chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: అరవింద తన పుట్టిన రోజు నాడు లక్ష్మి ఇచ్చిన టెంపుల్ నెక్లెస్ చూస్తూ గుర్తు చేసుకుంటుంది. ఆ నెక్లెస్ ఇప్పుడు మిత్రకు చూపిస్తే ఇప్పుడు మిత్ర మనసు కొంచెం అయినా మారి లక్ష్మీ మీద కోపం తగ్గుతుందేమో అనుకుంటుంది. మిత్ర దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తుంది. మిత్ర లక్ష్మీకి సంబంధించిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పాను కదా అని అరుస్తాడు. లక్ష్మీనే వద్దు అనుకున్నప్పుడు తన గుర్తులు ఇంకా ఇంట్లో ఎందుకని ప్రశ్నిస్తాడు.
మిత్ర: లక్ష్మీకి సంబంధించినవి ఏవీ కూడా అందమైన జ్ఞాపకాలు కావమ్మా.
అరవింద: లక్ష్మీని ఇంత అసహించుకుంటున్నావ్ కదా ఏదో ఒక రోజు లక్ష్మి నీకు ఎదురైతే అప్పుడేం చేస్తావ్.
మిత్ర: మళ్లీ ఎదురు పడటం ఏంటి అమ్మ.. చనిపోయింది ఎలా వస్తుంది. ఎలా ఎదురు పడుతుంది.
అరవింద: చనిపోయింది అని మనం అనుకుంటున్నాం. కానీ దీక్షితులు గారు చనిపోలేదు అని చెప్తున్నారు. ఏదో ఒకరోజు లక్ష్మి తిరిగి వస్తుందని ఆయన నమ్ముతున్నారు.
మిత్ర: దీక్షితులు గారు చెప్పిందే నిజం అయితే లక్ష్మి మీద నా కోపం తీర్చుకోవడానికి ఓ గొప్ప అవకాశం దొరికినట్లే. ఒకవేళ లక్ష్మి తిరిగి వస్తే నేనే చంపేస్తా. వైజాగ్‌లో ఓ వెలుగు వెలిగిన నందా గ్రూప్ ఆఫ్ కంపెనీలు నేల మట్టం అవడానికి కారణం అయింది. మన అందరి భవిష్యత్‌ని ఏమవుతుందో తెలియని అంధకారంలో పడేసి వెళ్లిపోయింది. డాడ్ నిర్మించిన పునాది మీద నేను కట్టిన వ్యాపారభవంతిని కూలదోసి వెళ్లిపోయింది. అలాంటి లక్ష్మిని నేను అంత సులభంగా క్షమించను మమ్మీ. ఎట్టి పరిస్థితుల్లో వదలను.
మనీషా: ఆంటీ మీకు ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనకుంటా. మిత్రతో ఇంకెప్పుడు ఇలా మాట్లాడి మిత్రను ఇబ్బంది పెట్టకండి.
అరవింద: నువ్వు మధ్యలోకి రాకు మనీషా. నువ్వు అనవసరంగా మా తల్లీ కొడుకుల మధ్యలోకి వస్తే నేను నీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.
మనీషా తిరిగి రావడం జరిగితే కష్టమని ఈలోపే మిత్రను పెళ్లికి ఒప్పించాలి అని చెప్తుంది. మరోవైపు లక్కీ, జున్ను ఇంట్లో హోమ్ టూర్ చేస్తుంది. ఇళ్లంతా తిరుగుతూ అందరినీ పరిచయం చేస్తూ చెప్తుంది. మా అమ్మ అంటూ లక్ష్మీని చెప్తుంది. అందరూ కలిసి ఫొటోలు వీడియోలు తీసుకుంటారు. ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని లక్కీ అంటే లక్ష్మి భయపడుతుంది. లక్ష్మి వీడియో పెట్టొద్దని చెప్తుంది. లక్ష్మి సరే అంటుంది. ఇక జున్ను ఆడుకుందామని లక్కీని అంటే లక్కీ జున్నుని తన తండ్రి గురించి అడుగుతుంది. నాన్నలు ఎవరూ మంచోళ్లు కాదు అని జున్ను అంటాడు.
మరోవైపు రాత్రి అవ్వడంతో లక్కీ కోసం మిత్ర ఎదురు చూస్తూ ఉంటాడు. వివేక్, అరవింద కూడా బయటకు వచ్చి వచ్చేస్తుంది ఇంత టెన్షన్ అవసరం లేదు అని అంటారు. ఇక మిత్ర అర్జున్‌కి కాల్ చేసి సీరియస్‌గా నా కూతురిని ఎప్పుడు పంపిస్తావ్ అని అడుగుతాడు. ఆడుకొని భోజనం చేసి పడుకుందని చెప్తాడు. మిత్ర నన్ను వదిలేసి తినేసిందా.. నేను కథలు చెప్పకుండా నిద్ర పోతుందా అని అడుగుతాడు. అర్జున్ అంత కంగారు అవసరం లేదు అని నిద్ర పోతుంది పొద్దున్నే వస్తుందని చెప్తాడు. ఇక వివేక్ మిత్ర మీద సెటైర్లు వేస్తాడు. మిత్ర మాత్రం లక్కీ గురించి తలచుకొని తన మీద కూతురికి ప్రేమ తగ్గిపోతుందని అనుకుంటాడు. మరోవైపు అర్జున్ ఇంటికి అర్థరాత్రి మిత్ర వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.