ఇంటి బాధ్యతలు దివ్యకి ఇవ్వమని రాజ్యలక్ష్మితో ప్రకాశం అంటాడు. కానీ ప్రసన్న మాత్రం తను విడాకులు తీసుకోబోతుందని ఎందుకు ఇవ్వడమని అంటుంది.
ప్రకాశం: నమ్మి హాస్పిటల్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఇంటి బాధ్యత అప్పగించడం తప్పు కాదు. విక్రమ్ ఇంటి తాళాలు నీ చేత్తో నువ్వే ఇవ్వు
విక్రమ్: నేను ఇవ్వడం కాదు ఈ ఇంట్లో ఏం జరిగినా అది అమ్మ చేతి మీదగానే జరగాలి
రాజ్యలక్ష్మి అయిష్టంగా ఇంటి బాధ్యతల తాళాల గుత్తి దివ్య చేతికి ఇస్తుంది. దాన్ని తీసుకుని దివ్య పొగరుగా అత్త వైపు చూస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది. లక్కీకి లాస్య కాల్ చేస్తుంది.
లక్కీ: ఇక ఫోన్ ఎందుకు చేస్తున్నావ్ మమ్మీ నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు నాకు డాడీ దొరికాడుగా అది చాలు
లాస్య: నువ్వు నా పక్కన లేకపోతే ఇక నా పరిస్థితి ఏంటిరా
Also Read: ఎవరూ ఊహించని ట్విస్ట్ - తెలిసిన ఆదర్శ్ ఆచూకీ, ముకుందని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న భవానీ
లక్కీ: కొత్తగా మాట్లాడతావ్ ఏంటి మమ్మీ నేను హాస్టల్ లో ఉన్నప్పుడు ఉన్నావ్ కదా
లాస్య: హాల్లో అందరి ముందు కిందపడి గోల గోలగా మమ్మీ కావాలని ఏడువు. అప్పుడు నీ గోల భరించలేక ఒప్పేసుకుంటారు
లక్కీ: నేను ఒప్పుకోను. నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటాను. డాడీ దగ్గర నాకు బాగుంది కాల్ చేయకు నన్ను చూడాలని అనిపిస్తే నువ్వే రా అనేసి కాల్ కట్ చేస్తాడు.
దివ్య ఇంట్లో పని చేసే మనిషి వచ్చి డబ్బులు అప్పుగా కావాలని పిల్లోడు ఫీజు కట్టాలని అడుగుతుంది. వెంటనే డబ్బు తీసుకొచ్చి ఇచ్చిన దివ్య ఇవి తిరిగి ఇవ్వాలసిన పని లేదు బాగా చదువుకోమని చెప్తుంది. ఎవరిని అడిగి డబ్బులు ఇచ్చావని రాజ్యలక్ష్మి కోపంగా అడుగుతుంది. ఆ మాటకి దివ్య కాసేపు సోది క్లాస్ పీకుతుంది. ఎంట్రీ ఇచ్చిన ప్రకాశం కోడలికి సపోర్ట్ చేస్తూ పెళ్ళానికి కౌంటర్ వేస్తాడు. తను అత్త సొమ్ము దానం చేయడం లేదని మామ సొమ్ము దానం చేస్తున్నానని అంటుంది. కుదురుగా ఉండకపోతే రెండో కాలు కూడ బెండ్ అవుతుందని అత్తకి వార్నింగ్ ఇస్తుంది. తన పక్కనే కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పని చేసుకుంటుంది. మావయ్య సూపర్ అని మెచ్చుకుంటాడు.
నందు తలనొప్పిగా ఉందని బామ్ రాసుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాడు. తనకి సాయం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడాని వెళ్ళి కాసేపు తలకి మసాజ్ చేస్తాడు. కళ్ళు తెరిచిన నందు ఎందుకు వచ్చావని అరుస్తాడు. భయపడితే లాభం లేదనుకుని ముద్దు చేసి నచ్చజెప్పి వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని నందు అనుకుంటాడు. వెంటనే నవ్వుతూ లక్కీతో మాట్లాడతాడు. వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చట చెప్తుంటే తులసి వస్తుంది. వాడిని దగ్గరకి తీసుకుని వీడి అమ్మ కూడా ఇలాగే మాటలు చెప్పిందని తిట్టుకుంటాడు.
నందు: నేను నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చానా? అని లక్కీని అడగ్గానే ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటాడు
లక్కీ: లేదు.. అలా చెప్తే నీకు దగ్గరగా ఉండవచ్చని ఆశ పెట్టారు
Also Read: రాజ్ ఉగ్రరూపం, అర్థరాత్రి వర్షంలో ఇంటి బయట కావ్య- సంబరపడుతున్న రుద్రాణి బ్యాచ్