Ayalaan OTT Release: తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన సైన్స్ ఫిక్సన్ మూవీ 'అయలాన్'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రవికూమార్ దర్శకత్వం వహించారు. సంక్రాంతికి తమిళనాడులో విడుదలై, ఘన విజయం సాధించిన ఈ సినిమా. అయితే తెలుగులోనూ సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తెలుగు స్ట్రెయిట్ సినిమాల తాకిడి ఉండటంతో అయలాన్‌ను వాయిదా వేశారు. దీనితో పా టు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా వాయిదా పడింది.
దీంతో రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. దీంతో జనవరి 26వ తేదీని ఫిక్స చేసి హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను కూడా జరుపుకుంది ఈ సినిమా. అయితే దీనితో పాటు వస్తున్నా అని చెప్పిన కెప్టెన్ మిల్లర్ మాత్రం ఇక్కడ రిలీజైన అయలాన్ మాత్రం విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో వరుసగా తెలుగు స్ట్రయిట్ సినిమా రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను రిలీజ్ మరింత వెనక్కి వెళ్లింది. దీంతో మేకర్స్ అయలాన్ తెలుగు రిలీజ్‌నే నిలిపివేశారు.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ - 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి
ఇక ఎప్పటికైన థియేటర్లోకే ఈ మూవీ వస్తుందనుకుంటే తాజాగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ సన్ నెక్ట్స్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటీటీకి వేదికగా ఈ సినిమా చూసేందుకు తెలుగు ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయలాన్ కథ ఏంటంటే
ఒక మిషన్‌లో భాగంగదా భూమి మీదకు వచ్చిన ఏలియన్ హీరో శివ కార్తికేయన్ కలుస్తుంది. భూమి మీద దానికి సాయం చేస్తుంటాడు హీరో. ఈ క్రమంలో కొద్ది రోజులకే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. దానిని హీరో టట్టూ అనే పేరుతో పిలుచుకుంటాడు. కొన్ని సంఘటనల వల్ల టట్టూ కొంతమంది వ్యక్తుల చేతుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడటం కోసం తమీజ్ ఏం చేశాడు? అసలు టటటూ భూమి మీదకు రావడానికి కారణం ఏంటన్నదే కథ. తన మిషన్ పూర్తి చేసుకుని అది తిరిగి తన లోకనాకిఇ ఎలా వెళ్లింది? అనేది ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది. ఏలియన్ పాత్రకు సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.