గుప్పెడంతమనసు (Guppedantha Manasu ) మార్చి15 మంగళవారం ఎపిసోడ్
కిందపడనిదే సైకిల్ తొక్కడం రానట్టే..వాడికి జీవితం అనే ప్రయాణం ఇప్పుడే మొదలైంది జగతి నువ్వు కంగారు పడొద్దని చెబుతాడు మహేంద్ర. వసుధార ఏం జరిగిందని జగతి అడిగితే..రిషి సార్ కోపానికి పెద్ద పెద్ద కారణాలు కావాలా అంటుంది. నువ్వు కరెక్ట్ గా చెప్పావ్ వసుధార అంటాడు మహేంద్ర. ( మీగురించే ఆలోచిస్తూ మిమ్మల్నే ద్వేషిస్తూ వెళ్లిపోయారని ఎలా చెప్పగలను అనుకుంటుంది వసుధార). నువ్వెళ్లు వసుధారా అని మహేంద్ర చెప్పడంతో వెళ్లిపోతుంది.


Also Read: మోనిత, ఆనంద్ ఎవరో హిమకి తెలిసిపోయింది, సీరియల్ ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క
మీ తెలివి తేటలే రిషి సార్ కి వచ్చాయన్న లెక్చరర్ల మాటలు గుర్తుచేసుకుంటాడు. లెక్కల్లో ఓ సమస్య ఇస్తే క్షణాల్లో సాల్వ్ చేయగల నేను జీవితంలో సమస్యని ఇన్నాళ్లుగా సాల్వ్ చేయలేకుపోతున్నా అనుకుంటాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన దేవయాని ఏంటి రిషి అని అడిగితే ఆలోచిస్తున్నాను పెద్దమ్మా అంటాడు.
దేవయాని: కొన్ని యుద్ధాలు గెలవరు రిషి ఓడింపబడతారు.... అంతా ఒక్కమాటపై ఉంటే గెలవొచ్చు కానీ ఆ జగతికి మన ఇంటినుంచే సపోర్ట్ ఉంటే ఏం చేయగలం. మన కాలేజీకి పెద్ద పేరు ఉంది...కానీ ఎక్కడినుంచో ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడ విన్నా మిషన్ ఎడ్యుకేషన్ పేరే వినిపిస్తోంది. మీనాన్న, మీ పెదనాన్న, మినిస్టర్ గారూ అందరూ ఆమె జపమే. చదరంగంలో రాజుని బంధించాలంటే చుట్టూ ఉన్న సైన్యాన్ని చేధించాలి. జగతి అదే పని చేసింది. ఆ రోజు కాలేజీలో జరిగిన అవమానం నేను మరిచిపోలేదు..అది మన కుటుంబానికి జరిగిన అవమానం...ఆ జగతి-మహేంద్ర మాత్రం అన్నీ మరిచిపోయారు అనేసి హమ్మయ్య వచ్చిన పని అయిపోయింది వెళ్లి పడుకో అని చెప్పేసి వెళ్లిపోతుంది. 
పొద్దున్నే కాలేజీకి రా నీతో పని ఉందన్న రిషి మెసేజ్ చూసిన వసుధార ఓకే సార్ అని చెబుతుంది. ఈ సమస్యకి రేపు పొద్దున్నే పరిష్కారం చూసుకుంటా...


Also Read: జగతిని కాలేజీ నుంచి పంపించేయడమే సమస్యకు పరిష్కారమా
పొద్దున్నే కాలేజీకి వెళ్లి రిషిని కలుసిన వసుధార...పొద్దున్నే సీరియస్ గా కనిపిస్తున్నారేంటో అనుకుంటుంది. ఇంతలో ప్యూన్ ని పిలిచి నా కార్లో లెటర్ ఉంటుంది తీసుకుని రా అని చెప్పి..చిన్న పని ఉంది ఒక్క నిముషం వెయిట్ చేయి అని చెబుతాడు. 
వసుధార: ఎందుకు రిషి సార్ సీరియస్ గా ఉన్నారు, ప్రపంచంలో చాలామంది ఆలోచనలు, అంచనాలను అర్థం చేసుకోగలను కానీ రిషి సార్ మాత్రం ఎలాంటి అంచనాలకు అందరు
రిషి: ప్యూన్ తీసుకొచ్చిన లెటర్ తీసుకొచ్చి ఓ లెటర్ ఇచ్చి ఇది మీ మేడంకి ఇవ్వు
వసుధార: ఏమై ఉంటుందనే ఆలోచనతో జగతికి ఆ లెటర్ ఇస్తుంది వసుధార
జగతి: ఇంత పొద్దున్నే కాలేజీకి వచ్చావేంటి...
వసుధార: మా ఎండీగారి ఆజ్ఞ మేడం శిరసావహించాలి కదా
జగతి: ఆ లెటర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయి...అక్కడే పడేసి...నీ నిర్ణయాన్ని గౌరవించకపోతే నీ తల్లిని ఎలా అవుతాను రిషి అని  వెళ్లిపోతుంది.
రిషి: జగతి కార్లో వెళ్లిపోవడం అంతా రిషి కిటికీలోంచి చూస్తుంటాడు
వసుధార: మేడం మేడం అని పిలిచినా జగతి ఆగడపోవడంతో ఆ లెటర్ తీసి చూసి రిషి క్యాబిన్ కి వెళుతుంది. ఏంటి సార్ ఇది 
రిషి: ఏం చదవలేదా- అర్థం కాలేదా
వసుధార: చదివాను సార్ అర్థమైంది..కానీ మీ మనసులో ఏముందో అర్థమైంది...
రిషి: అర్థమైతే ఎందుకు అడుగుతున్నావ్
వసుధార: సడెన్ గా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ని రద్దు చేయడం ఏంటి..
రిషి: చేయాలి అనిపించింది చేసేశాను
వసుధార: ఇంతమంచి ప్రాజెక్ట్ ని అలా ఎలా రద్దుచేస్తారు
రిషి: అందరికీ చదువు విలువ చెప్పాం , చాలు అనిపించింది చేశారను
వసుధార: మీరు జగతి మేడంని దృష్టిలో పెట్టుకునే ఈ పని చేశారు కదా
రిషి: నాకు ఆ అవసరం లేదు
వసుధార: అబద్ధం సార్ మేడంపై కోపంతో ఈ పని చేశారు..
రిషి: కాలేజీపై ప్రేమతో చేశాననుకోవచ్చు కదా, నాకు వ్యక్తిగతం లేదు
వసుధార: మీకు టన్నుల కొద్దీ ఈగో సార్ అన్న వసుపై ఫైర్ అవుతాడు రిషి...
రిషి: మాటలు జాగ్రత్త
వసుధార: డీబీఎస్టీ కాలేజీ అంటేనే మిషన్ ఎడ్యుకేషన్ అనేలా మేడం తీర్చిదిద్దారు
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ అనే ప్రాజెక్ట్ ని ఇకపై డీబీఎస్టీ కాలేజీ నిర్వహించదు అని చెప్పాను...అందులో జగతి మేడంని తీసేస్తున్నట్టు ఎక్కడా రాయలేదు కదా , నువ్వు తెలివైనదానివి కదా మళ్లీ ఓసారి ఆలెటర్ చదువుకో
వసుధార: అంటే మేడంని వద్దనుకుంటున్నారా, ఇన్ డైరెక్ట్ గా వెళ్లమని చెబుతున్నారా
రిషి: నేను అందులో అలా రాయలేదు, నీకలా అర్థమైతే ఏం చేయలేను
వసుధార: తోట నరికేస్తే తోటమాలితో పని ఉండదు, వర్షాకాలం పోతే గొడుగుతో పని ఉండదు
రిషి: కాలేజీకి ఎండీని నేను ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు...మేడం సేవల్ని మరోలా ఉపయోగించుకుంటాం
వసుధార: కాలేజీకి వచ్చి మేడం వచ్చి ఏం చేయాలి, పని చేయించుకోకుండా జీతం ఇస్తారా...ఇచ్చినా ఆవిడ తీసుకుంటారా... 
రిషి: అది మాకు సంబంధించిన విషయం, అందులో నీకెందుకు బాధ వసుధార..
వసుధార: మీరిలా చేస్తారని ఆలోచిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు...మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు
రిషి: వసుధారా ...నా నిర్ణయం నీకు నచ్చలేదని మాత్రమే చెప్పు, తప్పు అనిచెప్పే అధికారం నీకులేదు ఉండదు కూడా... డీబీఎస్టీ కాలేజీ ఎండీని నేను ఏం చేయాలో నాకు తెలుసు....లెటర్ తీసుకున్న మేడంకి లేని బాధ నీకెందుకో...ఇంతకీ మేడం లెటర్ చూశారా, చదివారా, ఏమన్నారు
వసుధార: ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు
రిషి: మరి నువ్వొచ్చి నన్ను ప్రశ్నించడం కరెక్ట్ కాదేమో కదా
వసుధార అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోతూ ఎదురుగా మహేంద్ర కనిపించడంతో కాసేపు ఆగి వెళ్లిపోతుంది. 
రిషి: అంతా విన్నారా
మహేంద్ర: కొంత విన్నాను అంతా అర్థం చేసుకున్నాను. లెటర్ చేతిలోకి తీసుకుని చదివిన తర్వాత...ఏం చేస్తున్నావ్ రిషి.. ఏంటిది.. 
రిషి: అన్నీ అర్థం చేసుకున్నాను అన్నారు కదా
మహేంద్ర: నిన్నే అర్థం చేసుకోలేకపోతున్నాను, ఏం చేస్తున్నావ్, ఎందుకు చేస్తున్నావ్
రిషి: ఇది నా నిర్ణయం, ఈ విషయంలో ఇప్పుడేం మాట్లాడలేను అలసిపోయాను తర్వాత మాట్లాడుకుందాం


జగతి ఇంట్లో:
రిషి సార్ ఎంతపని చేశారు జగతి మేడం ఎలా ఉన్నారో ఏంటో చెప్పాపెట్టకుండా వచ్చేశారు అంటూ డోర్ తోసి చూసి షాక్ అవుతుంది వసుధార. అక్కడేం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాలి...