రాజ్ మట్టి తొక్కుతున్న ఫోటో చూసి అపర్ణ కోపంతో ఊగిపోతుంది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. తను పెట్టిన మంట రాజుకుందని రుద్రాణి మెల్లగా జారుకుంటుంది. అందరూ హాల్లో ఉండగా కావ్య ఇంటికి వస్తుంది. తన గదికి పైకి వెళ్లబోతుండగా అపర్ణ చెయ్యి అడ్డం పెట్టి ఆపుతుంది.


అపర్ణ: నా కొడుకు గురించి ఏంఅనుకుంటున్నావ్. తను దుగ్గిరాల ఇంటి వారసుడు. తను ఎవరో తెలిసి కూడా నీ స్థాయికి దిగజార్చావా?


కావ్య: మాది అంత దిగజారిన స్థాయి ఏం కాదు. అయినా ఇప్పుడు ఏం జరిగింది


అపర్ణ: నీ నిరుపేద స్థాయికి నా కొడుకుని ఎందుకు లాగుతున్నావ్. నీతో పాటు మట్టి తొక్కించావా లేదా?


కావ్య: ఓహో అక్కడ మీరో మీ అబ్బాయి దృష్టి పెట్టారు అన్నమాట. రుద్రాణి గారు నేను పుట్టింటి నుంచి వచ్చే లోపు మా అత్తయ్యని రెచ్చగొట్టి భలే నిలబడతారు


రుద్రాణి: అసలు నువ్వు ఏం చేశావో తెలుసా?


కావ్య: అసలు నేను రోజు ఇంటికి రాగానే ఇంట్లో ఈ రచ్చ ఏంటి?


Also Read: నందుని ఇరికించిన లక్కీ, అపార్థం చేసుకున్న తులసి- ఇంటి తాళాలు దివ్య చేతికి


అపర్ణ: నువ్వు ఏ మట్టిలో అయినా మునుగు నాకు అనవసరం. నా కొడుకుతో ఎందుకు ఆ పని చేయించావు


రుద్రాణి: కాస్త అలుసు ఇస్తే రాజ్ తో బొమ్మలు చేయించి అంగట్లో అమ్మేసేలా కూడా చేస్తారు


కావ్య: నాకు నా భర్త అంటే గౌరవం ఉంది. అయినా మీడియాకి వేరే పని లేదా మా ఇద్దరి చుట్టు తిరుగుతూ మా మీద ఫోకస్ పెడుతున్నారు. వరుసగా జరిగే గోడవలకు కారణం మీరు, మీ కొడుకు. కాదు అని ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పమనండి


అపర్ణ: ఇక ఆపు. ఎవరు చెప్పినా నిజాలు గ్రహించగలను. నా కొడుకుని పావుగా మార్చేసే ఒక మట్టి మనిషిగా తయారు చేసి కూలీ మనిషిగా మారిస్తే నిన్ను క్షమించేదే లేదు


కావ్య: అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేను డిజైన్స్ వేసి ఇచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి మా ఇంటికి ఇస్తే మీకు నచ్చదు. మాయన నన్ను వెనకేసుకొస్తే ఇలాంటి వాళ్ళ ముందు సమర్థిస్తే మీరు తట్టుకోలేరు. ఎక్కడ భార్యగా ఒప్పేసుకుంటాడోనని భయం. ఎక్కడ మేమిద్దరం ఒక్కటి అయిపోతామని భయం. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మీ కొడుక్కి చూపించి నన్ను మాటలు అనే వరకు నిద్రపోరు. మీకు నేను ఎప్పటికీ కోడలిగా పనికిరానని మీ కొడుకు భార్యగా చూడకూడదా? మా ఇద్దరినీ విడదీసి నన్ను బయటకి గెంటేసి కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారా? అసలు మీరు మీ కొడుక్కి కన్న తల్లేనా అనేసరికి రాజ్ కోపంగా ఏమన్నావ్ అని తన మీదకి చెయ్యి ఎత్తుతాడు


రాజ్: మా అమ్మని ఏమంటున్నావ్


కావ్య: నేను ఈ ఇంట్లో ఉండటం మీ అమ్మకి ఇష్టం లేదు


రాజ్: అయితే నేనే చెప్తున్నా.. నువ్వు మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు


ధాన్యలక్ష్మి: ఇదంతా రుద్రాణి పెట్టిన పెంట


రాజ్: ఇది నాకు మా అమ్మకి, కళావతికి మధ్య జరిగిన గొడవ. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కానీ ఇంటి పెద్దవాళ్ళు చెప్పినందుకు గదిలో రానిచ్చాను. అన్నింటికీ పెద్దవాళ్ళని అడ్డం పెట్టుకుని హక్కులు సాధించుకున్నావ్. నువ్వు నాకు భార్యగా నచ్చనప్పుడు నిన్ను మా అమ్మ కోడలిగా ఎందుకు ఒప్పుకోవాలి. ఆవిడ ఏమైనా సంప్రదాయబద్ధంగా నిన్ను చూసి తన చేతుల మీదగా పెళ్లి జరిపించిందా? కానీ నువ్వు ఏం చేశావ్ నీ పుట్టిల్లు అంటూ మా అందరినీ బజారుకు ఎక్కించావ్. అయినా మా అమ్మని ఊరుకుంది. అలాంటి అమ్మని పట్టుకుని ఇలా మాట్లాడతావా? నువ్వు ఎంత నీ స్థాయి ఎంత?ఇన్నాళ్ళూ నేను అన్నింటినీ సహించాను. కానీ నువ్వు నీకిచ్చిన స్వేచ్చని దుర్వినియోగం చేసుకున్నావ్. మా అమ్మని అనే స్థాయికి వెళ్లిపోయావ్. నీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నీకు ఈ ఇంట్లో స్థానమే లేదు. వెళ్లిపో


ఇంద్రాదేవి రాజ్ ని ఆగమని చెప్తున్నా కూడ వినిపించుకోకుండా కావ్యని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాడు. నన్ను ఆపి ఇలాంటి వాళ్ళని అందలం ఎక్కించారు. ఇందులో ఎవరు జోక్యం చేసుకున్నా నాకు నచ్చదు


కావ్య: నేను ఎక్కడికి వెళ్ళాలి


రాజ్: నీ ఇంటికి వెళ్ళు, పరాయి వాళ్ళకి ఈ ఇంట్లో స్థానం లేదు


కావ్య: నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఇంట్లోకి రానివ్వకపోతే ఈ ఇంటి గడప దగ్గరే ఉంటాను.  


Also Read: అభిమన్యు కుట్ర తెలుసుకున్న నీలాంబరి- రౌడీల బారి నుంచి మాళవికని కాపాడిన వేద


రాజ్: ఇప్పుడు గడప బయటకి గెంటేశాను. ఎక్కువ మాట్లాడితే వీధిలోకి గెంటేస్తాను. నా కన్న తల్లిని అవమానిస్తే ఊరుకొను. ఈరోజుతో ఈ ఇంటికి నీకు రుణం తీరిపోయిందని మొహం మీద తలుపులు వేసి ఆవేశంగా గదిలోకి వెళ్ళిపోతాడు. కావ్యని గెంటేసినందుకు రుద్రాణి, స్వప్న, రాహుల్ తెగ ఆనందపడతారు. అప్పుడే బయట ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. కానీ కావ్య మాత్రం తడుస్తూ ఇంటి ముందే నిలబడి ఉంటుంది. కళ్యాణ్ రాజ్ దగ్గరకి వెళ్ళి తప్పు చేశావని అంటాడు.


రాజ్: నాకు రైట్ అనిపించింది నీకు తప్పని అనిపిస్తే నేనేం చేయలేను. ఆమె మా అమ్మని ఎదిరించి మాట్లాడటం కరెక్ట్ అనిపించిందా?


కళ్యాణ్: వదిన ఏ తప్పు చేయలేదు అది నీకు తెలుసు


రాజ్: ఈ గడప తొక్కేలోపు తను ఏ తప్పు చేయకపోవచ్చు. కానీ అమ్మ దృష్టిలో నేను మట్టి తొక్కడం నచ్చలేదని నిలదీస్తే ఇలాగేనా మాట్లాడేది


కళ్యాణ్: అది తప్పని అనిపిస్తే భర్తగా నువ్వు నిలదీయాలి అంతే కానీ కట్టుకున్న భార్యని చీకట్లో వర్షంలో బయటకి గెంటేయడం తప్పు


రాజ్: కళావతి మా అమ్మని ఎదిరించింది మీ అమ్మని కాదని మాట్లాడుతున్నావా?


కళ్యాణ్: వెళ్ళు పిలువు ప్లీజ్


రాజ్: వర్షంలో ఇంటి బయట నిలబడమని నేను చెప్పలేదు. నీలాంటి వాళ్ళ సానుభూతి సంపాదించుకోవడం కోసం ఇలా చేస్తుంది. నువ్వు మీ వదిన్నీ అలా చూడలేకపోతే తీసుకెళ్ళి పుట్టింటి దగ్గర దిగబెట్టి రా


కళ్యాణ్: నేను వదిలిపెట్టను సోరి అన్నయ్య


రేపటి ఎపిసోడ్లో..


కనకం, కృష్ణమూర్తి కావ్య దగ్గరకి వస్తారు. నీకు ఇంత శిక్ష వేస్తారా? వీళ్ళు మనుషులా రాక్షసులా అని కనకం ఆవేశంగా ఇంటి గుమ్మం నెడుతుంది.