ఇంట్లో అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే లాస్య వచ్చి పలకరిస్తుంది. తన పలకరింపుతో నవ్వుతూ మాట్లాడుకుంటున్న అందరూ మొహాలు మాడ్చుకుంటారు. అనసూయకి మందులు తీసుకొస్తాను అని లాస్య ఓవర్ యాక్షన్ చేస్తుంటే అవసరం లేదని పరంధామయ్య అంటాడు. లాస్య ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తుంది కానీ తన మాటల ఎవరు లెక్కచేయరు. అప్పుడే తులసి ఫోన్ చేస్తుంది. తన దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి అనసూయ మొహం వెలిగిపోతుంది. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. అందరూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటారు. అది చూసి లాస్యకి కడుపులో రగిలిపోతూ ఉంటుంది.


తను ఫ్యామిలీకి దూరం అయిన తన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అది చాలని తులసి అనుకుంటుంది. తులసి కోసం హనీ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే తులసి రావడంతో సంతోషంగా తన దగ్గరకి పరుగులు తీస్తుంది. జనరల్ మేనేజర్ గా మీరు చేరి వన్ మంత్ అయ్యింది ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదు కదా. మీరు నాకు చాలా స్పెషల్ నా చెల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో మీకు అంతే ఇస్తాను హనీ చేతితో శాలరీ ఇప్పిద్దామని పిలిచానని చెప్తాడు. హనీ చేత్తో జీతం చెక్ తులసికి ఇప్పిస్తాడు. తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ గృహిణి బాధ్యతల దగ్గరకి వస్తారు. ఆఫీసులో జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు గృహిణి బాధ్యతలు ఒక లెక్క అని సామ్రాట్ అనేసరికి అంత తేలికగా తీసిపారేయకండి అని అది మగాళ్లకి అర్థం కాదని తులసి అంటుంది.


Also Read: నిజం తెలిసి ఆదిత్యని జైలుకి పంపించేందుకు ప్లాన్ వేసిన అభిమన్యు- ఖుషి మీద అరిచిన యష్


చిన్న ఛాలెంజ్ సామ్రాట్ కి విసురుతుంది. ఒక్క రోజు గృహిణి బాధ్యతలు నిర్వహించి చూడండి తెలుస్తుందని అంటుంది. ఆ మాటకి సామ్రాట్ ఒక్క రోజు సీఎం లాగా ఒక్కరోజు గృహిణి బాధ్యతలు చెయ్యాలి, తన జీతంతో చేయాల్సిన పనులన్నీ చెయ్యాలని తులసి ఛాలెంజ్ చేస్తుంది. అందుకు సామ్రాట్ సరే అంటాడు. పరంధామయ్యకి నందు సేవలు చేస్తూ ఉంటాడు. అప్పుడే శ్రుతి, అంకిత వచ్చి కిరాణా సరుకుల లిస్ట్ తెచ్చి ఇస్తారు. అది తీసుకోబోతుంటే లాస్య వచ్చి తీసుకుంటుంది. తులసి వెళ్లిపోతే ఆ స్థానంలోకి వచ్చింది నేనే, కోడలి బాధ్యతలు నావే అని లాస్య అంటుంది. లిస్ట్ నందుకి ఇస్తుంటే నువ్వెందుకు లాక్కున్నావ్ అని లాస్యని అనసూయ అడుగుతుంది.


నందు తీసుకొస్తాడు కదా అని పరంధామయ్య అంటే ఏం పెట్టి తీసుకొస్తాడు డబ్బు ఎక్కడిది, జీతం లేదు ఉద్యోగం లేదని వెటకారంగా అంటుంది. ఇంటి ఖర్చుల విషయం ఇక నుంచి తనే చూసుకుంటానని లాస్య అంటుంది. నీకు మాత్రం జాబ్ ఎక్కడిది అని అనసూయ అంటుంది. సరుకుల లిస్ట్ చూసి వెటకారం చేస్తుంటే అభి, ప్రేమ్ వచ్చి లాగేసుకుంటారు. ఇంటి బాధ్యతలు చూసుకోవాల్సింది మా నాన్న లేదంటే ఆయన కొడుకులుగా మేము అని ప్రేమ్ చురకేస్తాడు. మీకు నచ్చినట్టు మారితే ఇలా చూస్తారు ఏంటి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని అంటుంది. ఆ మాటకి ప్రేమ్ కౌంటర్ వేస్తాడు. నందు కూడా కొడుకులతో కలిసి లాస్యకి వ్యతిరేకంగా ఉంటాడు.


Also Read: హ్యాపీగా ఎంజాయ్ చేసిన రామా, జానకి- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, మల్లిక టెన్షన్ టెన్షన్


సంపాదన లేదని మా నాన్న గురించి మాట్లాడినప్పుడే నీ ఇంటెన్షన్ ఏంటో బయటపడిందని ప్రేమ్ అంటాడు. కరెక్ట్ గా చెప్పావ్ ఇప్పుడు తన డబ్బులతో సరుకులు తీసుకొస్తే నా సంపాదనతో బతుకుతున్నారని అంటావ్ అవసరమా అని అంకిత, శ్రుతి అంటారు. సరుకులు అభి వాళ్ళని తీసుకురానివ్వమని నందు కూడా లాస్యకి చెప్తాడు. తండ్రికి సపోర్ట్ గా నిలిచిన మనవళ్ళని చూసుకుని పరంధామయ్య, అనసూయ సంతోష పడతారు.