ఖుషిని తీసుకుని వేద వాళ్ళ ఇంటికి వస్తాడు యష్. అమ్మా అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఖుషి వేదని కౌగలించుకుంటుంది. ఇంట్లోకి వచ్చేందుకు యష్ ఆలోచిస్తుండటంతో వేద తండ్రి లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇక ఖుషి కూడా యష్ ని బలవంతంగా ఇంట్లోకి తీసుకొస్తుంది. పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని ఖుషి అడుగుతుంది. డాడీకి నువ్వంటే బోలెడు ఇష్టం అని ఖుషి వేదకి చెప్తుంది. అమ్మమ్మ నా మీద అలిగింది అందుకని ఇక్కడికి వచ్చానని చెప్తుంది. మన ఇంటికి వెళ్లిపోదాం రామ్మా అని ఖుషి పిలుస్తుంది. అక్కడ నువ్వు లేకుండా నేను డాడీ ఎలా ఉంటాం, నువ్వు లేకపోయేసరికి డాడీ రాత్రంతా పడుకోలేదని చెప్తుంది. ఇక యష్ వేద ఫోన్ ని అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. అది చూసిన వేద ఈ ఫోన్ నా జీవితాన్ని నాశనం చేసిందని కోపంగా దాన్ని విసిరి కొడుతుంది. ఆ మాటలన్నీ అక్కడే ఉన్న యష్ వింటాడు. గొడవ జరిగిన రోజు వేద, కాంచన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు.
ఖుషిని వేద దగ్గర ఎందుకు వదిలిపెట్టి వచ్చావని మాలిని యష్ ని నిలదీస్తుంది. ఇక వేదని కూడా తీసుకుని వస్తే బాగుండేది కదా తమ్ముడు అని కాంచన దెప్పిపొడుస్తుంది. అక్కా నీ మీద నాకు సానుభూతి ఉందని యష్ అంటాడు. నీ సానుభూతి మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అందరిలో అవమానానికి గురైంది మీ బావగారు ఆయన లోలోపల ఎంత బాధపడుతున్నారో తెలుసా ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పవచ్చు కదా అని అంటుంది. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఎలా గౌరవం ఇవ్వాలో తనకి తెలుసని యష్ అంటాడు. వేద నా భార్య, ఈ ఇంటి కోడలు, ఖుషికి అమ్మ తనని తక్కువ చేసి మాట్లాడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే అది ఈ ఇంట్లో అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
Also Read: హిమ క్యాన్సర్ నాటకాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న శోభ, మరింత పగ పెంచుకున్న శౌర్య
యష్ మారిపోయాడు. వేద తప్ప యష్ కి ఎవరు కనిపించడం లేదు. మా ఆయన అంటే మరీ లోకువ అయిపోయిందని కాంచన ఏడుస్తుంటే మాలిని సర్ది చెప్తుంది. ఇక వేద తల్లిదండ్రులు జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటారు. మరోవైపు వేద, ఖుషి సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. మాలిని వచ్చి ఖుషిని ఇంటికి రమ్మని పిలుస్తుంది కానీ రాను అని చెప్తుంది. వేద ఖుషిని బతిమలాడి ఇంటికి వెళ్ళేలా చేస్తుంది. ఇక వేద బావ శశిధర్ వాళ్ళ పిన్ని మాళవిక ఇంటికి వెళ్తుంది. మీకు నాకు ఒకే మనిషంటే అసహ్యం ఆ ఒక్కరూ వేద అని చెప్తుంది. యశోదర్, వేద విడిపోయారు, ఆ వేదని ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని చెప్తుంది. ఆ మాటలకి మాళవిక వాళ్ళు తెగ సంతోషపడిపోతారు. ఇక వేద, యష్ విడిపోయారని ఫ్యామిలీ కోర్ట్ జడ్జి చెవిలో వేస్తే చాలు మిగతాది ఆవిడే చూసుకుంటుందని అభి మాళవికకి చెప్తాడు. ఖుషి కస్టడీ కేసు తీర్పు తిరగ రాస్తారు, తన కస్టడీని శాశ్వతంగా నాకు అప్పగిస్తారు, ఆ ఖుషిని పోగొట్టుకుని వేద కుమిలి కుమిలి ఏడవాలి అని మాళవిక తన కుట్ర ని బయటపెడుతుంది. వేద అపార్ట్ మెంట్ దగ్గర కూర్చుని ఉంటే వెనుకగా కైలాష్ వచ్చి తనని భయపెడతాడు.
తరువాయి భాగంలో..
మాళవిక ఫ్యామిలీ కోర్ట్ జడ్జి ని తీసుకుని యష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఖుషి కస్టడీ కోసం మీరు వేదని దొంగ పెళ్లి చేసుకున్నారని జడ్జి అంటుంది. అలా ఏమి లేదు మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని యష్ చెప్తాడు. అదంతా డ్రామా అందరూ కలిసి కుట్ర చేసి నాకు దరిహమ్ చేశారని మాళవిక అంటుంది. ఇక జడ్జి మాట్లాడదని యశోధర మీ భార్య ఎక్కడ అని అడుగుతుంది.