Satyabhama Serial Today Episode క్రిష్‌ బాధ పడుతుంటే అక్కడికి బామ్మ వస్తుంది. బామ్మతో క్రిష్‌ తన జీవితం తనకు నచ్చడం లేదని అందరికీ దూరంగా పారిపోవాలని ఉందని అంటాడు. పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదు.. తప్పు చేయకుండా ఎవరూ ఉండరు తప్పు పైకి చెప్తే మనసు తేలిక అవుతుందని బామ్మ చెప్తుంది. 

క్రిష్‌: నా చేతిలో తల పెట్టుకొని ఒక నిండు ప్రాణం గిల గిల కొట్టుకొని చనిపోయింది బామ్మ. ఆ ప్రాణాన్ని చంపింది ఎవరో తెలిసినా తిరగబడలేకపోతున్నా అడగలేకపోతున్నా. నా చేతకాని తనానికి నా బతకు మీద నాకే విరక్తి పుడుతుంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది.బామ్మ: అసలేం జరిగిందిరా.క్రిష్‌: సత్యని సపోర్ట్ చేస్తా అని చెప్పినందుకు ఆ వృద్ధులను బెదిరించి ఓకామెని అన్నయ్య, బాపు ప్లాన్ చేసి చంపేశారు. ఏంటి బామ్మ ఇదంతా.బామ్మ: మీ బాపు పక్కనుండి ఇంతకు ముందు నువ్వు ఇలాంటి పనులు చేశావ్ కదరా మరి ఇప్పుడు ఎందుకు తప్పు అనిపిస్తుంది.క్రిష్‌: నేను ఎప్పుడూ రౌడీలను చంపలేదు బామ్మ. రౌడీలు, గూండాలతోనే కొట్లాడినా. ఇప్పుడు వాళ్లు సత్య విషయంలో చేసింది తప్పు బామ్మ. బాపులో కొంచెం అయినా మంచితనం ఉండాలి కదా. బామ్మ: వెళ్లి మీ బాపుని నిలదీయొచ్చు కదా గొంతుకి ఏం అడ్డం పడుతుంది.క్రిష్‌: ఆపేక్ష ప్రేమ ఇన్నాళ్లు నన్ను గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నాడు. ఇప్పుడు నేను ఎదురు తిరిగితే బాపు తట్టుకోలేడు అందుకే భరిస్తున్నా. కానీ సత్య బాధని చూసి తట్టుకోలేకపోతున్నా బామ్మ. పోయిన ప్రాణం తీసుకురమ్మని మీ బాపుకి చెప్పు అంటుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నా.బామ్మ: సత్య ఎమ్మెల్యే ఎందుకు అవ్వాలని అనుకుందో నీకు ఇప్పటికైనా అర్థమైందా. తను చేసేది తప్పు మీద యుద్ధం ఆలోచించకుండా సత్య వైపు నిలబడి సపోర్ట్ చేయొ. ఏంటి ఆలోచిస్తున్నావ్.క్రిష్: బాపుకి నీతో ఉంటా అని చేతిలో చేయి వేసి మాటిచ్చినా వెనక్కి తగ్గలేను.బామ్మ: అయితే సత్యకి దూరం జరుగు. సత్య బాధ గురించి ఆలోచించకు. క్రిష్: సత్య నామినేషన్ వేయాల్సిందే తను గెలవాల్సిందే న్యాయం మీద తను గెలవాల్సిందే. ఇప్పటి వరకు సత్యకి అడ్డుపడ్డాను కానీ ఇక అదే పని చేస్తే నన్ను నేను క్షమించుకోలేను బామ్మ. కానీ ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నా. బామ్మ: మనల్ని కాపాడాలి అనుకున్నప్పుడు మన పక్కనే దేవుడి నిలబడి కాపాడడు కనిపించకుండానే సాయం చేస్తాడు. నువ్వేం చేయాలో నువ్వే నిర్ణయించుకో.  శాంతమ్మ: సత్య సమయానికి ఫోన్ చేసింది కాబట్టి నిన్ను కాపాడుకోగలిగాం విశ్వం.నందిని: పుట్టింటోళ్లు వదినను తన్ని తరిమేసినా తను మాత్రం ఇక్కడి వాళ్ల బాగు కోసమే ఆలోచిస్తుంది తన ప్రాణం ఇక్కడే ఉంది.హర్ష: మనం ఏం చేశామని మన మీద దాడి చేస్తున్నారు.సంధ్య: అక్క వల్లే మనకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇంకొక సారి మనం అక్కతో మాట్లాడుదామా.నందిని: ఎవరో మన జీవితాల మీద పెత్తనం చేయడం ఏంటి.శాంతమ్మ: మనల్ని బెదిరించి సత్యని దారిలోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారురా.హర్ష: ఇలా ఎంత కాలం బామ్మ మనం ఎప్పటికీ చేతకాని వాళ్లలాగే ఉండాలా.సంధ్య: ఇలాంటి ఆలోచనలు వద్దు గొడవలు పెరుగుతాయి.విశాలాక్షి: పెరిగితే పెరగని గొడవలు పెరగని ఎక్కడి వరకు పెరుగుతాయో చూద్దాం.సంధ్య: అమ్మ నువ్వు కూడా ఏంటి ఒక సారి నాన్న గాయం చూసి మాట్లాడువిశాలాక్షి: మన మంచి తనం వాళ్లకి అర్థం కాకపోతే మనం కూడా అలాగే వాళ్ల రూట్‌లోనే వెళ్లాలి. మనం అందరం సత్యకి సపోర్ట్ చేద్దాం. ఏమైనా జరగని. మీ అన్నయ్య అన్నట్లు ఎవరైనా భయపడిన వాళ్లనే భయపడతారు. మనకి బలం ఉంది మనం ఎదుర్కొందాం. మనం తగ్గిపోవడం వల్ల సత్యకి ఏమవుతుందో అని భయంగా ఉంది.విశ్వనాథం: ఇప్పుడు అర్థం చేసుకున్నావా విశాలాక్షి. విశాలాక్షి: మన నిర్ణయం సత్యకి చెపుదాం.సంధ్య: అది కాదమ్మా మన ఆరుగురు సపోర్ట్ చేసినంత మాత్రాన అక్క  గెలిస్తుందా.నందిని: అది తను చూసుకుంటుందిలే.విశ్వనాథం: ఇంకేం ఆలోచించడం లేదు మన నిర్ణయం సత్యకి చెప్పండి.సంధ్య: మనసులో అందరూ అక్కకి సపోర్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి సంజయ్‌ని వదులుకోలేను. ఎలా అయినా అక్కని ఆపాలి.సత్య: (తన ఎదురుగా జరిగిన ఘటన గుర్తు చేసుకొని ఏడుస్తూ లెటర్ రాసి మామకు ఇస్తుంది.)  నాకు ప్రశాంతత కావాలి మామయ్య చెప్పండి మామయ్య అగ్ని చల్లారాలి అంటే నేను ఏం చేయాలి. మహదేవయ్య: ఏమైంది సత్య ఎందుకు ఇంత ఆగం అవుతున్నావ్. కూర్చొ జర.సత్య: అవసరం లేదు మామయ్య నేను ఏం కావాలి అని అడుగుతున్నానో ఏం జరిగిందో మీకు తెలుసు.భైరవి: ఏంటే ఆ అరుపులు పెద్ద మనిషితో ఇలాగేనా మాట్లాడేది.

సత్య: ఎవరు అత్తయ్యా పెద్దమనిషి. ఎవరు వయసుతో పెద్దరికం రాదు. పెద్ద మనసు ఉంటేనే పెద్దరికం వస్తుంది. ముసలి వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడి ప్రాణాలు తీసుకున్నవాళ్లకి పెద్దరికం రాదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇంక నా వల్ల కాదు ఒక అగ్నిమెంట్‌కి వచ్చేద్దాం మామయ్య. నేను గెలిచేస్తా అనే కదా ఇంత చేశారు.రుద్ర: నీకు అంత సీన్ లేదుసత్య: ఉంది కాబట్టే నాకు అడ్డు పడుతున్నారు. నాకు సపోర్ట్ చేస్తాన్న పెద్దావిడను చంపేశారు. నేను జాగ్రత్త పడాలి అనుకుంటున్నా. ఇప్పుడే కాదు జీవితంలో ఇంకెప్పుడూ నేను ఎలక్షన్‌లో పోటీ చేయను. మీ రాజకీయాల జోలికి రాను. మీతో ఏ విషయంలోనూ గొడవ పడను. ఏ విషయంలోనూ.. అలా అని హామీ పత్రాల్లో రాశాను. సంతకం కూడా చేశాను. అందుకు మీరు నాకు మాటగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ల జోలికి వెళ్లకూడదు.బామ్మ: మాకు ఏమైనా అవుతుందని భయపడుతున్నావా సత్యసత్య: అవుతుందా అని కాదు అయి తీరుతుంది.రేణుక: మాకు ఏమైనా పర్లేదు కాదు సత్య.క్రిష్‌: మనసులో సత్యని ఏదో ఒకటి చేసి ఆపాలి తను పోటీ చేయాలి తనని ఏదోలా ఆపాలి రెచ్చగొట్టాలి.సత్య: ఈ క్షణం నుంచి  ఈ అగ్రిమెంట్ అమలులోకి వస్తుంది.క్రిష్: ఒక్క నిమిషం. 

మహదేవయ్య వదిలేయ్ అంటే క్రిష్ ఒప్పుకోడు. తను పోటీ పడుతుందని మనం భయం పడుతున్నాం అంటుంది అని అంటాడు. క్రిష్ కావాలనే చిల్లర మాటలు మాట్లాడకు సత్య అని కావాలనే సత్యని రెచ్చగొట్టడానికి అడ్డుగా మాట్లాడుతాడు. బాపు మీద గెలవలేనని తెలిసిపోయి ఇలా పారిపోతుందని క్రిష్‌ అంటాడు. నిజంగా నీకు భయం లేకపోతే పోటీ చేయ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!