Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 27th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్:  నర్శింహని అడ్డుకున్న లక్ష్మీ.. తాతగారు కిడ్నాప్.. 24 గంటలు గడువు!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ కేసు వాపస్ తీసుకుంటేనే తాతని వదులుతానని లేదంటే చంపేస్తానని నర్శింహ లక్ష్మీని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode నర్శింహ అన్న మాటలకు మనీషా నాటకం మొదలు  పెడుతుంది. మిత్రని వాటేసుకొని మనం ఎప్పటికీ దూరం అవ్వం కదా మిత్ర నువ్వు నా వాడివి మిత్ర నువ్వు ఎప్పటికీ నాకే సొంతం అని ఏడుస్తుంది. మిత్ర ఏం మాట్లాడడు. లక్ష్మీ అదంతా చూసి వెళ్లిపోతుంది. ఇక నర్శింహ ఊరిలో ఇళ్లన్నీ కూలగొట్టాలని వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న లక్ష్మీ నర్శింహ వెళ్తున్న దారికి అడ్డంగా నిల్చుంటుంది.

Continues below advertisement

లక్ష్మీ ఒక్కర్తే ఉండటం చూసిన నర్శింహ తప్పుకో మని అంటే లక్ష్మీ తప్పుకోకపోవడంతో చంపేస్తానని క్రేన్‌తో తొక్కించేయాలని వెళ్తాడు. దాంతో జాను అక్క దగ్గరు వెళ్తుంది. తన వెనక చాలా మంది ఆడవాళ్లు ఉంటారు. మిత్ర, వివేక్ వెళ్లబోతే లక్ష్మీ, జాను ఇద్దరూ రావొద్దని ఇది తమ ఊరి సమస్య తామే చూసుకుంటామని అంటారు. ఊరి జనం తనని అడ్డుకుంటున్నారని నర్శింహ లాయర్‌కి చెప్తే లక్ష్మీ తరఫు లాయర్ స్టే ఆర్డర్ తెస్తున్నారని ఈలోపే ఊరిని కూల్చేయమని అంటాడు. నర్శింహ ఊరిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే మిత్ర వివేక్‌కి ఓ సలహ చెప్తాడు. దాంతో వివేక్ అన్న చెప్పినట్లు క్రేన్ ఆపించేస్తాడు. ఇక లక్ష్మీ తరఫు లాయర్ వచ్చి స్టే ఇచ్చాడు. ఇక లక్ష్మీ ఇదంతా తన చెల్లి, భర్త, మరిది వల్ల సాథ్యం అయిందని అంటే అందరూ లక్ష్మీ, జానులకు జేజేలు కొడతారు. 

నర్శింహ లక్ష్మీ దగ్గరకు వెళ్లి ఊరిని కాపాడావు కదా ఇప్పుడు నీ ఫ్యామిలీని కాపాడుకో అని అంటాడు. దాంతో లక్ష్మీ మిత్ర వాళ్లతో నర్శింహ పిల్లల్ని టార్గెట్ చేశారని ఇంటికి వెళ్తారు. లక్ష్మీ, జాను, మిత్ర, వివేక్‌లు పిల్లల కోసం వెతుకుతారు. పిల్లల్ని ఎత్తుకొని వెళ్లి నర్శింహ తప్పు చేశాడని లక్ష్మీ ఊరుకోదని మనీషా అంటుంది. ఇంతలో పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. లక్ష్మీ వాళ్లు ఫ్రీ అయిపోతారు. పిల్లలు ఇక్కడే ఉన్నారంటే మరి ఎవరిని కిడ్నాప్ చేశాడు అని దేవయాని అంటుంది. ఇక మిత్ర తాతయ్య గారు ఏరని అంటాడు. దాంతో నర్శింహలక్ష్మీకి కాల్ చేసి మీ తాతయ్య నా దగ్గర ఉన్నాడని నీకు ఆయన చాలా ఇష్టం కదా ఆయన కావాలి అంటే ఈ ఇష్యూలో దిగకు అంటాడు. కేసు వాపస్ తీసుకోకపోతే ముసలాడు అయిపోతారని అంటాడు. తాతయ్యని కాపాడుకోవడానికి కేసు వదిలేయమని దేవయాని అంటే మిత్ర మాటిచ్చాం కుదరదు అంటాడు. ఇక దేవయాని జాను, వివేక్‌లతో మనం వెళ్లిపోదాం అంటే వాళ్లు రామని చెప్పేస్తారు.

నర్శింహ పెద్దాయన్ని బెదిరిస్తే పెద్దాయన లక్ష్మీ నీ అంతు చూస్తుందని నర్శింహతో అంటే దానికి నర్శింహ పెద్దాయన్ని చంపేస్తానని వెళ్తే లాయర్ అడ్డుకుంటాడు. ఇక లక్ష్మీ ఊరిని కాపాడుదామని తాతయ్య కంటే ఊరు ముఖ్యమని అంటే జాను కోప్పడుతుంది. తాతయ్య ముఖ్యమని అంటుంది. ఇంతలో నర్శింహ మిత్రకి వీడియో కాల్ చేసి తాతయ్యని చూపిస్తాడు. దెబ్బలతో ఉన్న తాతయ్యని చూసి అందరూ బాధ పడతారు. తాతయ్య లక్ష్మీతో నా గురించి ఆలోచించొద్దని ఊరే ముఖ్యమని అంటారు. దాంతో లక్ష్మీ వాళ్లు చూస్తుండగానే నర్శింహ కొడతాడు. 24 గంట్లో కేసు వెనక్కి తీసుకోకపోతే తాతయ్యని చంపేస్తానని కత్తి పెడతాడు. దాంతో లక్ష్మీ ఊరు వెళ్దామని బట్టలు సర్దేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్ జనవరి 27: దీపకి నిజం చెప్పేసిన జ్యోత్స్న..పుట్టగతులు లేకుండా పోతావ్ నాన్న.. కాంచన ఉగ్రరూపం!

Continues below advertisement
Sponsored Links by Taboola