Janaki Kalaganaledhu August 9th: జానకి తన గదిలో వెన్నెలకు వచ్చిన సంబంధం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అని అర్థం కాకుండా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి గోవిందరాజులు వస్తాడు. ఇక ఆయన జానకితో వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడటంతో.. ఆ సంబంధం వెన్నెలకు ఇష్టం లేదు అని.. తను మరొకరిని ఇష్టపడుతుందని చెప్పటంతో గోవిందరాజులు షాక్ అవుతాడు.


వెన్నెల అప్పుడే అంత పెద్దది అయ్యిందా..  తన భాగస్వామిని తనే ఎంచుకుంటుందా అని అంటాడు. అయిన జ్ఞానంబకు ప్రేమ పెళ్లిళ్లు ఇష్టం లేదు అని అనటంతో వెంటనే జానకి.. తను అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని.. అతడు చాలా బుద్ధిమంతుడని.. దైవభక్తుడని చెప్పటంతో గోవిందరాజులు జానకి మాటలు నమ్మి వెన్నెల ప్రేమ పెళ్లికి ఒప్పుకుంటాడు.


ఇక జానకి ఈ విషయం అత్తయ్య గారికి చెప్పి మీరే ఒప్పించాలి అని అనటంతో గోవిందరాజులు కాస్త టెన్షన్ పడతాడు. సరే ఒప్పించే ప్రయత్నం చేస్తాను అని అంటాడు. ఇక గోవిందరాజులు తన భార్య దగ్గరికి వెళ్ళగా తను వచ్చిన సంబంధం గురించి ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ గోవిందరాజులు ఆ సంబంధం వద్దు అన్నట్లు పైగా ఇద్దరు ఆడపడుచులు కూడా ఉన్నారు అని అనటం తో అలా ఎందుకంటారు వాళ్ళు బాగానే ఉంటారేమో అని అంటుంది జ్ఞానంబ.


కానీ ఊర్లో ఒక సంబంధం ఉంది.. తెలిసిన వాళ్లతో ఒక సంబంధం చూశాను.. అబ్బాయి చాలా మంచివాడు అని అనటంతో మరి మా అన్నయ్య వాళ్లకు ఏం చెప్పాలి అని అంటుంది జ్ఞానంబ. ఆ సంగతి నేను చూసుకుంటాను రేపు ఆ సంబంధం వాళ్లని ఇక్కడికి రమ్మంటాను అని అంటాడు. దానికి ఆవిడ సరే అంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే జానకి ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.


మరోవైపు వెన్నెల కూడా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఇక గోవిందరాజులు జానకి దగ్గరికి వచ్చి వెన్నెల ఇష్టపడిన అబ్బాయితో జ్ఞానంబ పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పటంతో జానకి సంతోషపడుతుంది. ఇక ఈరోజే వాళ్లను ఇక్కడికి రమ్మని చెప్పమని అంటాడు. గోవిందరాజులు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఆ మాటలు విన్న వెన్నెల అక్కడికి వచ్చి తన వదినని పట్టుకొని సంతోషపడుతుంది.


ఆ తర్వాత కిషోర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రులతో ఇంటికి రమ్మని చెబుతుంది జానకి. దానికి కిషోర్ కూడా సరే అంటాడు. ఇక తన ప్లాన్ సక్సెస్ అవ్వబోతుంది అని అనుకుంటాడు. మరోవైపు జ్ఞానంబ రామకు ఫోన్ చేసి వెన్నెలకు పెళ్లిచూపులని ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక జానకి మలయాళం దగ్గరికి వెళ్లి స్వీట్లు, హాట్ చేయమని చెబుతుంది. ఇక ఈ విషయం మల్లికకు తెలియకూడదు అని లేదంటే ఏదో ఒకటి చేస్తుంది అని గోవిందరాజులు మాట్లాడుతుండగా ఆ మాటలు మల్లిక వింటుంది.


ఆ తర్వాత జానకి వెన్నెలను రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కిషోర్ తన తల్లిదండ్రులతో వస్తాడు.  కిషోర్ ని చూసి జ్ఞానంబ వెన్నెల పక్కన ఉంటే ఈడు జోడు బాగుంటుంది అని అనుకుంటుంది. ఇక వాళ్లు ఇంట్లోకి రాగానే ఇంట్లో వాళ్లని పరిచయం చేస్తుంటారు. ఇక గోవిందరాజులు వెన్నెల ప్రేమించిన అబ్బాయి అని తెలియకూడదు అని అనుకుంటాడు. మా అమ్మాయి గురించి మీరు ఏమైనా అడగాలి అంటే అడగండి అని జ్ఞానంబ అనటంతో వెంటనే కిషోర్ తండ్రి ఆల్రెడీ అంతా తెలిసిందే కదా అనటంతో.. అంత తెలియటం ఏంటి అని జ్ఞానంబ అనుమానం పడుతుంది.


also read it : Brahmamudi August 8th: 'బ్రహ్మముడి' సీరియల్: మత్తులో ఉన్న రాహుల్ ను లొంగ తీసుకున్న స్వప్న, కూతురు మొండితనాన్ని కాదనలేకపోయిన కృష్ణమూర్తి?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial