Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 14th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఎవడే నీ మెడలో తాళి కట్టంది? లక్ష్మీనే నా భార్యన్న విహారి.. లక్ష్మీని వదలని మదన్!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం మెడలో తాళి గురించి ఇంట్లో అందరూ ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

 Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode మదన్ అడిగిన ప్రశ్నలకు విహారి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. రాత్రి శివాలయానికి వెళ్తాడు. శివుడికి దండం పెట్టుకుంటాడు. నేను కట్టిన తాళిని గుండెల మీద మోస్తూ.. నా ఫ్యామిలీ కోసం.. నా సంతోషం కోసం తను ఎంతో త్యాగం చేసిందని నా స్వార్థం కోసం తనని గుర్తించలేకపోయాని విహారి దేవుడితో మొరపెట్టుకుంటాడు. తన మొదటి చివరి కోరిక ఇదే అని లక్ష్మీని కాపాడమని దేవుడిని కోరుకుంటారు.

Continues below advertisement

కనక మహాలక్ష్మీ భర్తగా అడుగుతున్నా.. నా భార్యని బతికించు స్వామి అని దేవుడిని మొక్కతాడు. విహారి కనకాన్ని భార్య అనగానే హాస్పిటల్‌లో కనకంలో కండీషన్ ఇంకా ప్రమాదం అవుతుంది. ఇంతలో స్వామీజీ విహారి దగ్గరకు వస్తారు. మాంగల్యాన్ని పరీక్షిస్తే శిక్ష ఉంటుంది  అని చెప్పాను కదా.. లక్ష్మీని నీ భార్య అని అనుకొని ఇకపై తనతోనే నీ జీవితం అను బలంగా నమ్మి మహా మృత్యుంజయ హోమం చేస్తే ఆ స్వామీ నీ భార్యని కాపాడుతారని స్వామీజీ చెప్పడంతో నా భార్య కోసం నేను చేస్తానని విహారి మహామృత్యుంజయ హోమం చేస్తాడు. మృత్యుంజయ హోమం ఫలితంగా లక్ష్మీలో చలనం ఇస్తుంది. 

విహారి హాస్పిటల్‌కి రాగానే మదన్ మిరాకిల్ జరిగిందని లక్ష్మీ ప్రాణాపాయం నుంచి తప్పించుకుందని అంటాడు. ఇక డాక్టర్ ఇచ్చి లక్ష్మీ నార్మల్ అయిందని అంటాడు. కాస్త నీరసంగా ఉందని రేపు ఇంటికి తీసుకెళ్లవచ్చొని చెప్తారు. ఇక మదన్‌ని ఇంటికి వెళ్లిపోమని విహారి చెప్పి ఇంట్లో ఎవరికీ కంగారు పడొద్దని చెప్పమంటాడు. ఉదయం లక్ష్మీని తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ లక్ష్మీ దగ్గరకు వస్తారు. ఘనకార్యం చేసి వచ్చింది దిష్టి తీయండి అని పద్మాక్షి అంటుంది.

అంబిక: ఇంత నీచమైన పని ఎలా చేశావే.
విహారి: అత్తయ్యా. 
పద్మాక్షి: నువ్వు మధ్యలో మాట్లాడకు.
సహస్ర: ఏం ఏమీ తెలీనట్లు అలా చూస్తావేంటి. ఆ చండాలమైన పని ఎందుకు చేశావ్. నిజం  చెప్పు.
లక్ష్మీ: అమ్మా నన్ను క్షమించండి నా వల్ల మీ అందరూ చాలా ఇబ్బంది పడి ఉంటారు. నేను ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను. ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేక విషం తాగాను. దయచేసి నా తప్పు క్షమించండి.
సహస్ర: మేం అడిగింది నువ్వు విషం తాగిన దాని గురించి కాదు. ఈ పెళ్లి ఆగిపోవడం గురించి కూడా కాదు. ఈ తాళి గురించి. నీకు ఇంతకు ముందు జరిగిన పెళ్లి గురించి. 
పద్మాక్షి: ఈ తాళి నీకు ఎవడు కట్టాడు. ఎవడితో పెళ్లి అయింది. ఈ విషయం ఎందుకు దాచావ్.
సహస్ర: చెప్పు చెప్పు..  నిజం  చెప్పు లేకపోతే ఈ తాళిని..
విహారి: సహస్ర అని తాళిని పట్టుకున్న సహస్రని తోసేస్తాడు.  
సహస్ర: దాని తాళి పట్టుకుంటే నువ్వు ఎందుకు వస్తున్నావ్ బావ. 
పద్మాక్షి: దాని తాళి పట్టుకుంటే నీకు ఏంట్రా నొప్పి.
విహారి: మీరు మూర్ఖంగా చేసే పనుల గురించి నేను ఏం చెప్పాలి. తాళి పట్టుకోవడం నేరం. తనని ప్రశ్నించి నిలదీయ్. అంతే కానీ తాళి తీయాలి అని చూడకు. అసలు నీకు మంగళ సూత్రం విలువ తెలుసా. 
అంబిక: తాళి కట్టని నీకు తాళి విలువ తెలుసా.
విహారి: నువ్వు మాట్లాడొద్దు అత్తయ్యా. నీకు పెళ్లే కాలేదు కాబట్టి నీకు ఈ విషయమే తెలీదు. అత్తయ్య తాళిని కూడా నువ్వు అలాగే పట్టుకొని లాగుతావా.
సహస్ర: మా అమ్మ మంగళసూత్రానికి దాని మంగళసూత్రానికి పోలుస్తున్నావా బావ.
విహారి: ఎవరిదైనా తాళి తాళే. దాన్ని అందరూ గౌరవించాలి మీరు అది తెలుసుకుంటే చాలు.
పద్మాక్షి: సరేరా అది తాళి లాగి తప్పు చేసింది కానీ ఇది పెళ్లి అయినా  చెప్పకుండా మదన్‌తో పెళ్లికి ఎలా ఒప్పుకుంది.  అసలు దాని మెడలో తాళి కట్టిన వాడు ఎవడు. 
మదన్: లక్ష్మీ ఆ తాళి నీ మెడలో ఎవరు కట్టారో నాకు తెలీదు. ఒకవేళ నువ్వు ఆ తాళి వల్లే చావాలి అనుకుంటే నీ భర్త తిరిగి రాడు అని నువ్వు నమ్మితే ఇప్పటికైనా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ అంతా మర్చిపో. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!

Continues below advertisement