Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి లక్ష్మీ బ్లడ్ ఆర్ట్‌తో రక్తం తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అత్తయ్య అరవిందకు ఆ విషయం చెప్పాలి అనుకుంటుంది. ఉదయం లక్ష్మీ చెప్పిన అమ్మాయి ఇంటికి వచ్చి బొమ్మ కోసం అన్నట్లు మనీషా రక్తం హెచ్ సీ జీ టెస్ట్ కోసం తీసుకోవాలి అని వస్తుంది. ఆర్టిస్ట్‌ని అరవింద ఇంట్లో అందరికీ పరిచయం చేస్తుంది.  


రక్తంతో మిత్ర బొమ్మ గీయిస్తే మంచి జరుగుతుందని అరవింద అందరికీ చెప్తుంది. ఇలాంటివి నమ్ముతావా అని జయదేవ్ అడుగుతాడు. అవన్నీ మూఢనమ్మకాలు అని అంటాడు. దేవయాని మనసులో అక్క ఏమైనా ప్లాన్ చేస్తుందా అనుకుంటుంది. మిత్రకు దగ్గర వారు రక్తం ఇవ్వాలి అని ఎవరు ఇస్తారు అని ఆర్టిస్ట్ అడిగితే మిత్ర నా కొడుకు నేను ఇస్తాను అని అరవింద అంటుంది. 


లక్ష్మీ: మనసులో నేను రంగంలోకి దిగితే కానీ ఇది దిగనట్లు లేదు... మీరు రక్తం ఇవ్వడం ఏంటి అత్తయ్యగారు ఆయన భార్యని నేను నేను రక్తం ఇస్తాను. నా రక్తం తీసుకోండి.
మనీషా: మనసులో ఇదేంటి ఆంటీ దగ్గర మార్కులు కొట్టేయాలి అనుకుంటుందా దీన్ని ఎలా అయినా ఆపాలి. ఎక్స్ క్యూజ్ మీ.. నిన్ను అత్తయ్య చెప్పింది విన్నాక కూడా ఇంకా నువ్వు ఈ ఇంటి కోడలి స్థానంలో ఉన్నావు అనుకుంటున్నావా. నేను మిత్ర గారి భార్యనే.
లక్ష్మీ: నేను ఎప్పటి నుంచో ఆయన భార్యని మాకు కొడుకు కూడా ఉన్నాడు.
మనీషా: మిత్ర నాకు తాళి కట్టాడు. నువ్వు రాకముందు నేను మిత్రలు లవ్ చేసుకున్నాం. మాకు బిడ్డ పుట్టబోతుంది. నేను రక్తం ఇస్తాను.
లక్ష్మీ: నేను ఇస్తాను. 
మనీషా: నేను ఇస్తాను.
లక్ష్మీ: నేనే ఇస్తాను. అత్తయ్య మీరు చెప్పండి ఎవరు ఇవ్వాలి.
దేవయాని: నువ్వు ఇవ్వు లక్ష్మీ మనీషా కడుపుతో ఉంది కదా మళ్లీ రక్తం ఇస్తే బిడ్డుకు ఏమైనా అవుతుందేమో.
మనీషా: ఏం కాదు ఆంటీ నేను ఇస్తాను. బిడ్డకు ఏం కాకుండా ఎంత కావాలో అంత బ్లడ్ తీసుకోండి.
లక్ష్మీ: నేనే ఇస్తాను.
అరవింద: ఏం అక్కర్లేదు లక్ష్మీ. మనీషానే ఇస్తుంది. 
మనీషా: ఇదేంటి బ్లడ్ టెస్ట్‌కి అన్నట్లు టెస్ట్ ట్యూబ్ తీశారు. 
ఆర్టిస్ట్: బొమ్మ గీసే వరకు రక్తం గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఇలా తీయాలి.


అందరూ మనీషాని ఒప్పిస్తారు. మనీషా రక్తం ఇస్తుంది. దొరికిపోయావ్ మనీషా అని లక్ష్మీ అనుకుంటుంది. పాపం విషయం తెలియని మనీషా లక్ష్మీని ఓడిపోయావ్ అన్నట్లు సెటైర్లు వేస్తుంది. ఆర్టిస్ట్ మర్చిపోయి 3 గంట్లో రిపోర్ట్స్ అనేసి వెంటనే కవర్ చేస్తుంది. మనీషాకి అనుమానం ఇస్తుంది. ఇక అరవింద బొమ్మ మంచిగా రావాలి ఏం తేడా రాకూడదు అని ఇన్‌డైరెక్ట్‌గా రిపోర్ట్స్ గురించి చెప్తుంది. తనకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని మనీషా చెప్తుంది. మనీషా దేవయానితో లక్ష్మీ మీద గెలుస్తూనే ఉన్నాను నా టైం చాలా బాగుంది అని పొంగిపోతుంది. నాకు ఏదో తేడాగా ఉందని దేవయాని అంటుంది. మిత్ర అంటే ఆంటీకి ప్రాణం అని మిత్ర కోసం ఏమైనా చేస్తారని అంటుంది. 


లక్ష్మీ, జానులు వంట చేస్తూ మనీషా పీడ విరగడై పోతుందని కదా అని అంటుంది. మనీషా వచ్చి నా గురించే మాట్లాడుకుంటున్నారా అరవింద ఆంటీ మెచ్చిన కోడలు నేను అయిపోయా అంటుంది. నీది మూడు నాళ్ల ముచ్చటే అని జాను అంటుంది. మనీషా, లక్ష్మీలు ఒకరి మీద ఒకరు మాటలు అనుకోవడం లక్ష్మీని పని మనిషిగా ఇంట్లో ఉంచుతానని నాకు సేవ చేయడానికి రెడీగా ఉండు అని మనీషా అంటుంది. అంతా విన్న జయదేవ్ అరవింద దగ్గరకు వెళ్లి మనీషా ఈ ఇంటి మహాలక్ష్మీని అవమానిస్తుందని కోప్పడతాడు. అటుగా వెళ్లిన దేవయాని ఆ మాటలు వింటుంది. నువ్వు తప్పు చేస్తున్నావ్ అని అరవింద అంటే దానికి అరవింద మనీషా రక్తం తీసుకుంది మిత్ర బొమ్మ గీయడానికి కాదని మనీషా ప్రెగ్నెంట్‌ అవునో కాదో తెలుసుకోవడానికి బ్లడ్‌ టెస్ట్ చేయడానికి తీసుకున్నామని ఇందాక ఇంటికి వచ్చినామ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్తుంది.


దేవయాని మనీషాకి చెప్పడానికి పరుగులు తీస్తుంది. మనీషా అబద్ధం చెప్పిందని తేలితే మనీషా మీద చీటింగ్ కేసు పెడతానని అంటుంది. మనసులో మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదు అని మనీషా ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటుంది. మనీషా దగ్గరకు దేవయాని వెళ్లి నీ పెట్టే బేడ సర్దుకో అర్జెంట్‌గా పారిపో  పోలీసులు అరెస్ట్ చేయకుండా పారిపో అంటుంది. ఇందాక బ్లడ్ తీసుకుంది నీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి అని చెప్పగానే మనీషా కళ్లు తిరిగి పడిపోతుంది. దేవయాని ముఖం మీద నీళ్లు చల్లి లేపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?