Ennallo Vechina Hrudayam Serial Today Episode తాను ఇచ్చిన మందుకు వ్యతిరేకంగా పనిచేసే విరుగుడు మందు ఎవరో బాలాకు ఇచ్చారని స్వామీజీ చెబుతాడు. అందువల్లే బాలా మళ్లీ పూర్వస్థితికి వచ్చాడని చెబుతాడు. అందరితో బాలా మంచిగానే ఉంటాడని...వాడిపై ఎవరు పగబట్టి విరుగుడు మందు ఇచ్చి ఉంటారని  ఇంట్లో వాళ్లందరూ  అనుకుంటారు. బాలాకు ఇలా విరుగుడు మందు ఇవ్వడం ఇది మొదటిసారి కాదని...ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారని స్వామిజీ చెబుతాడు. శత్రువులు ఎవరో మీ మధ్యే ఉన్నారని స్వామిజీ చెబుతాడు. బాలా అంటే అందరికీ ఇష్టమని వాడికి విరుగుడు మందు ఇచ్చేవాళ్లు ఇక్కడ ఎవరుంటారని ప్రశ్నిస్తారు. ఇంట్లో వాళ్లు తప్ప...ఇన్నిసార్లు విరుగుడు మందు ఇచ్చేవాళ్లు ఎవరు ఉంటారని ఆయన నిలదీస్తాడు.


అప్పుడు ఫణి, వాసుకి వాళ్లు కల్పించుకుని స్వామీజినే తప్పుబడతారు. బాలాకు మొదటి నుంచి మీరే వైద్యం చేస్తున్నారని...మీ వైద్య లోపం వల్లే బాలా ఇలా అయిపోయాడని వారు అంటారు. ఆ లోపాన్ని కవర్‌ చేసుకోవడానికి మీరే ఇంట్లోవాళ్లపై అభాండాలు వేస్తున్నారని అంటారు. ఆయన వైద్యం సరిగా చేయకుండా  ఇంట్లోవాళ్లపై నెపం నెడుతున్నారని  ఫణివాళ్లు ఆరోపిస్తారు. మీకు వైద్యం రాకుంటే చెప్పండి మేం వేరేవాళ్లని చూసుకుంటామని చెబుతారు. దీంతో స్వామీజీ ఆగ్రహం చెందుతారు. తాను చేసే వైద్యం దైవకార్యంగా భావిస్తానని..ఎంతో నిష్ఠతోచేస్తానని చెబుతాడు. అలాంటిది నన్ను,నా వైద్యాన్ని మీరు అనుమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నమ్మకం,విలువ లేని చోట వైద్యం చేయనని అంటారు. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని  త  ప్రాథేయపడుతుంది. ఎవరు ఎంత వైద్యం చేసినా  బాలాకు నయం కాదని...ఎందుకంటే ఆయనకు విరుగుడు మందులు ఇచ్చేవాళ్లు పక్కనే ఉన్నంత కాలం బాగు చేయలేమని స్వామిజీ తేల్చి చెబుతాడు. ముందు విరుగుడు మందులు వేస్తున్న వాళ్లని కనిపెట్టండని ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
   


గురువుగారు వెళ్లిపోవడంతో ఇంట్లో వాళ్లందరూ బాధపడతారు.అప్పుడు  స్పృహలోకి వచ్చిన బాలా ఎందుకు అందరూ బాదపడుతున్నారని అడుగుతాడు. ఆడుకుంటానికి వెళ్తానంటూ చిన్నపిల్లాడిలా బయటకు పరుగులుపెడతాడు.  బాలాను అలా చూసి తల్లితోపాటు తమ్ముడు,నానమ్మ బాధపడుతుంటే...ఫణి,వాసుకు వాళ్లు మాత్రం లోలోపల ఎంతో సంతోషిస్తుంటారు. బాలా మళ్లీ అలా అయిపోవడంతోపాటు స్వామిజీని తరిమేశామన్న ఆనందంతో వాళ్లు సంబరాలు చేసుకుంటారు. ఇంతలోనే ఫణి ఆ సీక్రెట్ కెమెరా ఉన్న పెన్ను నాటకాల వాళ్ల దగ్గరే ఉందని గుర్తు చేస్తాడు. అది వాళ్ల చేతికి దొరికితే మన పని అయిపోతుందని అనుకుంటారు. 


ఆ సీక్రెట్ కెమెరా సంపాదించి తీసుకుని వస్తానంటూ ఫణి అక్కడి నుంచి వెళ్లిపోతాడు  త్రిపుర పాలప్యాకెట్లు వేసి ఇంటికి తిరిగి వస్తున్నక్రమంలో ఆమెపై దాడి చేసి సీక్రెట్ కెమెరా ఉన్న పెన్ను గురించి తెలుసుకుని తీసుకొచ్చి తనకు ఇవ్వాలంటూ ఫణి రౌడీలను పురమాయిస్తాడు. దీంతో రౌడీలు త్రిపురను అడ్డగించి దాడి చేస్తుంటారు. అప్పుడే ఐస్‌క్రీం కోసం అటువైపు వచ్చిన బాలా త్రిపురను కాపాడే ప్రయత్నం చేయగా...రౌడీలు బాలాను కొడతారు. ఆ దెబ్బలకు బాలా తిరిగి మామూలు మనిషైపోతాడు. రౌడీలను తుక్కుతుక్కుగా కొట్టి తరిమేస్తాడు.
సుందరి, త్రిపుర ఒక్కటేనని తెలుసుకున్న ఫణి...దీనివల్లే తన ప్లాన్లు మొత్తం దెబ్బతిన్నాయని...ముందు త్రిపురను చంపేసి..ఆ తర్వాత బాలా సంగతి చూస్తానంటూ వెళ్లిపోతాడు. త్రిపుర బాలాకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో  ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది...