కేఫ్ కోసం తులసి సాయం చేసిన తాళి బొట్టు దొంగపాలు కావడంతో నందు అల్లాడిపోతాడు. తన గురించి పట్టించుకోవద్దని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇదంతా విక్రమ్ దూరం నుంచి చూస్తూనే ఉంటాడు. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు నా చేతకాని తనం వల్లే మంగళసూత్రం పోయిందని తులసి నింద తనమీద వేసుకుని సర్ది చెప్పేందుకు చూస్తుంది. విక్రమ్ తులసి వాళ్ళ దగ్గరకి వస్తాడు. తనని చూసి ఇక్కడ జరిగింది దివ్యకి చెప్పొద్దని అడుగుతుంది. ఉన్న కష్టాలు చాలు కొత్త కష్టాలు మోసే ఓపిక లేదని తులసి బాధగా చెప్తుంది. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని విక్రమ్ అంటాడు. వద్దు మీ అమ్మ చూస్తే తప్పుగా అనుకుంటారని తులసి అంటే మా అమ్మ అలాంటిది కాదని తనతో పాటు తీసుకుని వెళతాడు. ఇంతకముందు జరిగింది నాటకం కాదు నిజం, నమ్మమని అడగటం తప్ప నిజమని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తులసి అంటుంది.


Also Read: కళ్యాణ్ ని దారుణంగా అవమానించిన అప్పు- పుట్టింటికి సాయం చేసేందుకు కావ్య చేసే ప్రయత్నం రాజ్ కి తెలుస్తుందా?


విక్రమ్ తులసి వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. మీకు డబ్బు ఇచ్చి ఆ నిజం దివ్య, తీసుకుని మీరు దాస్తున్నారని అనుమానించాను. మనసు బాధపెట్టేలా మాట్లాడాను. మీ నిజాయితీని అనుమానించినందుకు క్షమించమని అడుగుతాడు. కళ్ళతో చూసింది నిజం కాదని తులసి చెప్తుంది. మా బంధం మీద మరకపడిందని దివ్యని మాతో మాట్లాడొద్దని గట్టిగా చెప్పాను అందుకు తను చాలా బాధపడింది దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని అంటుంది. తన కూతురిని సంతోషంగా చేయమని నందు వాళ్ళు కోరుకుంటారు. విక్రమ్ వాళ్ళతో ప్రేమగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. దివ్య తను దొంగతనం చేయలేదని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని విక్రమ్ బాధపడతాడు. తనని చాలా అవమానించాను దొంగను పట్టుకుని ప్రాయిశ్చితం చేసుకోవాలని డిసైస్ అవుతాడు.


నందు చేతికి గాయం అయితే దాన్ని తులసి క్లీన్ చేస్తుంది. చెడు జరిగిందని నందు బాధపడుతుంటే తులసి మాత్రం అల్లుడు మనకి దగ్గరయ్యాడు సంతోషంగా ఉండమని చెప్తుంది. విక్రమ్ ఆవేశంగా ఇంటికి వచ్చి తల్లిని పిలవడంతో ఇంట్లో అందరూ వస్తారు.


విక్రమ్: మోసపోయాను దారుణంగా మోసపోయాను. నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేసి వెన్నుపోటు పొడిచి నమ్మకద్రోహం చేస్తారని అనుకోలేదు


బసవయ్య: నువ్వు మాట్లాడుతుంది దొంగతనం జరిగిన లక్ష రూపాయల గురించేనా?


విక్రమ్: అవును.. ఖచ్చితంగా ఆ లక్ష రూపాయలు దొంగిలించబడ్డాయి


దివ్య: పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తే నువ్వే వద్దని చెప్పావు. దొంగ ఎవరినో తెలియకుండా అందరినీ దొంగల్లగా చూస్తే ఎవరు ఒప్పుకుంటారు


బసవయ్య: అందరినీ చూడటం లేదు ఒకరిని మాత్రమే చూస్తున్నాడు


Also Read: బెడిసికొట్టిన ప్లాన్- మాళవికని తీసుకెళ్లిపోయిన వసంత్, వేదనే వెళ్లగొట్టిందని అనుకున్న యష్


విక్రమ్ తాతయ్య: అంటే ఏంటి దివ్య వైపు వేలు చూపిస్తున్నావా?


విక్రమ్: దివ్య ఆ తప్పు చేయలేదు. ఇంట్లో కనిపించకుండా పోయిన డబ్బు వాళ్ళ అమ్మనాన్నకి ఇచ్చిందని నమ్మాను. కానీ నా కళ్ళు నన్ను మోసం చేశాయని ఇందాకే తెలుసుకున్నా. దొంగతనం ఖచ్చితంగా ఈ ఇంట్లో వాళ్ళే చేశారు. మర్యాదగా దొంగ బయటపడి తప్పు ఒప్పుకుంటే వదిలేస్తా. నేను పట్టుకుంటే మాత్రం మూడు చెరువులు నీళ్ళు తాగేస్తాను


తప్పు తెలుసుకున్నానని దివ్య సోరి చెప్తాడు. నీ మాటల వల్ల ముక్కలైన మా అమ్మానాన్న మనసు అతికించగలవా అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. దివ్య చాలా మంచిపిల్ల తనని కన్వీన్స్ చేయమని తాతయ్య సలహా ఇస్తాడు. నిజం తెలిసిపోతుందేమోనని రాజ్యలక్ష్మి టెన్షన్ పడుతుంది. దివ్య, తులసిని దగ్గర చేసేందుకు రాములమ్మ ట్రై చేస్తుంది. కానీ తులసి మాత్రం అందుకు ఒప్పుకోదు. దీంతో రాములమ్మ దివ్యకి ఫోన్ చేసి మాట్లాడుతుంది.