లాస్య చేసిన మోసాన్ని తన నోటితోనే బయట పెట్టిస్తానని దివ్య అంటుంది. ఎంత సేపు పుట్టింటి గురించే ఆలోచన అని రాజ్యలక్ష్మి చెప్పిన మాటలే తులసికి గుర్తుకు వస్తాయి. అనవసరంగా దివ్య ఎక్కువ రియాక్ట్ అవుతుంది ఉన్న కష్టాలు సరిపోవని కొత్త కష్టాలు నెత్తిన పెట్టుకుంటుందని తులసి మనసులో అనుకుంటుంది. తన గురించి ఆలోచించొద్దని నందు అంటాడు. నాన్నని చూసుకోవడానికి నేను ఉన్నానని తులసి చెప్తున్నా కూడా దివ్య మాత్రం వినకుండా విక్రమ్ కూడా మనకి సపోర్ట్ గా ఉంటాడని చెప్తుంది. నందు దివ్యని మాట ఇవ్వమని అడుగుతాడు. నువ్వు నా కేసు విషయంలో పట్టించుకోవద్దు దూరంగా ఉండు. నా ఇష్యూ ఎవరికీ తలనొప్పి కాకూడదు. శిక్ష పడినందుకు నేనేమీ బాధపడటం లేదు. ఎవరూ నా గురించి ఎవరు ఆలోచించొద్దని చెప్తాడు. ఎందుకు ఇలా ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నారని దివ్య బాధపడుతుంది. నా దగ్గరకి రావద్దు కనీసం జైల్లో అయినా ప్రశాంతంగా ఉండనివ్వమని నందు అంటాడు.


Also Read: తనకి అర్జెంట్ గా మనవడిని కనివ్వాలని కోడలికి కండిషన్ పెట్టిన రేవతి- బిత్తరపోయిన ముకుంద


తులసి వెళ్లబోతుంటే అమ్మానాన్న జాగ్రత్త అని అంటాడు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత తులసి కూడా తండ్రి గురించి పట్టించుకోవద్దని దివ్యకి చెప్తుంది. నీకు పెళ్ళయింది కుటుంబం ఉంది. అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. మీ నాన్నని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం. ఇప్పుడు నాన్న దగ్గరకి రావలసిన అవసరం లేదు నా మాట లెక్క చేయకుండా ఎందుకు వచ్చావు. రేపు ఇలాగే మీ అత్త మాట కూడా లెక్కచేయవా? మమ్మల్ని తిడతారు పిల్లలని పెంచడం రాదా అని అంటారు. ఏం సమాధానం చెప్పాలని సీరియస్ గా చెప్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని దివ్య బాధపడుతుంది. నువ్వు వచ్చినందుకు మీ నాన్న సమస్య ఏమైనా తీరిందా? నువ్వు ఒక ఇంటి కోడలివి పద్ధతిగా ఉండు. పుట్టింటి కష్టాలు అత్తింటి దాకా తీసుకెళ్లకు. ఇప్పుడు నీ జీవితం నీది మా జీవితం మాది. నువ్వు మీ అత్త చెప్పు చేతల్లోనే ఉండాలి. ఇక ముందు పుట్టింటి విషయాల్లో జోక్యం చేసుకోకని చెప్పేసి తులసి కూతురి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతుంది.


నీకు అత్త ఇంట్లో ఏ సమస్య రాకూడదని నీ మనసు విరిగిపోయేలా మాట్లాడానని తులసి తర్వాత బాధపడుతుంది. దివ్య బాధగా ఇంటికి వస్తుంది. తను డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. అమ్మ మావయ్య కేసు విషయంలో సీనియర్ లాయర్ ని కూడా పిలిపించిందని చెప్తాడు. దివ్య మాత్రం మౌనంగా ఉంటుంది. నిజంగానే మీరు సీనియర్ లాయరా? మీ ప్లాన్ ఏంటో చెప్పండి కేసు ఎలా రీఓపెన్ చేయిస్తారు ఎలా గెలిపిస్తారో చెప్పండని లాయర్ ని దివ్య నిలదీస్తుంది. ప్రశ్న అడిగితే తెల్ల మొహం పెట్టడానికా పొద్దుటి నుంచి కూర్చుందని దివ్య అంటుంది. కాస్త మర్యాదగా మాట్లాడమని రాజ్యలక్ష్మి అంటే మా అమ్మ నాకు ఏమి నేర్పలేదని వెటకారంగా మాట్లాడుతుంది. మా అమ్మతో ఇలాగా నువ్వు మాట్లాడేది పద్ధతి మార్చుకోమని విక్రమ్ అంటాడు. మీతో నాకు అయితే అవసరం లేదని వెళ్లిపొమ్మని లాయర్ ని పంపించేస్తుంది. నీ పద్ధతేమి బాగోలేదని విక్రమ్ అంటే ఏం బాగోలేదు ఎవరి దగ్గర పద్ధతి నేర్చుకోవాలి, ప్రతి వాళ్ళు నా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. అసలు ఈ గొడవలు అన్నింటికీ కారణం ఎవరంటే అని చెప్పబోతు కూడా ఆగిపోతుంది.


Also Read: మూడేళ్ళ తర్వాత రిషి రీ ఎంట్రీ- ఎన్ని చెప్పినా జగతిని క్షమించలేనన్న మహేంద్ర


కనీసం నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు జీవితం మీద విరక్తి పుడుతుందని బాధగా వెళ్ళిపోతుంది. నాకు కావలసింది ఇదే ఇలా రెచ్చిపోవడమేనని రాజ్యలక్ష్మి సంబరపడుతుంది. భార్యని ఓదార్చడానికి విక్రమ్ వస్తాడు. తన మనసులో బాధ అంతా వెళ్లగక్కుతుంది. నా ఖర్మకి నన్ను వదిలేసి మీ వాళ్ళతో హ్యపీగా ఉండమని దివ్య అంటుంది.