బుల్లితెరపై 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. చాలా ఏళ్లుగా ఈ కామెడీ షోలు టీవీ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా విడుదలైన 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముందుగా ఇమ్మాన్యుయేల్, వర్ష 'కళావతి' సాంగ్ కి డాన్స్ వేస్తూ స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు. 'ఒక వందో ఒక వెయ్యో' అని పాడుతూ.. అర్ధమయిందా ఇమ్ము అని వర్ష అడగ్గా.. 'అర్ధమైంది.. తమరి పేమెంట్ కదా..?' అంటూ కౌంటర్ వేశాడు. 


వర్ష.. తనకు చాలా యాడ్స్ ఆఫర్ వస్తున్నాయని, ఏం చేయాలని ఇమ్మాన్యుయేల్ ని సజెషన్ ఆడితే మరో సెటైర్ వేశాడు ఇమ్మాన్యుయేల్.  అలానే జోర్దార్ సుజాత, రాకింగ్ రాజేష్ స్కిట్ కి జడ్జిలు పడిపడి నవ్వారు. నరేష్ చేసిన కామెడీ ఆడియన్స్ ను మరింత నవ్వించింది. రోషినితో అతడి డైలాగ్స్ నవ్విస్తాయి. జడ్జిలుగా ఉన్న రోజా, ఆమని సైతం స్కిట్ లలో పాల్గొన్నారు. ముందుగా ఆటో రామ్ ప్రసాద్.. రోజాతో కలిసి స్టేజ్ పైకి వచ్చాడు. 


మరోపక్క ఆమని, సుధీర్ కలిసి స్టేజ్ పైకి వచ్చారు. ఆ తరువాత రోజా.. 'ఏంట్రా ఎందుకు పిలిచావ్..?' అని రామ్ ప్రసాద్ ని అడగ్గా.. సుధీర్, ఆమనిలను చూపిస్తూ.. వాళ్లు చూడు మనతో గొడవాడుతున్నారని చెప్తాడు. దానికి రోజా తొడకొట్టి మరీ సుధీర్ కి వార్నింగ్ ఇస్తుంది. ఆ తరువాత సుధీర్ పై పులిరాజా అంటూ సెటైర్లు వేస్తుంది రోజా. వారి మధ్య సంభాషణ కామెడీగా ఉంటుంది.