Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 28th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ ఫ్యామిలీని చంపడానికి బాంబ్ పెట్టిన నర్శింహ.. ఊరి విడిచి వెళ్లిపోతున్న లక్ష్మీ!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ అందరినీ తీసుకొని వెళ్లిపోవడానికి సిద్ధపడటం వాళ్లని చంపడానికి నర్శింహ బాంబ్‌లు దారి మధ్యలో పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, మిత్రలు తమకు వర్క్ ఉందని చెప్పి పిల్లల్ని ఊరు వెళ్తున్నాం చెప్తారు. లక్ష్మీ మిత్రతో రేపు సిటీకి బయల్దేరుతున్నాం అని కాకపోతే అని సీరియస్‌గా చూస్తుంది. ఇక జాను బ్యాగ్ సర్దుతూ రేపు మనం ఊరు వెళ్లేలోపు అక్క సమస్యలు క్లియర్ చేసేస్తుందని.. తాతయ్యని విడిపించడంతో పాటు ఆ నర్శింహ అంతు చూస్తుందని చిన్నప్పుటి నుంచి అక్కని చూస్తున్నా కదా మనతో ఏం చెప్పదని సైలెంట్‌గా అన్నీ చేసేస్తుందని జాను వివేక్‌తో చెప్తుంది. జాను అక్క గురించి పొగుడుతుంది.

Continues below advertisement

వివేక్: వదిన ఏం చేసిన వదినకు మనం తోడుగా ఉందాం జాను ఒంటరిగా వదిలేయొద్దు.
జాను: అదే నేను ఆలోచిస్తున్నాను అక్కని ఒంటరిగా వదిలేయకూడదు. తన చుట్టూ మనం అందరం ఉండాలి. అక్క ఊరు కాపాడితే అక్కని మనం కాపాడుకోవాలి.

రాత్రి నర్శింహ రౌడీలతో లక్ష్మీ వాళ్లు వెళ్లే దారిలో బాంబ్ పెట్టిస్తాడు. రెండు కార్లు బ్లాస్ట్ అయిపోవాలని చెప్తాడు. మనీషాని కూడా చంపేస్తానని నర్శింహ లాయర్‌తో చెప్తాడు. ఉదయం లక్ష్మీ వాళ్లు బయల్దేరుతారు. ఊరి పెద్దలు అప్పుడే వెళ్తారేంటి అని అడుగుతారు. తాతయ్య గారు రాకుండా వెళ్లిపోతారేంటి అని అడిగితే తాతయ్య గారు పని మీద బయటకు వెళ్లారని ముందే తాతయ్య గారికి చెప్పామని అంటుంది. ఇక మనీషా నర్శింహకి కాల్ చేస్తుంది. నర్శింహ కాల్ లిఫ్ట్ చేయడు. దేవయాని వచ్చి అందరూ వెళ్లిపోతున్నారు మనం పోదామని అంటే మనీషా ఏ పనీ అవ్వలేదు ఎలా వెళ్లిపోతామని అంటుంది. నర్శింహ ఏమైనా ప్లాన్ చేశాడేమో అని తెలుసుకుందామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అంటుంది. ఇక మనీషా తర్వాత లాయర్‌కి కాల్ చేస్తుంది. నర్శింహ లాయర్‌కి స్పీకర్ ఆన్ చేయమని అంటాడు.

మనీషా లాయర్‌తో నర్శింహ గాడు ఏదో చంపేస్తాడు. అది ఇదీ అనుకుంటే ఏం చేయలేకపోయాడని తిడుతుంది. నర్శింహ మనీషా మాటలు విని రగిలిపోతాడు. పిరికి వాడని బోడి గాడని తిడుతుంది. అలా తిట్టావేంటి మనీషా లాయర్ నర్శింహకి చెప్తే అని అంటే చెప్తే చెప్పనీ అంటుంది. ఇక అందరూ బ్యాగులు తీసుకొని రెడీ అవుతారు. మిత్ర మనీషాని తన కారులో రమ్మని పిలుస్తాడు. మనీషా సంతోషంగా వెళ్లబోతే దేవయాని ఆపి వెళ్లొద్దని అంటుంది. నర్శింహ ఏమైనా ప్లాన్ చేస్తే వాళ్లతో పాటు నువ్వు పోతావని అంటుంది. ఏం కాదని వాడేం ప్లాన్ చేయలేదని చెప్పాడు కదా అని మనీషా అంటుంది. కారులో లక్ష్మీ, మనీషా మాటల యుద్ధం మొదలెడితే మిత్ర ఇద్దరినీ సైలెంట్‌గా ఉండమని అంటాడు. రెండు కారులు వెళ్లడం నర్శింహ వాళ్లు కనిపెడుతూ ఉంటారు.  దారిలో ఊరి జనం లక్ష్మీ వాళ్ల కారుకి అడ్డంగా వెళ్తారు. లక్ష్మీ వాళ్లు దిగి వాళ్ల దగ్గరకు వెళ్తారు. మాతో చెప్పకుండా వెళ్లిపోతున్నారేంటమ్మా.. పండగకి వచ్చి పద్ధతులు పూర్తి చేయకుండా వెళ్లిపోతున్నారని అడుగుతారు. 

అమ్మవారి గుడికి వచ్చి పూజలో పెట్టిన చీరల్లో ఒడి బియ్యం తీసుకోమని లక్ష్మీ, జానులకు చెప్తారు. దేవయాని, మనీషాలు కదరదు అంటే బతిమాలుతారు. ఇక జాను, లక్ష్మీలు మళ్లీ వచ్చి తీసుకుంటామని అంటారు. దాంతో మిత్ర, వివేక్‌లు వెళ్లి తీసుకుందామని అంటారు. ఇంతలో నర్శింహ లక్ష్మీకి కాల్ చేసి మీరు వెంటనే వెళ్లకపోతే మీ తాతయ్య ప్రాణాలు పోతాయని సిటీకి వెళ్లేలోపు ఎక్కడ ఆగినా మీ తాతయ్యని చంపేస్తామని అంటాడు. దాంతో లక్ష్మీ వాళ్లు వెళ్లిపోతామని అంటారు. ఊరు వాళ్లు సరే అని లక్ష్మీ, జానులకు కుంకుమ పెట్టి సాగనంపుతారు. ఇక నర్శింహ తాతయ్య గారి దగ్గర ఉన్న రౌడీలకు వీడియో కాల్ చేసి తాతయ్య గారితో మాట్లాడుతాడు. నీ మనవరాలు ఊరు వదిలి వెళ్లిపోతుందని నేనే గెలిచానని నర్శింహ అనగానే పెద్దాయన పెద్దగా నవ్వుతారు. లక్ష్మీ కథ ముగించేస్తా అని నర్శింహ అంటే దానికి పెద్దాయన మొదలు పెట్టిందే లక్ష్మీ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: నీకు నాకు ఏ సంబంధం లేదు: మిథునని పుట్టింట్లో వదిలేసిన దేవా.. దేవాపై పిచ్చి ప్రేమలో భాను!

Continues below advertisement