Nindu Noorella Saavasam Serial Today Episode:  రేడియో ఫ్రోగ్రాం చేస్తున్న భాగీకి మొదటి కాల్ తామే చేయాలని అమ్ము చెప్తుంది. మంచి ఐడియా అని అంజు కాల్‌ చేస్తుంది. కానీ కాల్‌ కనెక్ట్ కాదు.

అమ్ము: అయ్యో ఇన్ని రోజుల తర్వాత తను ఫ్రోగ్రాం చేస్తే ఫస్ట్‌ కాల్‌ చేయలేకపోయాము..

అంజు: ఫస్ట్ కాల్‌ ఎవరిది కనెక్ట్‌ అయిందో

భాగీ: ఇప్పుడు ఫస్ట్‌ కాల్‌ ఎవరు చేశారో చూద్దాం.. హలో ఎవరు..?

అనామికకు కాల్‌ కనెక్ట్‌ అవుతుంది. కానీ పలకదు.

భాగీ: హలో ఎవరు మాట్లాడుతున్నారు. నా మాట మీకు వినిపిస్తుందా..?

అనామిక: హలో చెల్లి

భాగీ షాక్ అవుతుంది. ఇంట్లో వింటున్న అందరూ షాక్‌ అవుతారు. అమర్‌ షాక్‌ అవుతారు.

భాగీ: అక్కా .. మీరేనా ఎలా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు. అసలు ఏమై పోయారు.

అనామిక:  నేను ఎక్కడికి వెళ్లలేదు చెల్లి. ఎప్పుడూ నీతోనే ఉన్నాను కదా..? నీకు తోడుగా ఉంటున్నాను కదా..?

రేడియోలో అనామిక వాయిస్‌ విన్న పిల్లలు షాక్‌ అవుతారు.

అమ్ము: అంజు ఇది అమ్మ వాయిసే కదా

అంజు:  అవును అమ్ము అసలు చనిపోయిన అమ్మ ఎలా మాట్లాడుతుంది.

శివరాం: అసలు ఏం జరుగుతుంది నిర్మల. అరుంధతి ఎలా ఫోన్‌ చేసి మాట్లాడుతుంది

గుప్త, అనామిక శరీరంలోంచి ఆరు ఆత్మ బయటకు వచ్చేలా చేయాలని మంత్రం వేయబోతుంటే..

భాగీ: ఏం మాట్లాడుతున్నారు అక్కా నాతో ఉండటం ఏంటి..? అసలు మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు

అనామిక: నేను హైదరాబాద్‌ లోనే

అంటుండగానే.. అరుంధతి వచ్చి ఫోన్‌ లాక్కుని కాల్‌ కట్‌ చేస్తుంది. అనామికను కోపంగా చూస్తుంది.

అమ్ము: అంజు అసలు ఇది అమ్మ వాయిసేనా..? లేక మనకు అలా అనిపిస్తుందా…?

అంజు:  లేదు అమ్ము ఇది అమ్మ వాయిసే.. నాకు అమ్మ వాయిస్‌ తెలియదా..? ఎలా ఎఫ్‌ఎంలకు వచ్చిందో తెలియదు కానీ ఇది కచ్చితంగా అమ్మ వాయిసే.

ఆనంద్‌:  అమ్మ వాయిస్‌ కూడా కన్ఫీజ్‌ అవుతున్నం. అమ్మ మనకు ఎంత దూరం అయ్యామో ఇప్పుడు తెలస్తుంది అక్కా

అనామిక: ఏమైంది మనోహరి గారు ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు

మనోహరి: అంత సౌండ్‌ పెట్టుకుని ఎఫ్‌ఎం వింటున్నావు. పిల్లలకు డిస్టర్బ్‌ అవ్వదా.?

అంటూ కోపంగా చెప్పి ఫోన్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. అక్కడే ఉన్న గుప్తను ఆరును పిలిచినా వినిపించదు. కానీ గుప్త మాటలు ఆరుకు వినిపించవు. మరోవైపు ఫ్రోగ్రాం కంప్లీట్‌ అవ్వగానే.. భాగీ బయటకు వచ్చి తన ఫ్రెండ్‌తో హ్యాపీగా ఫీలవుతుంది. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. అలాగే ఇన్ని రోజుల తర్వాత కూడా అక్క ఫోన్‌ చేసింది అని చెప్తుంది. అమర్‌ దగ్గరకు వెళ్లి ఆశ్చర్యంగా అక్క ఫోన్‌ చేసిందండి అని చెప్తుంటే.. అమర్‌ కూడా అవును మిస్సమ్మ నాకు ఆశ్చర్యంగానే ఉంది. సరే ఇంటికి వెళ్దాం పద అంటాడు అమర్‌. సరే అంటూ వెళ్లిపోతుంది భాగీ. ఇంట్లో పిల్లుల షాకింగ్‌ గా కిందకు వస్తారు.

అమ్ము: తాతయ్యా మేము ఇందాక ఎఫ్‌ఎంలో అమ్మ వాయిస్‌ విన్నాము. మీరు కూడా విన్నారా..?

శివరాం: అవును అమ్ము విన్నాం.. అచ్చం మీ అమ్మ వాయిస్‌ లాగే ఉంది.

అనామిక: ఏంటి..? చనిపోయిన మేడం వాయిస్‌ విన్నారా..?

శివరాం: అవునమ్మా.. అనామిక.. విన్నాము..

మనోహరి: వీళ్లను డైవర్ట్‌ చేయాలి ( అని మనసులో అనుకుంటుంది) అదంతా మీ భ్రమ. ఎందుకంటే ఆ కాల్‌ చేసింది నేనే కాబట్టి

అని మనోహరి చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. తర్వాత మార్కెట్‌ కు వెళ్లి వస్తున్న రాథోడ్‌లోకి గుప్త ప్రవేశించి అనామిక దగ్గరకు వెళ్లి భాగీకి అర్జెంట్‌గా అవసరం ఉందని నిన్ను తీసుకురమ్మంది అని చెప్తాడు. అనామిక సరే పద వెళ్దాం అని భాగీ దగ్గరకు వెళ్తుంది అనామిక. వెంటనే భాగీ మెడలోని తాళిలో వెనక ఏదో సమస్య ఉంది చూడమని అనామికకు చెప్తాడు. అనామిక చూస్తుంటే.. ఇంతలో మనోహరి వస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!