Mrunal Thakur about Nepotism: ప్రతీ రంగంలో వారసత్వం అనేది ఉంటుంది. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఉంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ నెపోటిజంపై ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. బాలీవుడ్‌లోని స్టార్ ఫిల్మ్ మేకర్స్.. ఎప్పుడూ నెపోటిజంకే సపోర్ట్ చేస్తారని, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే వారిని అస్సలు పట్టించుకోరని ప్రేక్షకులు ఫీల్ అవుతుంటారు. కొందరు సెలబ్రిటీలు సైతం అదే నిజమని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ఇక తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఈ విషయంపై స్పందించింది. జాన్వీ కపూర్, అనన్య పాండేలాంటి స్టార్ వారసుల పేర్లను ఉదాహరణగా తీసుకొని నెపోటిజంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.


నెపోటిజంపై కాంట్రవర్సీలు..


ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ వారసులు ఉన్నారు. వారిని.. వారి తల్లిదండ్రులతో పోలుస్తూ.. ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్లు. అసలు వారు సినిమాల్లో ఎందుకు నటిస్తున్నారంటూ తీవ్రంగా విమర్శలు కురిపిస్తారు. కానీ వీటన్నింటిలో వారి తప్పు ఏం లేదు అంటోంది మృణాల్ ఠాకూర్. నెపోటిజంపై ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో విధాలుగా స్పందించారు. కానీ మృణాల్ మాత్రం కరెక్ట్ పాయింట్ మాట్లాడిందంటూ.. దీనిపై తను స్పందించిన వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. తన మాటల్లో కూడా నిజం ఉందని చాలామంది అంగీకరిస్తున్నారు. ఒక సందర్భంలో జాన్వీ కపూర్‌కు, తనకు మీడియా ఎలా వ్యత్యాసం చూపించిందో మృణాల్ గుర్తుచేసుకుంది.


వాళ్ల తప్పు ఏం లేదు..


‘‘ఇందులో వాళ్ల తప్పు ఏం లేదు. వాళ్లు స్టార్ కిడ్స్. మనం సామాన్య ప్రేక్షకుల స్థానంలో ఉండి వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తాం. నేను మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక అవార్డ్ ఫంక్షన్ జరుగుతోంది. అక్కడ నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నా కూడా జాన్వీ కపూర్ రాగానే మీడియా అంతా తన వెంట పరిగెత్తింది. జాన్వీ కపూర్ లాగానే నాకు కూడా బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ దక్కింది. కానీ నాకు స్పీచ్ ఇచ్చే అవకాశం కూడా ఎవ్వరూ ఇవ్వలేదు’’ అంటూ తప్పంతా ప్రేక్షకులదే అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్. మృణాల్ చెప్పిన మాటలు కరెక్టే అని చాలామంది నెటిజన్లు తనకు సపోర్ట్ చేస్తున్నారు. 


ఇండస్ట్రీలో నెపోటిజం లేదు..


‘‘నేను అసూయకు ఫీల్ అవుతున్నానని చెప్పడం లేదు. ఇందులో ఆ స్టార్ కిడ్స్ తప్పు ఏం లేదని చెప్తున్నాను. అందుకే నెపోటిజం అని ఊరికే వేలెత్తి చూపించడం మానేయండి. దీనికి పెద్ద బ్రేక్ పడింది. ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నాలాంటి, అవినాష్ లాంటి నటులను కూడా కరణ్ జోహార్ క్యాస్ట్ చేశారు. అంటే పరిశ్రమ లోపల నెపోటిజం అనేది లేదు. అది పూర్తిగా మీడియా, ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు మీడియా అంటే చాలా గౌరవం ఉంది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే, ప్రేక్షకుల వరకు వెళ్లగలిగానంటే మీడియానే కారణం. కానీ మీరే నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు’’ అని అభిప్రాయం వ్యక్తం చేసింది మృణాల్ ఠాకూర్.


Also Read: ఓ మై గాడ్, ఆ తెలుగు మూవీ కోసం రష్మిక అంత డిమాండ్ చేస్తోందా?