీ వినిపించేలా ఏమైందని అంటుంది. అందరూ కంగారుగా వస్తారు. భోజనం పెట్టకపోతే ఇలాగే కళ్ళు తిరుగుతాయని కళ్యాణ్ చెప్తాడు. ఇంద్రాదేవి కోపంగా ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని రాజ్ మీద సీరియస్ అవుతుంది. మీ ఇద్దరూ ఒకరికొకరు చూసుకోకూడదని చెప్పాను కదా ఎందుకు చూసుకున్నారని అడుగుతుంది. ఈ ముసుగు పెళ్లి కూతురు అర్థరాత్రి ఎక్కడికో వెళ్ళిందని చెప్పేసరికి ఎక్కడికి వెళ్ళావని అపర్ణ సీరియస్ అవుతుంది.


Also Read: ఇద్దరం కొండెర్రిపప్పలమేనన్న రాహుల్- కావ్య దుగ్గిరాల ఇంటికి సరైన కోడలన్న ధాన్యలక్ష్మి


భోజనం చేయమని ఇంద్రాదేవి అడుగుతుంది. కానీ ఆయన భోజనం చేయకుండా చేయనని కావ్య తింటుంది. నేను అడుగుపెట్టడం వల్ల అన్నం దగ్గర నుంచి లేచి వెళ్లిపోయారు అది బాధగా అనిపించిందని కావ్య చెప్తుంది. తినను అంటాడు.. నా వల్లే కదా నువ్వు తినలేదు ఎలా తినవో నేను చూస్తానని కావ్య దగ్గరకి కోపంగా వచ్చి తనకి బలవంతంగా అన్నం తినిపిస్తాడు. ఇలా బలవంతంగా తినిపించడం పద్ధతి కాదని రాజ్ నానమ్మ తిడుతుంది. అన్నాన్ని అగౌరపరచడం ఇష్టం లేక ఈ రాక్షసత్వాన్ని భరిస్తున్నాని, మీరు చేసిన అవమానం మర్చిపోలేను ఇంతకింత తిరిగి ఇచ్చేస్తానని అంటుంది.