Seethe Ramudi Katnam Serial Today Episode సీత మీద హత్యా ప్రయత్నం చేసింది గౌతమ్ అని మహాలక్ష్మీకి అర్థమవుతుంది. గౌతమ్‌ని కొట్టి సీత జోలికి వెళ్లొద్దని సీత నీ కంటే పెద్ద ముదురు అని చెప్తుంది. సీతని చంపేస్తా అని గౌతమ్ అంటే సీతని చంపేయాలని నాకు ఉంది.. నువ్వు ఇప్పుడు జస్ట్‌లో మిస్ అయ్యావ్ ఆ సీత చూస్తే ఇక అంతే సంగతి.. ఇప్పుడు సీత వల్ల మనకు 1000 కోట్లు లాభం రాబోతుంది అది అయిపోయిన తర్వాత పక్కా ప్లాన్‌తో దాన్ని చంపేద్దామని అప్పటి వరకు ఏం చేయొద్దని గౌతమ్‌ని హెచ్చరిస్తుంది.


ఉదయం సీత, మహాలక్ష్మీ, జనార్థన్, రామ్‌లు ఆఫీస్‌కి వెళ్తే అందరూ సీతని విష్ చేస్తారు. ఇక ముఖర్జీ రావడంతో మీటింగ్ మొదలవుతుంది. సీత అంత తెలివైనది ప్రపంచంలో లేదని ముఖర్జీ ఎత్తేసి ఇంట్లో ఉండిపోవద్దు ఆఫీస్‌కి రోజు రా నువ్వు రాకపోయే సరికి వీళ్ల మీద నాకు అనుమానం వచ్చి ఈ రోజు నిన్ను తీసుకురమ్మన్నాను అని చెప్తాడు. ఇక సీత సమక్షంలో అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టిస్తారు. జనార్థన్ సంతకం పెట్టే టైంకి రామ్ ఆపుతాడు. ముఖర్జీతో తనకు సీతకు గొడవ అయిందని సీతతో తాను ఇప్పుడు కలిసి లేను అని అంతా చెప్పిన తర్వాతే అగ్రిమెంట్ అంటాడు. రామ్‌ నిజాయితీని మెచ్చుకున్న ముఖర్జీ గొడవ ఏంటి అంటే మహాలక్ష్మీని సీత చంపించిందని జరిగింది మొత్తం చెప్తాడు. మహాలక్ష్మీ మీద హత్యాప్రయత్నం చేయడం వల్లే ఇంటి నుంచి పంపాం కానీ పరువు పోతుందని పోలీసులకు పట్టించలేదని అందరూ చెప్తారు.


సీత ఇంట్లో లేదు ప్రాజెక్ట్‌లో కూడా ఉండదు అని మీకు ఇష్టం అయితే ప్రాజెక్ట్ ఇవ్వండి లేదంటే ఇక్కడితో డ్రాప్ అయిపోదాం అని రామ్ అంటాడు. దాంతో ముఖర్జీ ఆలోచించి సీత నువ్వు అంటే నాకు నమ్మకం అభిమానం ఉన్నా నీ ఫ్యామిలీ విషయాల్లో కలుగ జేసుకోను. నీకు నువ్వుగా ఈ నేరంలో నీ తప్పు లేదని నిరూపించుకునే వరకు నేను నిన్ను ప్రాజెక్ట్‌లో ఉంచనని అంటారు. రామ్ నిజాయితీకి మెచ్చుకొని ప్రాజెక్ట్ ఓకే చేస్తారు. ఇక సీత అవసరం లేదని సీతని పంపేస్తారు. ఇక ప్రాజెక్ట్‌కు అందరూ సంతకాలు పెడతారు. ఇప్పటి నుంచి పార్టనర్స్ అయ్యాం అని తన కూతురు ఫారిన్ నుంచి వచ్చింది సాయంత్రం బర్త్‌డే పార్టీ ఉందని అందరినీ పిలుస్తారు. సీత డల్‌గా నిల్చొని ఉంటే జనార్థన్ చూసి ఇంకా వెళ్లలేదా సీత అంటే మీతో ఒక మాట చెప్పాలి మామయ్య అంటుంది. ఇన్ని కంపెనీలు పెట్టడానికి కారణం అయినా సుమతి అత్తయ్య చనిపోతే ఆవిడ చావు కోసం ఎంక్వైరీ చేయరా. ఆమె గురించి పట్టించుకోరా అని ప్రశ్నిస్తుంది. దాంతో జనార్థన్ తాను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని చెప్తాడు. అదంతా చూసిన మహాలక్ష్మీ వచ్చి చేసిందంతా నువ్వే రామ్ అడ్డుకోకపోతే నువ్వే ఈ పాటికి జైలులో ఉండేదానివి అని అంటాడు.


రామ్ వచ్చి ఏమైందని అని అడిగితే మీ అమ్మ కేసు గురించి మాట్లాడుతుంది చెప్తుంది. నిజాలు తెలిసే వరకు దూరంగా ఉండు సీత అని రామ్ అంటే అవసరం ఉంటే దగ్గర అవ్వమని అవసరం లేనప్పుడు పొమ్మంటావా అంటుంది. నువ్వు దూరంగా ఉంటే నీకే మంచిది అని రామ్ అంటాడు. ఈవినింగ్ రామ్, గౌతమ్, జనా, మహా, అర్చనలు ముఖర్జీ కూతురి భర్త్‌డే పార్టీకి వస్తారు. ముఖర్జీ ఆయన భార్య స్వాగతం పలుకుతారు. ఇక సీత కూడా వస్తుంది. మహాలక్ష్మీ వాళ్లు సీతని చూసి షాక్ అవుతారు. అందరూ కోపంగా చూస్తారు. పుట్టిన రోజు మోడల్‌ని తీసుకురావడానికి ముఖర్జీ, ఆయన భార్య వెళ్తారు. ఇద్దరు అత్తలతో సీత మాటల యుద్ధం చేస్తుంది. రామ్‌ని పలకరిస్తే రామ్ పక్కకు వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!