Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ తనకు కుటుంబం కలిసి ఉండటానికి మించిన అవార్డు లేదని ఈ అవార్డు తీసుకోనని చెప్పి వెళ్లిపోతుంది. వివేక్, జయదేవ్‌లు లక్ష్మీ ఈ అవార్డు తీసుకునేలా ఒప్పించమని మిత్రకు చెప్తారు. లక్ష్మీ కిచెన్‌లో వంట చేస్తుంటే మిత్ర అక్కడికి వెళ్తాడు. 


మిత్ర: ఏం చేస్తున్నావ్ లక్ష్మీ నీకు అంత పెద్ద అవార్డు వస్తే నువ్వు సాధారణ మహిళలా వంట చేస్తున్నావ్. 
లక్ష్మీ: అవార్డు వస్తే నా పిల్లలకు వంట చేయొద్దా. 
మిత్ర: చేయొచ్చు కానీ బయట నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఛైర్మన్‌వి నీ కారణాలు నాకు తెలీదు లక్ష్మీ కానీ నువ్వు ఆ అవార్డు తీసుకోవాలి. 
లక్ష్మీ: వద్దండి నాకు ఇప్పుడు ఉన్న గౌరవం చాలు.
మిత్ర: చాలదు లక్ష్మీ దేశం మొత్తం నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నువ్వు ఇలా మాట్లాడటం మంచిది కాదు. 
లక్ష్మీ: మన ఇంట్లో జరుగుతున్న గొడవలు నాకు మంచిగా అనిపించడం లేదు. కుటుంబాన్ని కలిపి ఉంచలేని నాకు ఆ అవార్డు తీసుకునే అర్హత లేదు.
మిత్ర: మన ఫ్యామిలీ ఇంకా విడిపోలేదు విడిపోదు కూడా. ఆస్తి పంపకాలు కోసం ఆలోచిస్తూ అవార్డు వద్దనడం సరికాదు లక్ష్మీ నువ్వు అవార్డు తీసుకోవాల్సిందే. మా డాడ్ కష్టపడ్డారు కానీ అవార్డు రాలేదు. నేను కష్టపడ్డాను నాకు రాలేదు కానీ నీకు వచ్చింది నువ్వు తీసుకొని తీరాలి. 
లక్ష్మీ: వద్దండీ.
మిత్ర: లక్ష్మీ నేను నీ భర్తని భర్తగా నేను ఆర్డర్ వేస్తున్నా నువ్వు తీసుకోవాలి. మిసెస్ మిత్రానందన్‌గా అవార్డు తీసుకోవాలి. నా భార్యగా నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అవార్డు తీసుకుంటావ్ థట్స్ ఇట్. (మిత్ర లక్ష్మీని భార్యగా అంగీకరించడంతో లక్ష్మీ చాలా సంతోషిస్తుంది)
దేవయాని: ఏంటి మనీషా ఇది ఆస్తి పంపకాలు జరిగి నువ్వు మిత్ర కలుస్తారు అనుకుంటే మధ్యలో ఈ అవార్డు వచ్చి మిత్ర, లక్ష్మీలు ఒకటైపోయారు. నిన్నటి వరకు మిత్ర లక్ష్మీని తన భార్య కాదు అన్నాడు. ఈ రోజు తన భర్త అంటున్నాడు. చూస్తుంటే మిత్ర లక్ష్మీకి బాగా దగ్గరైపోయాడు. ఇక నీ పని అయిపోయినట్లే. అయినా లక్ష్మీ అంత పిచ్చిదేంటి నేషనల్ అవార్డు ఇస్తే వద్దంటుంది. ఆ అవార్డు నాకు వచ్చుంటే ఎగిరి గంతేసేదాన్ని. నీకు వచ్చిఉంటే స్టేట్ స్టేట్ తిరిగి ప్రచారం చేసేదానివి. లక్ష్మీ ఒట్టి మూర్ఖురాలు. 
మనీషా: అది తెలివి తక్కువది కాదు ఆంటీ. ఈ అవార్డు అడ్డు పెట్టుకొని ఆస్తి పంపకాలు ఆపాలి అనుకుంటుంది. మిత్ర నాకు దూరం కావడం కాదు ఆస్తి మీకు దూరం అవుతుంది. అవార్డు వచ్చిన ఇళ్లు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పి ఆస్తి పంపకం ఆపేస్తుంది. ఎప్పటిలా మిమల్ని పని వాళ్లని చేస్తుంది. అసలు లక్ష్మీ ఆస్తి పంపకాలు ఆపడానికే లక్ష్మీ ఇలా అవార్డు కొనేసిందేమో. లక్ష్మీ కష్టానికి అవార్డు ఇచ్చారో ఇంకోంటో జరిగిందో కానీ మీకు మాత్రం ఆస్తి దూరం అవ్వకూడదు అంటే వెంటనే లాయర్‌ని పిలిపించి ఆస్తి పంచమని చెప్పండి. అవార్డు లక్ష్మీకి వస్తే మీకు ఏంటి ఏది ఏమైనా ఆస్తి పంచమని చెప్పండి.
దేవయాని: నిజమే మనీషా దానికి ఏం వస్తే మాకు ఏంటి ఆస్తి పంపకాలు జరపాలి.


వివేక్ జాను దగ్గరకు వెళ్లి లక్ష్మీకి విష్ చేయమంటే జాను వెళ్లదు. లక్ష్మీని తిడుతుంది. దాని కంటే నేను ఎందులో తక్కువ కాదు అని అంటుంది. ఇంతలో దేవయాని కూడా అక్కడికి వస్తుంది. మీరు రాని అవార్డు తనకు రావడం ఏంట్రా అని అంటుంది. మన ఆస్తి తీసుకొని మన బతుకు మనం బతుకుదామని వెంటనే లాయర్‌ని పిలిపిద్దామని అంటుంది. ఇప్పుడు వద్దని వదినకు అవార్డు వచ్చినందుకు అందరూ మన గురించి మంచిగా మాట్లాడుకుంటారని అంటే జాను, దేవయాని ఒప్పుకోరు. దారుణంగా మాట్లాడుతున్నారని వివేక్ చెప్పి ఏదో చేసుకొని చావడండి అని వదిలేస్తాడు. సరయు దగ్గరకు మనీషా వెళ్తుంది. మనం ఓడిపోయాం అని అంటుంది సరయు.  ఇక సరయు కొందరు రౌడీలను పిలుపిస్తుంది. వాళ్లతో మనీషా ఫంక్షన్ జరగాలి కానీ లక్ష్మీ అవార్డు తీసుకోకూడదని లక్ష్మీకి అవమానం జరగాలి అని అంటుంది. సరయుతో మిత్ర లక్ష్మీని భార్యగా అన్నాడని చెప్తుంది. దాంతో సరయు మనసులో అందుకా దీనికి కాలిందని అనుకుంటుంది. లక్ష్మీకి ఎక్కడా సంతోషం ఉండకూడదని లక్ష్మీ మిత్రని వదిలేసి వెళ్లిపోవాలని అంటుంది. 


జయదేవ్‌కి కాల్ వస్తుంది. వివేక్ ఆడిటర్ అని జాహ్నవి మేడం పిలిచారని చెప్తారు. జయదేవ్ లక్ష్మీ, మిత్రను పిలిచి లాయర్లు, ఆడిటర్లు వస్తున్నారని నీకు అవార్డు వచ్చిన సంతోషం కూడా వాళ్లు ఉంచడం లేదని అంటాడు. దానికి లక్ష్మీ చేయనివ్వండి మామయ్య అంటే దానికి మిత్ర అలా అంటావేంటి లక్ష్మీ నీ అవార్డు ఫంక్షన్‌ కదా ఈరోజు ఇలా అయితే ఎలా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: యుద్ధానికి సిద్ధంగా ఉండమని తాతకి కార్తీక్ వార్నింగ్.. జ్యోత్స్న చేసిన పెంటకి రచ్చే ఇక!