దేవుడమ్మ రుక్మిణికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. పెద్ద మనసు చేసుకుని దేవికి నచ్చజెప్పి ఇంటికి పంపించమని అడుగుతుంది. ఒకవేళ తను నువ్వు చెప్పినా కూడా వినకపోతే నేనే స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పి తీసుకొచ్చుకుంటాను. దేవిని త్వరగా మా ఇంటికి పంపించే బాధ్యత నీదే అని దేవుడమ్మ చెప్తుంది. నీ ఇంటి బిడ్డని నీ ఇంటికి పంపించమని బతిమలాడుకోవడం ఏంటి అత్తమ్మ, అది మీ రక్తం, మీ వారసురాలు అని రుక్మిణి బాధపడుతుంది. రాధాని నా దాన్ని చేసుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు, కానీ నేను దగ్గర అవ్వాలనుకునే కొద్ది దూరం అయిపోతుంది. ఇప్పటికే చాలా సార్లు మాటలు పడ్డాను. రాధాని ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరతాను. ఇప్పటి వరకు అందరి దృష్టిలో రాధ నా భార్య. కానీ ఇక నుంచి తను నిజంగానే నా భార్య కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా రాధ నా భార్యగా నా పక్కనే ఉండాలి. చిన్మయిని అడ్డం పెట్టుకుని ఈసారి రాధాని ఒప్పించాలని అనుకుంటున్నా అని మాధవ్ దేవుడి ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటాడు.


మాధవ్ రాధ దగ్గరకి వచ్చి మనం శ్రీశైలం వెళ్ళాలి అని అడుగుతాడు. నువ్వు వెళ్ళు నేను ఎక్కడికి రాను అని రాధ కోపంగా చెప్తుంది. అది నా భార్య చివరి కోరిక చిన్మయి కోసం అయినా రమ్మని అడుగుతాడు. ‘చిన్మయి జాతకంలో నాగదోషం ఉంది అది పోయేలా చెయ్యడానికి పూజ చెయ్యాలి. కానీ ఈలోపే యాక్సిడెంట్ జరగడం చిన్మయి తల్లి లేకుండా నువ్వు రావడం జరిగింది. చిన్మయి కోసం నువ్వు శ్రీశైలం రావాలి. నాకోసం నువ్వు రావు కానీ నా బిడ్డ కోసం వస్తావు’ అని ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు.


Also Read: ట్విస్ట్ అదుర్స్, కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చేలా చేసిన మోనిత- ఫుల్ ఖుషీలో వంటలక్క, రంగంలోకి దిగిన సౌందర్య


ఇంతగా చెప్తున్నాడు అంటే అసలు నమ్మకంగా లేదు, చిన్మయికి నాగదోషణం ఉంటే ఇప్పటికిప్పుడు శ్రీశైలం పోవడం ఏంటి, ఏదో ఉంది మళ్ళా ఏదో మతలబు చేస్తున్నాడు అని రాధ అనుకుంటుంది. చిన్మయికి నాగదోషమా ఏ పూజారి చెప్పాడు వీడికి అని జానకి కూడా ఆలోచిస్తుంది. గతంలో చిన్మయి జాతకం చూపించడానికి పూజారి దగ్గరకి తీసుకెళ్లిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. పాప జాతకం చాలా బాగుంది ఎటువంటి దోషాలు లేవని పూజారి చెప్తాడు. మరి లేని దోషం ఉందని చెప్పి శ్రీశైలం వెళ్దాం అంటే ఏంటి వీడి ఉద్దేశం అని జానకి ఆలోచనలో పడుతుంది.  


రాధ మొక్కలు నాటి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తుంది. తనని చూస్తూ ఉంటాడు మాధవ్. తర్వాత తను వెళ్లిపోగానే రాధ తడి అడుగుల్లో అడుగులు వేస్తూ వస్తుండటం జానకి చూస్తుంది. ఏడు అడుగులు వేసి లెక్కబెట్టుకుని తాళి కట్టకుండానే ఏడు అడుగులు నడిచేశాను, నువ్వు నా భార్యావి కాకపోయినా నువ్వే నా భార్యవి అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టకుండానే ఏడు అడుగులు వేసేశాను’ అని మాధవ్ అనుకోవడం చూస్తుంది. ఏంటి ఇది ఏం చేస్తున్నావ్ నీకైనా అర్థం అవుతుందా అని మాధవ్ ని నిలదిస్తుంది జానకి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ ప్రవర్తన ఏమి బాగోలేదని అంటుంది.


Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!


చిన్మయికి ఏ దోషం లేకపోయినా శ్రీశైలం తీసుకుని వెళ్తా అంటున్నావ్, చాటుగా రాధతో తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నావ్ అని జానకి కోపంగా అడుగుతుంది. ‘ఇంట్లో ఎవరికి ఏ దోషం లేదమ్మా ఉందంతా నాకే ఆ దోష నివారణ పోవాలంటే ఇంట్లో ఉంటే సరిపోదు అందుకే దూరంగా తీసుకుని వెళ్తున్న దోష నివారణ పూర్తవగానే ఇంటికి వస్తాను. అప్పుడు నీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరుకుతాయని’ చెప్తాడు. ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక ఫోన్ తియ్యడం లేదని రుక్మిణి బాధపడుతుంది. ఆదిత్య మళ్ళీ ఫోన్ చేసి రుక్మిణితో కోపంగా మాట్లాడతాడు.


తరువాయి భాగంలో..


ఆదిత్య, రుక్మిణి ఒక చోట కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాధవ్ సారు శ్రీశైలం పోవాలని అనుతున్నాడాని రాధ ఆదిత్యతో చెప్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అప్పుడే అటుగా జానకి వల్లని చూసి కారు ఆపి వాళ్ళ దగ్గరకి వస్తుండగా రాధ ఆదిత్యని పెనీమిటి అని పిలుస్తుంది. అది విని జానకి షాక్ అవుతుంది.