Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode  వివేక్ జయదేవ్ ఫోన్ చేయడంతో కుప్పకూలిపోతాడు. దాంతో దేవయాని మనీషాకి కాల్ చేసి విషయం అడుగుతుంది. మనీషా తనకి మిత్రకు పెళ్లి అయిందని చెప్తుంది. దేవయాని షాక్ అయిపోతుంది. మిత్రను నేను పెళ్లి చేసుకున్నానని మనీషా జరిగింది దేవయానితో చెప్తుంది.  


దేవయాని: అక్కడ నువ్వు మిత్రకు భార్యవి అయ్యావ్ ఇక్కడ లక్ష్మీ పూజకు పనికి రాని పువ్వు అయింది.
మనీషా: ఏంటి.
దేవయాని: జాను గర్భ సంచి పాడైందని తీసేశారు లక్ష్మీ దాని గర్భసంచి ఇచ్చేసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చీర ఇచ్చినట్లు ఇచ్చేసింది. అది అక్క కాదు జాను పాలిట దేవత. కాసేపట్లో అరవింద ఆంటీ ఇంటికి రాబోతుంది ఏం జరుగుతుందో ఏంటో.
మనీషా: ఆ అరవింద మాలిని కోసమే నేను వెయిటింగ్ ఆంటీ తను రాకముందే మిత్రని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా చేసుకున్నా. ఇక ఆమె రావడమే ఆలస్యం. 


అరవింద ఇంటికి వస్తుంది. జయదేవ్‌తో ప్రేమగా మాట్లాడినా పట్టించుకోడు. ఇంట్లో అందరినీ అడుగుతుంది. ఇక మిత్ర కోసం వెళ్తుంది. అక్కడ మనీషాని చూసి నువ్వేంటి ఇక్కడ అని అంటుంది. ఏమైందని మనీషాని అడిగితే మిత్ర మందు తాగాడని తనని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. అరవింద షాక్ అయిపోతుంది. జయదేవ్ అంకుల్‌ సాక్షిగా మిత్ర తాళి కట్టాడని అంటుంది. అరవింద ఇదేంటి అని అడుగుతుంది. మనీషా నిజమే అని అంకుల్‌ని అడగమని అంటే నువ్వు చేసిన మోసాలు అబద్ధాలు నాకు తెలుసని ఇది కూడా నీ నాటకం అయింటుందని మిత్ర లేవగానే ఇదే తాళితో నీకు ఉరివేస్తానని అంటుంది. 


మనీషా టెన్షన్‌గా సరయుకి కాల్ చేస్తుంది. అరవింద వచ్చి వార్ చేసిందని మిత్ర తాళి కట్టడం ఫేక్ అంటుందని చెప్తుంది. లక్ష్మీ కోసం నన్ను చంపేస్తుందని అంటే మిత్ర కళ్లు తెరిచేలోపు అక్కడ అందరి కళ్లు తెరుచుకునేలా చేస్తానని అంటుంది.  లక్ష్మీ సర్జరీ తర్వత లేచి మెల్లగా చెల్లి దగ్గరకు వెళ్తుంది. జాను చాలా నీరసంగా ఉంటుంది. జాను ఏడుస్తూ నా కోసం అంత పెద్ద త్యాగం ఎందుకు చేశావు అక్కా అని ఏడుస్తుంది. అక్కా చెల్లెళ్లు ఏడుస్తారు. చిన్నప్పుడు నాకు అమ్మవి అయ్యావ్ ఇప్పుడు నీ అమ్మ తనం ఇచ్చి నన్ను అమ్మని చేస్తున్నావ్ ఏం ఇచ్చి నీ రుణం తీసుకోవాలి అని అంటుంది. నువ్వు అమ్మవి అయితే నాకు అంతే చాలు నువ్వు సంతోషంగా ఉండాలి అని లక్ష్మీ చెప్తుంది. ఇక లక్ష్మీ మిత్ర గురించి అడిగితే ఇంటికి వెళ్లారని చెప్తుంది. లక్ష్మీ ఇంటికి వెళ్తాను అంటుంది. జానుని రెండు రోజులు ఉండాలని చెప్తారు. వివేక్, లక్ష్మీ, దేవయాని ఇంటికి వెళ్తారు. 


మిత్ర లేచి లక్ష్మీని, నాన్నని పిలిచి కిందకి వెళ్తాడు. హాల్‌లో తల్లిని చూపి పలకరిస్తాడు. అరవింద ఏం మాట్లాడదు. జయదేవ్ కూడా డల్‌గా ఉంటాడు. ఏమైందని మిత్ర అడుగుతాడు. ఇంతలో లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ నీరసంగా చూసి ఏమైంది లక్ష్మీ అని అడుగుతారు. దాంతో దేవయాని వచ్చి జాను గర్భసంచి పోతే దానికి లక్ష్మీ తన గర్భసంచి ఇచ్చిందని చెప్తుంది. అరవింద షాక్ అయిపోతుంది. లక్ష్మీ మీద వేసిన చేయి తీసేస్తుంది. దేవయాని చెప్పేది నిజమా దేవయాని చెప్పేది నిజమా అంటే అవును అని వివేక్ చెప్తాడు. ఎంత పని చేశావ్ లక్ష్మీ ఎవరికి చెప్పి ఈ పని చేశావ్. మిత్రకు చెప్పావా మీ మామయ్యకి చెప్పావా నాకు చెప్పావా అని అరుస్తుంది. మీకు మళ్లీ పిల్లలు పుట్టరు కదా అని అంటే మాకు మళ్లీ పిల్లలు ఎందుకు అని మిత్ర అంటాడు. జయదేవ్ కూడా మిత్ర, లక్ష్మీలకే సపోర్ట్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!