శివ అటు ఇటు తిరుగుతూ ఉంటే కార్తీక్ ఏమయ్యా వెంకటేష్ అని పిలుస్తాడు. నా పేరు శివ సార్. మా పేర్లు మచ్చిపోతారు కానీ ఆ వంటలక్క పేరు మాత్రం గుర్తుంటది అని శివ అంటాడు. అప్పుడే దీప ఆ ఇంటికి వచ్చి కిటికీ దగ్గర నిలబడి కార్తీక్ ని చూస్తూ మాటలు వింటుంది. అవునయ్యా వంటలక్క పేరు గుర్తుంటది, తను మాట్లాడిన మాటలు గుర్తుంటాయి అదేంటో అర్థం కావడం లేదని అంటాడు. అదే డాక్టర్ బాబు బంధం అంటే అని దీప అనుకుంటుంది. మేడమ్ ఊర్లో లేదు కదా మీరు ఏమి అనుకొకపోతే రాత్రికి మందు తెచ్చుకుంటాను సర్ అని శివ అడుగుతాడు. ఏంటి మందా.. అని కార్తీక్ అంటాడు. ఎంత మందు తాగుతావయ్యా అని అడుగుతాడు. హాఫ్ సార్ అని అంటాడు. ఫుల్ తీసుకుని రా నేను కూడా తాగుతాను అని అంటాడు. మందు తాగే అలవాటు ఎందుకు లేదు భార్యతో కలిసి తాగడం బాగా అలవాటు. ఇదే సరైన టైమ్ డాక్టర్ బాబుకి దగ్గర అవడానికి అని దీప అనుకుంటుంది.
సౌందర్య మోనిత తన పిల్లాడిని ఎందుకు తీసుకెళ్ళిందా అని ఆలోచిస్తుంది. తల్లి కదా ప్రేమతో తీసుకుని వెళ్ళి ఉంటుందని ఆనందరావు అంటాడు. దాని మొహం అది కన్న తల్లి ఏంటి దానికి అంత ప్రేమ ఉండదు, ఆస్తి వదిలేసి బిడ్డని మాత్రమే తీసుకుని వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి అని ఆనందరావుని అడుగుతుంది. అంతక మించి విలువైనది ఏదో తనకి దక్కి ఉండాలి, కానీ ఆస్తి కన్నా, బిడ్డ కన్నా విలువైనది ఏముంటుందని ఆనందరావు అడుగుతాడు. ఇంకేముంది మన కొడుకే అని సౌందర్య అంటుంది. కొడుకుని పక్కన పెట్టుకుని ఏదో ఘన కార్యం చెయ్యాలని చూస్తుంది, పైగా బిడ్డ మీద మమకారంతో చూడటానికి వస్తాను అంటే రావొద్దని చెప్పింది. అది కూడా కార్తీక్ కి ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉంటుంది. అంటే ఖచ్చితంగా కార్తీక్ కి సంబంధించిన పనే. కార్తీక్ చనిపోయినప్పుడు తెల్ల చీర కట్టుకుంది మళ్ళీ ఇప్పుడు రంగుల చీర కట్టుకుంటుంది. ఏదో జరుగుతుంది. అదేంటో నేనే వెళ్ళి తెలుసుకుంటాను’ అని సౌందర్య చెప్తుంది.
Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!
శివ ఎగురుకుంటూ మందు బాటిల్ తీసుకుని వెళ్తుంటే దీప పిలుస్తుంది కానీ రాకుండా ఉంటాడు. కానీ తమ్ముడు శివ అని మళ్ళీ పిలుస్తుంది. ఇక చేసేది లేక వస్తాడు. నువ్వు పిలవకు మా మేడమ్ చంపేస్తుందని అంటాడు. బాటిల్ తీసుకుని వెళ్తున్నావ్ పార్టీకా మరి నంచుకోవడానికి చికెన్ పకోడీ వద్దా అని ఆశ పెడుతుంది. కావాలి అనేసరికి సరే నువ్వు వెళ్ళు నేనే తీసుకొని వస్తాను అంటుంది. శౌర్య కోపంగా వారణాసిని తీసుకుని వచ్చి నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతుంది. నువ్వు అబద్దం చెప్తున్నావ్ తాతయ్య పంపిస్తేనే వచ్చావ్ కదా అని అడుగుతుంది. శౌర్యకి అనుమానం వచ్చింది కానీ ఆనందరావు గారు పంపించారని తెలిస్తే నన్ను పంపించేస్తుందని మనసులో అనుకుంటాడు. నాకు తెలుసు తాతయ్య పంపిస్తేనే వచ్చావు, నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అంతా వాళ్ళకి చెప్తున్నావ్ అని అంటుంది. లేదమ్మా నేను అలా చేయడం లేదని చెప్తాడు.
కార్తీక్ మందు తాగుతూ ఉంటే దీప చికెన్ పకోడీ పట్టుకుని వస్తుంది. కార్తీక్ నవ్వుతూ పలకరిస్తాడు. మేడమ్ అన్నీ మాటలు అన్నా ఈవిడ చాలా నిజాయితీ కనిపిస్తుంది, కానీ మేడమ్ మాత్రం నాటకం అంటుంది. ఇందులో నిజం ఏంటో కనుక్కుందాం అని శివ వెళ్ళి దీపని అడగబోతుంటే కార్తీక్ పిలుస్తాడు. దీప కార్తీక్ దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. శివ ఫోన్ వచ్చి పక్కకి వెళ్ళిపోతాడు. మీరు ఇలా మందు తాగడం చూస్తుంటే నేను డాక్టర్ బాబుతో కలిసి మందు తాగినడి గుర్తుకు వస్తుందని చెప్తుంది. కార్తీక్ దీప జరిగింది అంతా చెప్తుంది. భలే సరదాగా ఉంది వంటలక్కా మీ డాక్టర్ బాబుకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటాడు. ప్రాణం డాక్టర్ బాబు మా లోకంలో ఉండాల్సిన ఆయన వేరే లోకంలో ఉంటున్నారు. మమ్మల్ని ఎప్పడూ గుర్తు పడతారో అని ఎదురు చూస్తున్నా అని ఏడుస్తుంది. కానీ కార్తీక్ ఆ మాటలు వినకుండానే నిద్రపోతాడు. శివ, దీప కార్తీక్ ని తన గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు. శివ వెళ్లిపోగానే దీప కార్తీక్ గదిలో ఉన్న మెడికల్ రిపోర్ట్ తీసుకుంటుంది.
Also Read: బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత,దీప చేతిరాత గుర్తుపట్టిన శౌర్య - వంటలక్క ఏం చేయబోతోంది!
తరువాయి భాగంలో..
దీప కార్తీక్ కి కాఫీ ఇస్తుంటే మోనిత బిడ్డతో వచ్చి కప్పు విసిరేస్తుంది. ఈ బాబు ఎవరు అని కార్తీక్ అడుగుతాడు. ఈయనకి బాబు బాగా అలవాటు కదా ఎత్తుకుంటే జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయేమో అని దీప మనసులో అనుకుంటుంది. బాబు ఏడుస్తుంటే డాక్టర్ బాబు మీరు ఎత్తుకుని చూడండి బాబు ఏడుపు ఆపేస్తాడేమో అని దీప చెప్తుంది. కార్తీక్ బాబుని ఎత్తుకోగానే ఏడుపు ఆపేశాడు ఏంటి అని మోనిత ఆలోచనలో పడుతుంది. బాబు నా దగ్గరకి రాగానే ఏడుపు ఆపేశాడు అని కార్తీక్ అనేసరికి బాబుని చూడగానే ఏమైనా గుర్తుకు వస్తున్నాయా అని దీప అడుగుతుంది.