Ennallo Vechina Hrudayam Serial Today Episode యశోద నాటకంలో త్రిపుర దగ్గరకు గిరి రాక్షసుడి వేషం వేసుకొని వచ్చి అల్లరి చేయబోతే శ్రీకృష్ణుడిలా ఉన్న బాబు గిరిని తన్నేస్తాడు. గిరి విలవిల్లాడిపోతాడు. నాటిక చాలా బాగుందని అందరూ అంటారు. అందరూ త్రిపురని మెచ్చుకుంటారు. ఇక భారతి త్రిపుర దగ్గరకు వచ్చి ప్రియ కనిపించడం లేదని చెప్తుంది.
త్రిపుర, భారతిలు ప్రియ కోసం వెతుకుతారు. నాటిక బాగుండటంతో నాటిక వేసిన వాళ్లని గౌరవించాలని బాలని స్టేజ్ మీదకి పిలుస్తారు. త్రిపుర, భారతి ప్రియని చూసి వెళ్తారు. ఈ గదిలోకి వెలా వచ్చావని ప్రియని అడిగితే ఓ అంకుల్ బంధించారని బాలకి ప్రమాదం ఉందని ప్రియ విన్న మాటలు అన్నీ త్రిపురతో చెప్తుంది. త్రిపుర షాక్ అయిపోతుంది. ప్రియను తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. బాల స్టేజ్ ఎక్కగానే మాట్లాడమని అంటారు. ప్రైజ్ బొమ్మ బాలకృష్ణ పట్టుకోగానే పేల్చేయడానికి ఫణి తన మనుషులతో రెడీగా ఉంటాడు. బాల అమ్మ గొప్పతనం చెప్తాడు. త్రిపుర వాళ్లు లోపలికి రాగానే ప్రియ రౌడీలను త్రిపురకు చూపిస్తుంది. వాళ్ల దగ్గరే బాంబ్ రిమోట్ ఉందని చెప్తుంది.
బాల నాటికి వేసిన అందరికీ మెడల్స్ ఇచ్చి గిఫ్ట్‌లు ఇస్తారు. ఇక ఫణి బాంబ్ పెట్టిన గిఫ్ట్ బాలకి ఇవ్వగానే అది తీసుకొని బాల పట్టుకోగానే ఫణి వాళ్లు బాల బాంబ్ పేలి చనిపోతాడని అనుకుంటారు. చాలా సంతోష పడతారు. తీరా చూస్తే బాల ఆ బాంబ్ గెలిచిన శ్రీకృష్టుడికి ఇస్తారు. బాంబ్ పేలక పోవడంతో షాక్ అయిపోతారు. త్రిపుర శ్రీకృష్ణుడి గెటప్ వేసుకున్న బాబుని పిలిచి వాళ్లని ఓ ఆట ఆడించి రిమోట్ తీసుకురమ్మని చెప్తుంది. బాబు అలానే చేయడంతో త్రిపుర రిమోట్‌లో సెల్స్ తీసేస్తుంది. ఫణి వాళ్లు చూసే సరికి రౌడీలు కింద పడి విలవిల్లాడుతుంటారు. నాటకం తెలిసిపోయిందేమో అని కంగారు పడతారు.
నాటిక సక్సెస్ అయిన త్రిపురని పిలుస్తారు. బాల త్రిపురని మెచ్చుకొని చెక్ మీద తన తాతయ్య నాగభూషణం, ఫణిలు బాగోతం రికార్డ్ చేసిన పెన్‌తో సంతకం పెట్టి ఇస్తాడు. ఇక ఆ పెన్ సంతకం పెట్టడానికి త్రిపుర చేతిలో పెడతాడు. ఇంతలో దొరక్కుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలని ఫణి వాళ్లు తల్లితో చెప్తే వాసుకి కళ్లు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. బాలని చంపలేకపోతున్నాం అని తిట్టుకుంటారు. బాలకి విషయం తెలీదు అని మాట్లాడుకుంటే బాల వాళ్లు అక్కడికి వస్తారు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే మదర్స్ డే ఇంత గ్రాండ్‌గా చేస్తే ఫాదర్స్ డే ఇంకెంతలా చేస్తావా అని అనుకుంటున్నాం అని అంటారు. యశోద, బామ్మలు బాలని పొగుడుతారు.
బాల కోసం బామ్మ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తానని అంటుంది. దాంతో బాల నువ్వు వెళ్లొద్దు నీ బదులు నేను వెళ్తానని అంటాడు. అనంత్‌ని బాల రమ్మని అంటే రామగిరి డాక్యుమెంట్స్ రెడీ అయ్యావని తీసుకొస్తానని చెప్తాడు. దాంతో ఫణి, అనంత్‌ని బాల ఆఫీస్‌కి వెళ్లమని తాను గుడికి బయల్దేరుతాడు. త్రిపురని నాటకాల వాళ్లు పొగిడేస్తారు. గాయత్రీ చాలా సంతోషపడుతుంది. మిగిలిన డబ్బు త్రిపురకు ఇస్తారు. రాక్షసుడు వచ్చినప్పుడు భలే నటించావని త్రిపురతో అంటారు. నాటకం దగ్గరకు గిరి వచ్చాడని త్రిపుర చెల్లితో చెప్తుంది. అనంత్ రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్తాడు. అక్కడ గతంలో గాయత్రీ, అనంత్‌లను విడదీయడానికి ఊర్వశి నాటకం ఆడించిన అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనంత్ చూస్తాడు. అతన్ని చూసి నిలదీయడంతో వాడు పారిపోతాడు. అనంత్ వాడిని పట్టుకొని గాయత్రీని పెళ్లి చేసుకొని ఇప్పుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని నిలదీస్తాడు. దాంతో ఆ అబ్బాయి నాకు గాయత్రీకి పెళ్లి అవ్వలేదని మీరు వినాలనే కావాలని అలా చెప్పానని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?