Vijay Binni : టాలీవుడ్ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ లలో విజయ్ బిన్నీ మాస్టర్ కూడా ఒకరు. కొరియాగ్రాఫర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీ అన్పించుకున్నారు బిన్నీ మాస్టర్. 'నా సామి రంగ' మూవీతో డైరెక్టర్ అవతారం ఎత్తిన ఆయన, కొరియోగ్రాఫర్ గా రవితేజ, నిఖిల్, రామ్ పోతినేని, ధనుష్, చిరంజీవి వంటి స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఆయన ఢీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా రాణిస్తున్నారు. తాజాగా బిన్నీ మాస్టర్ 'చిట్ చాట్ సిరీస్' అనే బుల్లితెర సెలెబ్రిటీ టాక్ షోలో పాల్గొని, తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు. 

1. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన మీరు డైరెక్టర్ అవ్వడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? బిన్నీ మాస్టర్ : ప్రత్యేకంగా రీజన్ అంటూ ఏమీ లేదు. నేను ముందుగా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. డైరెక్ట్ గా డైరెక్టర్ అవ్వడం కుదరదు కాబట్టి, కొరియోగ్రాఫర్ గా వచ్చి ఇప్పుడు డైరెక్టర్ గా మారుతున్నాను. 

2. మీరు డైరెక్టర్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారు? బిన్నీ మాస్టర్ : నేను డైరెక్టర్ ఇవ్వడానికి చాలామంది సపోర్ట్ చేశారు. కానీ క్రెడిట్ మాత్రం నాగార్జునకి ఇస్తాను. ఆయనే నన్ను సెలెక్ట్ చేసుకుని, ఈ సినిమాని నువ్వు చెయ్ అంటూ అవకాశం ఇచ్చారు. 

3. 'నా సామిరంగా' మూవీతో మెగా మైక్ పట్టుకున్న మీరు, మెగాస్టార్ తో సాంగ్ ఎప్పుడు చేస్తారు? బిన్నీ మాస్టర్ : మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేయాలన్నది ఏ కొరియోగ్రాఫర్ కైనా ఉండే డ్రీమ్. అలా నా డ్రీమ్ ఇప్పటికే ఫుల్ ఫిల్ అయ్యింది. రీసెంట్ గా చిరంజీవికి 'విశ్వంభర'లో రెండు అద్భుతమైన పాటలకు కొరియోగ్రాఫ్ చేసాను. 

5. మీరు కొరియోగ్రాఫర్ అవ్వడానికి దిల్ రాజు హెల్ప్ చేశారంట. నిజమేనా? బిన్నీ మాస్టర్ : 100% నిజం. ఒక రియాల్టీ షోలో నేను స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అక్కడికి దిల్ రాజు వచ్చారు. లక్కీగా ఆయన కంట్లో పడ్డాను. దీంతో ఆయన మైక్ తీసుకుని నా నెక్స్ట్ మూవీతో ఈ అబ్బాయిని కొరియోగ్రాఫర్ గా లాంచ్ చేస్తాను అని ఆయన మాటిచ్చారు. దిల్ రాజు అవకాశం ఇవ్వడం వల్లే నేను కొరియోగ్రాఫర్ గా టర్న్ అయ్యాను. థాంక్యూ దిల్ రాజు గారు.

6. ఈ హీరో తో వర్క్ చేసే ఛాన్స్ రాలేదే అని ఫీలయిన హీరో ఎవరు? బిన్నీ మాస్టర్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన మూవీస్ ఎక్కువగా చేయడం లేదు కాబట్టి కుదరట్లేదు. కానీ ఏదో ఒకరోజు కచ్చితంగా ఆయనతో కలిసి పని చేస్తాను. 

7. ఢీ షోలో మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఎవరు? బిన్నీ మాస్టర్ : ఆది. ఆయనకి పంచులు ఎలా వస్తాయో తెలియదు గానీ, ఏం మాట్లాడినా సరే నవ్విస్తారు. 

8. మీ లైఫ్ లో బాగా సపోర్టింగ్ పర్సన్ ఎవరు? బిన్నీ మాస్టర్ : ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయుంటే గనక ఈరోజు నేను కొరియోగ్రాఫర్ ని అయ్యే వాడిని కాదు. డైరెక్టర్ ని, ఆర్టిస్ట్ ని కూడా అయ్యే వాడిని కాదు. థాంక్స్ టు మై ఫ్యామిలీ. 

9. కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్... ఫ్యూచర్లో మిమ్మల్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు?బిన్నీ మాస్టర్ : ఏదో ఒకటి కాదు మూడు. 

10. హీరోలతో మీరు చేసిన బెస్ట్ సాంగ్స్... బిన్నీ మాస్టర్ : నిఖిల్ - స్వయంభూ, నాని - జెర్సీ, రామ్ పోతినేని - పెద్ద పెద్ద కళ్ళతో సాంగ్, రవితేజ - డిస్కో రాజా, వాల్తేరు వీరయ్య, ధనుష్ - మాస్టారు మాస్టారు.

Also Read: 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?