తులసమ్మ వాకిట్లో ముగ్గుల పోటీ ఏర్పాటు అనేసరికి ఆడవాళ్ళు అందరూ పట్టు చీరలు కట్టి ముస్తాబైపోతారు. నందు ఇంటర్వ్యూకి వెళ్లబోతుంటే మాధవి ఎదురు వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. నందు నవ్వేసరికి మాధవి థాంక్స్ చెప్తుంది. ఈ పూటకి ఉండనివ్వు టిఫిన్, భోజనం ఖర్చు ఇచ్చి వెళ్లిపోతానులే అంటుంది. ఆ మాటకి నందు బాధపడుతూ ఆ రోజు అలా మాట్లాడినందుకు చాలా బాధగా ఉందని అంటాడు. పండగ పూట అన్నాచెల్లెళ్ళు కలిసిపోయారని అందరూ సంతోషిస్తారు. నేను ఎదురువచ్చాను కాసేపు కూర్చో అని మాధవి అంటుంది. వెంటనే లాస్య నేను ఎదురు వస్తానులే అంటుంది. ప్రేమ్ నో అనేస్తాడు. మొన్న నువ్వు ఎదురొస్తే ఇంటర్వ్యూ పోయింది, కారు పోయిందని భాగ్య అంటుంది. కానీ లాస్య మాత్రం కావాలని ఎదురొస్తుంది.


Also Read: మాళవికకి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన భ్రమరాంబిక- విన్నీని చూసి కుళ్ళుకుంటున్న యష్


ఇక ఇంట్లో ఆడవాళ్ళు అందరూ ముగ్గుల పోటీకి దిగుతారు. నందు ఇంటర్వ్యూ జరిగే దగ్గరకి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళంటే ఆఫీసర్ అనుకుని నిలబడి విష్ చేస్తారు. లేటు వయస్సులో ఇంటర్వ్యూకి వచ్చారని వాళ్ళు హేళనగా మాట్లాడితే కాసేపు క్లాస్ తీసుకుంటాడు. అందరూ నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముగ్గు వేసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టాలని తులసి చెప్తుంది. లాస్య ముగ్గు వేస్తూ ఊహాలోకి వెళ్ళిపోతుంది. ‘ముత్యమంతా పసుపు మొహమెంత ఛాయ’ అని సాంగ్ వేసుకుంటుంది.  భాగ్య తనని కదిలించి అలాంటి సాంగ్ లు మనకి సెట్ అవవు అని గాలి తీసేస్తుంది. తులసి రథం ముగ్గు వేస్తుంది. పరంధామయ్య, మోహన్ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా ఉంటారు.


అందరం కష్టపడి ముగ్గులు వేశాం కాబట్టి అందరూ విజేతలలే అని తులసి అంటుంది. కాదు విజేత ప్రకటించాల్సిందే అని ప్రేమ్ అనేసరికి మోహన్ బిక్క మొహం వేస్తాడు. పండగ పూట నా నోటి దగ్గర కూడు ఎందుకు లాగుతారు, ఫుడ్ కావాలి నాకు అని మోహన్ తన భార్య మాధవి విజేత అని పరిగెత్తేస్తాడు. ఇంటర్వ్యూ జరిగే దగ్గర ఇంకా ఎలాంటి పిలుపు రాలేదని అక్కడి వాళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. కానీ నందు మాత్రం కాసేపు ఓపిక పట్టండి అని అంటాడు. అప్పుడే హెచ్ ఆర్ వచ్చి ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక్కడి సీసీ కెమెరాలు మిమ్మల్ని చూస్తూ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూకి నందగోపాల్ ని సెలెక్ట్ చేశాం అని చెప్పడంతో హ్యపీగా ఫీల్ అవుతాడు.


Also Read: సీక్రెట్ గా నందుకి ఉద్యోగం ఇప్పించిన మాజీ భార్య- తులసమ్మ వాకిట్లో ముగ్గుల పోటీ


తులసి మాధవితో మాట్లాడుతూ ఉంటుంది.’ మీ అన్నయ్య చేసిన అవమానం వల్ల నువ్వు ఆత్మాభిమానంతో బంధాన్ని తెంచుకుని ఈ ఇంటికి రాలేదు. నేను కోరుకున్నది ఒక్కటే మీ అన్నాచెల్లెళ్ళు కలిసిపోవడం. పండగ పూట మీరు కలవాలని రమ్మని పిలిచాన’ని తులసి అంటుంది. గొడవ జరిగిన తర్వాత అన్నయ్య ఫోన్ చేసి జరిగిన దానికి సోరి చెప్తాడని మాధవి ఎదురుచూసింది కానీ బావ ఆ విషయమే పట్టించుకోలేదని మోహన్ అంటాడు.


తరువాయి భాగంలో..


తులసి రికమండేషన్ మీద ఉద్యోగం వచ్చిందని నందుకి తెలిసిపోతుంది. ఆఫర్ లెటర్ తీసుకుని చింపేసి కోపంగా ఇంటికి వచ్చి తులసి మీద అరుస్తాడు. తనని నోటికొచ్చినట్టు నానా మాటలు అంటాడు.