Kumari Aunty: సోష‌ల్ మీడియాలో కొద్దిగా పాపులారిటీ వచ్చినా చాలు.. బుల్లితెరలో అవకాశాలు క్యూకడతాయి. ఇప్ప‌టికే అలా ఎంతోమంది టీవీ చానెళ్లలో క‌నిపించి సంద‌డి చేశారు. ఇక ఇప్పుడు కుమారీ ఆంటీ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయారు. ఈ మ‌ధ్యే త‌న ఫుడ్‌తో ఎంతో పాపులారిటీ సంపాదించిన కుమారీ ఆంటీ ఒక ప్ర‌ముఖ టీవీ ఛానెల్ లో క‌నిపించనున్నారు. 


బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కుమారీ ఆంటీ ఫుడ్.. 


బిగ్ బాస్ - 7 తెలుగు అన్ని సీజ‌న్ల కంటే ఈ సీజ‌న్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగింద‌నే చెప్పాలి. ఇప్పుడు ఆ సీజ‌న్ కంటెస్టెంట్స్  అంద‌రూ  రియూనియన్‌ అయ్యారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి. వాళ్లంతా బిగ్ బాస్ ఉత్స‌వం ప్రోగ్రామ్ కోసం క‌లిశారు. ఇక ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లో కుమారీ ఆంటీ కూడా క‌నిపించ‌నున్నారు. ఆమె కంటెస్టెంట్స్ కోసం స్పెష‌ల్ గా ఫుడ్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. స్టేజ్ మీద చేతిలో ఫుడ్ ప్లేట్స్ ప‌ట్టుకుని క‌నిపించారు కుమారి ఆంటీ. మాకు ఫుడ్ పెట్టినందుకు థ్యాంక్స్ ఆంటీ అంటూ శ్రీ ముఖీ చెప్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యింది.  






ఉల్టా పుల్టా.. 


ఈ సీజ‌న్ ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పేరుకు త‌గ్గ‌ట్లుగానే ఈ సీజ‌న్ అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తించింది. ఇక ఈ సీజ‌న్ లో ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ టైటిల్ విన్న‌ర్ అయిన విష‌యం తెలిసిందే. సీజ‌న్ అయిపోయిన త‌ర్వాత కూడా అంతే కాంట్ర‌వ‌ర్సీ న‌డిచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బీబీ - 7 ఉత్స‌వ్‌కు కుమారీ ఆంటీ రావ‌డంతో ఈ షోపై ఇంట్రెస్ట్ పెరిగింది అంటున్నారు నెటిజ‌న్లు.  


ఫుడ్ తో ఫేమ‌స్.. 


సోష‌ల్ మీడియా ఎప్పుడు ఎవ‌రిని ఎలా? ఫేమ‌స్ చేస్తుందో తెలీదు. అలా ఫేమస్ అయ్యారు కుమారీ ఆంటీ. మాదాపూర్ లోని కోహినూరు హోట‌ల్ ద‌గ్గ‌ర స్ట్రీట్ ఫుడ్ పెట్టే ఒక మ‌హిళ ఇప్పుడు టీవీ షోల్లో పాల్గొనేలా చేసింది సోష‌ల్ మీడియా. త‌న ఫుడ్ టేస్ట్ మ‌హిమో, ఆమె స్వీట్ గా ప‌ల‌క‌రించే పిలుపో తెలీదు కానీ.. ఆమెను ఫేమ‌స్ చేసేసింది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె ద‌గ్గ‌ర ఫుడ్ తినేందుకు వెళ్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె పేరు ఇంకా మారుమోగిపోయింది. ఎంత‌లా అంటే ఆమె మీద నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంట‌రీ తీస్తుందట అని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది ప్ర‌స్తుతం. అయితే, ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే.. ఆమె మీద కొంద‌రు విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ఆమె వ‌ల్ల త‌మ వ్యాపారం పాడైపోయింద‌ని కొంత‌మంది మీడియా ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  


Also Read: జాన్వీ రాగానే.. ఆమె వెంట పడ్డారు, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు - నెపోటిజంపై మృణాల్ ఘాటు వ్యాఖ్యలు