Ennallo Vechina Hrudayam Serial Today Episode ఫణి బాల గురించి తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే బామ్మ అక్కడికి వస్తుంది. బాలని మళ్లీ పిచ్చోడిని చేయించడానికి ఓ మందు చేయిస్తున్నానని అది చేస్తే వాడి పని అయిపోతుందని ఫణి అంటాడు. బామ్మ వచ్చి ఎదురుగా నిల్చొవడంతో ముగ్గురు నీళ్లు నములుతారు. బామ్మ ప్రశ్నించడంతో అన్నయ్య కంపెనీకి వస్తాడు కదా మనకు ఇక తిరుగు ఉండదు కదా అంటాడు.


యశోద రావడంతో బాల గురించి బామ్మ అడుగుతుంది. దాంతో గెస్ట్ హౌస్‌కి వెళ్లాడని చెప్పడంతో బామ్మ యశోదతో వాళ్ల తాత చావుకి కారణమైన వాళ్లని వదలడు అని అంటుంది. ఫణి వాళ్లు చాలా టెన్షన్ పడతారు. బాల గెస్ట్ హౌస్‌కి వెళ్లి మొత్తం పరిశీలిస్తాడు. గెస్ట్ హౌస్‌లో  బాలకి ఏం సాక్ష్యం దొరుకుతుందో అని టెన్షన్ పడతారు. తాతయ్య ఏదో ఒక ఆధారం ఉంచే ఉంటారని అది దొరికితే తాతయ్య మరణం వెనక ఉండే రహస్యం తెలుస్తుందని అనుకుంటాడు. ఇక త్రిపుర, గాయత్రీలు లాయర్ దగ్గరకు వెళ్తారు. తన తల్లి గురించి జరిగింది అంతా చెప్తారు. ఇక లాయర్‌ ఇండియన్ అంబస్‌తో మాట్లాడి కేసు పూర్తి వివరాలు తెలిశాయని గల్ఫ్‌ లాయర్‌తో మాట్లాడితే మీ అమ్మని తీసుకు రావొచ్చా అని తెలుస్తుందని కచ్చితంగా మీ అమ్మగారు వస్తారని చెప్తారు. కానీ ఈ ప్రాసెస్ మొత్తం ఖర్చుతో కూడిందని ప్రస్తుతానికి 50 వేలు కావాలని అంటారు. 


త్రిపుర చాలా కంగారు పడుతుంది. అంత డబ్బు ఎలా ఇప్పుడు దొరుకుతుందని అనుకుంటుంది. ఇక త్రిపుర వాళ్లని ఫాలో అవడానికి గిరి పెట్టిన రౌడీలు  జైలులో ఉన్న గిరి దగ్గరకు వెళ్లి మీ అత్తని గల్ఫ్‌ జైలులో పెట్టారని చెప్తారు. అత్త, అల్లుడు ఇద్దరం జైల్లో ఉన్నాం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అంటారు. త్రిపుర ఇంటికి వచ్చి చాలా బాధ పడుతుంది. గాయత్రీ అక్కకి ధైర్యం చెప్తుంది. ఇంతలో గిరి త్రిపురకు కాల్ చేస్తాడు. త్రిపుర చాలా కంగారు పడుతుంది. గిరి త్రిపురతో నేను చాలా తప్పులు చేశాను తిప్పు మా అమ్మ ఇంకా ఎక్కువ తప్పులు చేసింది కదా దాని వల్ల మీరంతా చాలా బాధ పడుతున్నారు కదా నేను మారిపోయా తిప్పు పూర్తిగా మారిపోయా అని చెప్తాడు. తన తప్పు తాను తెలుసుకున్నా అని నువ్వు ఒక్క సారి జైలుకి వస్తే మీ ఇళ్లు ఇప్పించి అత్తని విడిపిస్తా అంటాడు. గిరి మాటలకు త్రిపుర ఆలోచనలో పడుతుంది. వాడేం మారిపోలేదు నువ్వు నమ్మొద్దు అని అందరూ త్రిపురకు చెప్తారు. కానీ త్రిపుర మాత్రం వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తల్లి కోసం ఒక సారి జైలుకి వెళ్లివస్తానని జైలులో ఉన్నా నాకు ఏ ప్రమాదం ఉండదు అనుకొని ఇంట్లో ఎవరికీ తెలీకుండా వెళ్తుంది.


త్రిపురని చూసిన గిరి ఏం తెలీనట్లు వెనక్కి తిరిగి మారిపోయినట్లు నటిస్తాడు. త్రిపుర అది చూసి నిజం అనుకుంటుంది. నీ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉందని ఏడుస్తున్నట్లు నటించి డాక్యుమెంట్లు, డబ్బు అన్నీ త్రిపురకి ఇస్తాడు. త్రిపుర వాటిని చూస్తుండగా రౌడీలకు సైగ చేసి త్రిపురని పట్టుకోమని తాళి కట్టే ప్రయత్నం చేస్తాడు. త్రిపుర తోసేసి పారిపోతుంది. గిరి తన రౌడీలను తిట్టి తల బాదుకుంటాడు. ఇక త్రిపుర బాల  కారు నీ ఢీ కొడుతుంది. బాల ఏమైందని అడిగితే రౌడీలను చూపిస్తుంది. బాల రౌడీలను చితక్కొడతాడు. మన మధ్య ఏం సంబంధం ఉందో తెలీదు కానీ నేను ప్రతీసారి మిమల్ని కాపాడుతున్నా అంటాడు. సిటీ చివరకు ఎందుకు వచ్చారు అని డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు. బాల నార్మల్‌గా మాట్లాడుతుంటే త్రిపుర బాలని చూసి మొత్తం గుర్తు చేసుకుంటుంది. ఇంటికి కొంచెం దూరంలో త్రిపుర కారు ఆపించి వెళ్తా అంటుంది. బాల సరే అంటారు. త్రిపుర బాల చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!