శాంతి హోమంలో దివ్యని ఇబ్బంది పెట్టాలని రాజ్యలక్ష్మి లాస్యతో మాట్లాడటం దివ్య వింటుంది. మీరు దొరికి ఉంటే మీ కొడుకు ముందు పెద్ద పంచాయతీ పెడదామని అనుకున్నా కానీ కుదరలేదు బాగా తప్పించుకున్నారని దివ్య అంటుంది. హోమం మొదలు కాబోతుంటే పెద్ద వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని పంతులు చెప్తాడు. దివ్య తులసి వాళ్ళ వైపు వస్తే విక్రమ్ రాజ్యలక్ష్మి దగ్గరకి వెళతాడు. తులసి ముందు అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి దివ్యని అటు పంపించేస్తుంది. శాంతి హోమం జీవితంలో పెను మార్పు తీసుకొస్తుందని, ఎదురుచూడని ఫలితం ఇస్తుందని పూజారి చెప్తాడు. అది ఎప్పుడో కాదు ఇప్పుడే జరుగుతుందని రాజ్యలక్ష్మి, లాస్య సంబరపడతారు. నిప్పుల గుండం ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని రాజ్యలక్ష్మి లాస్యని అడుగుతుంది.
Also Read: కావ్య వేసిన డిజైన్స్ చింపేసిన రాజ్- అప్పు మీద మర్డర్ కేసు
నందు పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే వెనుకాలే లాస్య వెళ్తుంది. దివ్య మొహంలో సంతోషం కనిపిస్తుంది కదా అది కొద్ది నిమిషాలు మాత్రమే.. మరికాసేపటిలో అది పోతుందని అంటుంది. ఏం జరగబోతోందని చెప్పను.. అది జరగకూడదంటే ఈ శాంతి పూజ ఆపించమని రెచ్చగొడుతుంది. రాజ్యలక్ష్మి ఒంటరిగా నిలబడి ఉంటే బసవయ్య వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. దివ్య జీవితంలో నిప్పులు పోయాలని ఆలోచిస్తున్నట్టు చెప్తుంది. హోమం అయిపోగానే దివ్యని ఆ నిప్పుల గుండంలో నడిచేలా ప్లాన్ చేసినట్టు చెప్పేసరికి అది విక్రమ్ చేయనివ్వడం ఏమోనని సంజయ్ వాళ్ళు డౌట్ పడతారు. దివ్యని రెచ్చగొట్టి నడిచేలా చేసి విక్రమ్ ఒప్పుకునేలా చేయాలని డిసైడ్ అవుతుంది. ఒప్పుకుంటారు విక్రమ్ కూడా కలిసే నడుస్తాడని సంజయ్ అంటాడు. కోడలు సరే పాపం విక్రమ్ తో ఎందుకని బసవయ్య జాలిగా మాట్లాడతాడు. కానీ రాజ్యలక్ష్మి మాత్రం దివ్య కనిపించే శత్రువు అయితే కనిపించని శత్రువు విక్రమ్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు పడతాయని సంబరపడుతుంది.
నా రక్తం పంచుకు పుట్టిన కొడుకుని ఈ ఇంటికి వారసుడిని చేయాలి. విక్రమ్ మీద లేనిపోని ప్రేమ చూపిస్తున్నా. ఈ దొంగ నాటకం ఆడలేక అలిసిపోతున్నా. ఈరోజుతో ఆ నాటకానికి తెర పడాలని అంటుంది. నీ కొడుకు వారసుడి అయితే నాకు సంతోషమే మరి నా గురించి కూడా ఒక మాట అనుకుంటే బాగుంటుందని బసవయ్య అడుగుతాడు. నువ్వు ఈ ఇంటి మనిషివి నిన్ను ఎప్పటికీ వదులుకొను సంజయ్ నిన్ను అడిగి సలహాలు తీసుకుంటాడని చెప్పేసరికి బసవయ్య ఆనందపడతాడు. శాంతి హోమం ఆపేసి వెంటనే దివ్య వాళ్ళని తీసుకుని వెళ్లిపోదామని నందు ఆవేశంగా తులసితో అంటాడు. మీకు ఏమైందని అడుగుతుంది. ఆ లాస్య చెప్పింది శాంతి హోమం అయిన వెంటనే దివ్యకి ఏదో చెడు జరగబోతుందని ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పిందని చెప్తాడు. తన మాటలు పట్టించుకోవద్దని తులసి చెప్పినా కూడా నందు కంగారుపడతాడు.
Also Read: ఫస్ట్ నైట్ లో అభిమన్యుని వణికించేసిన నీలాంబరి- యష్, వేద మధ్యలో మాళవిక
హోమం అయిన తర్వాత దివ్య దంపతుల్ని నిప్పుల గుండం దగ్గరకి తీసుకొస్తారు. దివ్య వాళ్ళు నడవరని తులసి అంటుంది. నడవకపోతే ఇంట్లో అరిష్టాలు జరుగుతాయని పంతులు హెచ్చరిస్తాడు. నందు కూడా దివ్య నిప్పుల గుండంలో నడిచేందుకు ఒప్పుకోడు. దీంతో రాజ్యలక్ష్మి తను నడుస్తానని అంటుంది. కానీ దివ్య మాత్రం అందరి మాట కాదని నడుస్తానని చెప్తుంది.