Karthika Deepam 2 Serial Today January 11th: కార్తీకదీపం 2 సీరియల్: రూట్ మార్చి టార్గెట్ వీక్ పాయింట్ మీద కొట్టమని జ్యోకి పారూ సలహా.. ఇట్స్ రివేంజ్ టైం!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న తన సీఈవో పోస్ట్ కోసం ఇంట్లో అందరి కాళ్లా వేళ్లా పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ లాకెట్ మెడలో వేసుకుంటే దానికి శౌర్య నీకు అమ్మ కంటే ఆ లాకెట్ ఇచ్చిన వాళ్లే ఎక్కువ ఇష్టం అని అంటుంది. దీప పాపతో అది కార్తీక్ బాబు సొంత విషయం అని అంటుంది. దాంతో కార్తీక్ ఇద్దరిని ఆపి లాకెట్ పంచాయితీ ఎక్కడికో వెళ్తుందని అర్థమైందని అందుకే లాకెట్ తీసేశాను అని ఇప్పుడు అందరూ హ్యాపీ ఏనా అని అంటాడు. అది ఎవరి కంట కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకంటానని అంటాడు.
కార్తీక్: ఈ లాకెట్ వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తిని ఉంటే వాళ్లకి నా విన్నపం ఏంటి అంటే ప్రాణదాత అంటే కృతజ్ఞత. మాటల సారాశాన్ని గుర్తించగలరు. ఈ సభ ఇంతటితో సమాప్తం.
శౌర్య: మీరు ఎన్ని చెప్పినా అది నాదే నాకు నచ్చింది.
దీప: అది మీ అమ్మమ్మది శౌర్య మీ అమ్మది ఎప్పటికైనా అది నీదే. కానీ అది నీకు ఇచ్చే రోజు తొందర్లోనే రావాలి అని కోరుకుంటున్నా
సుమిత్ర: నిన్నటి వరకు సరదాగా తిరిగిన మనిషికి కంపెనీ బాధ్యతలు ఇవ్వడం తప్పు కాదు మామయ్య గారు కానీ తను చెప్పేది వినకుండా తనకి పూర్తి బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్ కాదు మామయ్య చూశారా ఇప్పడేమైందో.
జ్యోత్స్న: నేనే ఏం తప్పు చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాతో వాళ్లకి సారీ చెప్పించారు రేపటి నుంచి నేను వాళ్లతో ఎలా వర్క్ చేయాలి.
శివనారాయణ: అవసరం లేదు నువ్వు రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.
జ్యోత్స్న: తాత నేను సీఈఓగానే ఉంటా.
శివనారాయణ: ఏం ఇంకేం చేయాలి అనుకుంటున్నావ్.
దశరథ్: ఇంత చదువుకున్నావ్ ఆ మాత్రం తెలీదా.
శివనారాయణ: రూల్స్ పాటించడం తెలీదు నీకు. ఆ కార్తీక్, దీపలు మనల్ని దారుణంగా అవమానించారు.
సుమిత్ర: కార్తీక్‌ని మళ్లీ సీఈఓని చేయండి.
శివనారాయణ: అప్పుడు నేను ఛైర్మన్‌గా రాజీనామా చేయాలి.
జ్యోత్స్న: నాకు ఇంకొక్క అవకాశం ఇవ్వండి ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా మీకు చెప్పే చేస్తా. లేకపోతే దీప ముందు ఓడిపోయినట్లే అవుతుంది.
దశరథ్: జ్యోత్స్న నిర్ణయం మీద నమ్మకం పోయింది.
జ్యోత్స్న ఇంట్లో అందరినీ బతిమాలుతుంది. క్షమించమని అడుగుతుంది. దాంతో శివనారాయణ క్షమిస్తా అని కానీ దీప, కార్తీక్‌ల ముందు నా పరువు తీసేశావని ఇవన్నీ ఒకే కానీ ఆ కార్తీక్ ముందు నా పరువు తీయకు అని అంటాడు. ఇక జ్యోత్స్న తండ్రి అన్నీ మాకు చెప్పే చేయాలి అని నువ్వు పేరుకే సీఈఓ కానీ అన్నీ మాకు చెప్పి చేయాలని అంటారు. జ్యోత్స్న దీపని ఏడిపించి తాను గెలుస్తా అని పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఇక శ్రీధర్ ఇంట్లో గెంతులేస్తాడు. కావేరి ఏమైందని అడుగుతుంది. తనని కొట్టి బయటకు గెంటేసిని శివనారాయణ పరువు పోయిందని అంటాడు. కార్తీక్, దీపలు సోషల్ మీడియా వేదికగా మామ పరువు తీసేశాడని జరిగిన విషయం చెప్తాడు. నా తిక్క మామ నాకు ఎదురు పడితే నేనే పరువు తీస్తానని.. ఇక తన కొడుకు ఆ వంటలక్కతో సైకిల్ మీద తిరుగుతూ పొట్లాలు అమ్ముకుంటున్నాడని అంటాడు. కావేరి అలా ఆలోచించడం తప్పు అని అంటుంది.
జ్యోత్స్న దీప తనని కొట్టడం తనని అవమానించడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది. కోపంతో రగిలిపోతూ రబ్బరుతో చేతిని కొట్టుకుంటూ ఉంటే పారిజాతం వచ్చి పెద్ద తాడు ఇచ్చిదాంతో కొట్టుకోమని చెప్తుంది. నువ్వు మారిపోయావ్ అని ఎక్కడో రూట్ తప్పావని ఎక్కడో తప్పు చేస్తున్నావ్ అని నువ్వు చేసే పనులు సీఈఓగా నువ్వు వేస్ట్ కార్తీక్ బెస్ట్ అనేలా ఉన్నాయని అంటుంది. టార్గెట్ మార్చాలని బలమైన టార్గెట్ ఉంటే దాని వీక్ పాయింట్ మీద కొట్టాలని అంటుంది. దీప వంట గదిలో పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకొని ఇబ్బంది పడుతుంటే కార్తీక్ వచ్చి నీ గురించి కూడా ఆలోచించుకోవాలని కార్తీక్ దీప చేతికి మందు రాస్తాడు. దీప మనసులో కార్తీక్ బాబు గ్రేట్ అని అనుకుంటుంది. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!