అనసూయ, పరంధామయ్య పాయసం తినడానికి దొంగల్లా కిచెన్ లోకి వెళ్ళి తులసికి పట్టుబడిపోతారు. కాసేపు నవ్వుకుంటారు. హనీ దిగులుగా కూర్చుని ఉంటుంది. ఏంటమ్మా ఒక్కదానివే కూర్చున్నావ్ అని సామ్రాట్, పెద్దాయన వచ్చి అడుగుతాడు. మరి ఏం చెయ్యను మీరిద్దరు పనుల్లో బిజీగా ఉన్నారు స్కూల్ కి వెళ్ళడానికి లేదని అంటుంటే అప్పుడే లాస్య, నందు వచ్చి నీకు ఆడుకోవడానికి పెద్ద బొమ్మ తీసుకుని వచ్చామని అంటుంది. ఏది అనేసరికి లక్కీని చూపిస్తుంది. లక్కీని చూసి హనీ సంతోషిస్తుంది. ఇద్దరు వెళ్ళి సరదాగా ఆడుకుంటారు. సామ్రాట్ లాస్య వాళ్ళకి థాంక్స్ చెప్తాడు. తులసి కూడా అప్పుడే హనీ కోసం టిఫిన్ తీసుకుని వస్తుంది.
హనీకి ఎలా ఉందో అని ఆలోచనే ఎక్కువగా ఉందని తులసి అంటుంది. హనీ, లక్కీ ఇద్దరు తులసిని చూసి సంతోషంగా వచ్చి తనని కౌగలించుకుంటారు. వాళ్ళిద్దరికి తులసి దగ్గర ఉండి మరి తినిపిస్తుంది. తులసిగారిలో తల్లి ప్రేమ కనిపిస్తుందని సామ్రాట్ అంటాడు. త్వరలోనే తులసిని సామ్రాట్ తల్లిని చేస్తాడులే అని లాస్య నందుతో అంటుంది. ఈరోజు నుంచి మన ఆఫీసు ఇంట్లోనే ఆ ఏర్పాట్లు చూడామని సామ్రాట్ నందుకి చెప్తాడు. లక్కీ, హనీ సంతోషంగా ఆడుకుంటూ ఉండటం సామ్రాట్ చూస్తూ ఉంటే తులసి వస్తుంది. ఇప్పుడు అందరూ ఉన్నారు సంతోషంగా ఆడుకుంటుంది కానీ సాయత్రం అయ్యేసరికి ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోతారు అదే బాధగా ఉందని సామ్రాట్ అంటాడు. కొద్ది రోజులు కూడా ఈ సంతోషం నిలబడదని దిగులు, నా బాధ తనకి కనపడనివ్వను, తన బాధ నాకు కనపడనివ్వదు బయట పడితే ఒకరినొకరు ఓదార్చుకోలేమని తెలుసు అందుకే బాధని దిగమింగుకుంటూ లేని సంతోషాన్ని నటిస్తూ ఉంటాం.
Also Read: యష్ ని తన వెంట తిప్పుకుంటా అని వేదతో ఛాలెంజ్ చేసిన మాళవిక- చిత్ర, వైభవ్ ని చూసి బాధపడుతున్న వసంత్
వయసు చిన్నది అయినా పెద్దదానిలా ప్రవర్తిస్తుందని సామ్రాట్ తన బాధ అంతా తులసి ముందు వెళ్లగక్కుతాడు. ఇలాంటి పరిస్థితిలో ఆడపిల్ల ఒక్కతే ఉండకూడదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా మీరు కాదనకూడదు. కొద్ది రోజులు తనని మా ఇంట్లో ఉంచుకుంటాను అని తులసి సామ్రాట్ ని అడుగుతుంది. నన్ను వదిలి హనీకి వెళ్ళే ధైర్యం ఉందేమో కానీ తనని వదిలి నేను ఉండలేను అని సామ్రాట్ చెప్తాడు. మీ ప్రపోజల్ కి ఒప్పుకుంటా కానీ ఒక చిన్న కండిషన్.. పాపని మీ ఇంటికి తీసుకెళ్ళే బదులు మీ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఇక్కడే ఉండొచ్చు కదా అని సామ్రాట్ అడుగుతాడు. ఇంట్లో అందరి తరపున నేను నిర్ణయం తీసుకోలేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నిర్ణయం చెప్తాను అని తులసి అంటుంది.
ఇంట్లోనే ఆఫీసు అంటే చాలా చిరాకుగా ఉందని నందు అంటాడు. తులసి మొహం చూడలేకపోతున్నా అని నందు, లాస్య అనుకుంటారు. లక్కీ, హనీల ఫ్రేండ్షిప్ అడ్డు పెట్టుకుని మనం సామ్రాట్ కి దగ్గర అవ్వాలని లాస్య చెప్తుంది. అది సరే ముందు నీ కొడుకు ఆ తులసికి దగ్గర అవుతున్నాడు అది చూసుకో అని హెచ్చరిస్తాడు. ప్రతిసారీ నా కొడుకు అంటావ్ ఏంటి పెళ్లి కాక ముందు వరకు నా కొడుకే కానీ మన పెళ్లి అయ్యాక నీకు కొడుకే అవుతాడు అని లాస్య కోపంగా చెప్తుంది. ఇక సామ్రాట్ ప్రపోజల్ తులసి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అభి ఫైర్ అవుతాడు. వాళ్ళ పాపకి బాగోకపోతే మనం అందరం వెళ్ళి ఆయన ఇంట్లో ఉండటం ఏంటని సీరియస్ అవుతాడు. ఎందుకు ప్రతి విషయం నెగటివ్ గా ఆలోచిస్తావ్ అని ప్రేమ్ అంటాడు.
Also Read: రాధతో ఏడడుగులు వేసిన మాధవ్ - ఆదిత్యే రాధ భర్త అని తెలుసుకున్న జానకి
తల్లి లేని హనీకి సాయం చెయ్యడం తప్పా అని అనసూయ అడుగుతుంది. సామ్రాట్ గారికి కావలసినంత డబ్బు ఉంది ఆయన ఏర్పాట్లు చేసుకోగలడు. అయినా హనీకి హెల్ప్ చేయవద్దని చెప్పలేదు కదా తనని ఇక్కడికి తీసుకొద్దామని అనుకున్నాం కదా అని అభి అంటాడు. నువ్వు ఏ పని సక్రమంగా చేయనివ్వవు అన్నింటికీ అడ్డం పడతావు అని అనసూయ, పరంధామయ్య సర్ది చెప్పేందుకు చూస్తారు. ప్రతిదీ ఆయన చెప్పినట్టే చెయ్యాలా, నీ ఆఫీసుకె కాదు ఇంటికి కూడా ఆయనే బాస్ లా తయారయ్యాడని అభి కోపంగా అంటాడు. పోనీ ఒక పని చెయ్యి అమ్మని ఒక్కదాన్ని ఆ ఇంటికి పంపిద్దాం మనం ఇక్కడే ఉందామని ప్రేమ్ అంటే అది ఎలా కుదురుతుందని అభి అంటాడు.
ఏదో ఒకటి కుదరాలి కదా ఆంటీ మనకి ఇంట సపోర్ట్ చేస్తున్నపుడు మనం సాయం చెయ్యాలి కదా అని అంకిత అంటుంది. ఒక్కసారి ఆలోచించు అని తులసి అభిని అడుగుతుంది. హనీ కి మనమే కుటుంబం అయితే బాగుంటుందని లాస్య చెప్తుంది. మీరు ఎన్ని అయినా చెప్పండి నా నిర్ణయం మారదు అని అభి తేల్చి చెప్తాడు. రేపు మనం సామ్రాట్ ఇంటికి వెళ్ళి తీరుతున్నాం ఇందులో ఎటువంటి మార్పు లేదని అటు లాస్య నందుతో చెప్తుంది. మీ డెసిషన్ మీరు తీసుకోండి అని గొర్రెలా ఫాలో అవుతాను అని అభి అంటాడు. రేపే మనం సామ్రాట్ గారి ఇంటికి వెళ్తున్నాం అని తులసి చెప్తుంది.
సామ్రాట్ హ్యాపీగా మందు తాగుతూ ఉంటాడు. తులసి గారి ఫ్యామిలి అంతా ఒక వారం పాటు మన ఇంటికి ఉండటానికి వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది, మన ఇంట్లో పండగ వాతావరణం ఉంటుందని సామ్రాట్ సంతోషంగా ఉంటాడు. నాకు సంతోషంగా ఉంది వారం రోజుల పాటు సందడే సందడి అని పెద్దాయన కూడా అంటాడు. సమస్యకి తాత్కాలిక పరిష్కారం వెతకడం కాదు శాశ్వత పరిష్కారం కావాలని అంటాడు. దొరికిన అదృష్టానికి సంతోషించాలి కానీ దొరకని దాని కోసం ఎందుకని అంటాడు.
తరువాయి భాగంలో..
తులసి, లాస్య ఫ్యామిలీ మొత్తం సామ్రాట్ ఇంటికి వచ్చి సంతోషంగా హనీతో ఆడుకుంటూ ఉంటారు. నందు తులసితో అర్జెంట్ గా నా వల్లని తీసుకుని వెళ్లిపో అని అంటాడు. నువ్వు హనీకి సేవ చెయ్యడానికి వచ్చినట్టు లేదు ఈ ఇంటి మనిషిగా వచ్చినట్టు ఉందని అనేసరికి తులసి షాక్ అవుతుంది.