Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today February 6th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషా ఫస్ట్‌నైట్ ప్లాన్ ఫలిస్తుందా.. మిత్ర జ్యూస్‌లో డ్రగ్స్.. దూరంగా లక్ష్మీ!  

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రని తన వశం చేసుకోవడానికి మనీషా మిత్రకు డ్రగ్స్ కలిపిన జ్యూస్ తాగించి మిత్రని గదిలోకి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode దేవయాని రాజేశ్వరి కాళ్లకి బామ్ రాస్తుంది. రాజేశ్వరి రెండు కాళ్లు నొప్పిగా ఉన్నాయని దేవయాని ఒడిలో కాలు పెట్టేయడంతో దేవయాని ఏం చేయలేక కోపంతో కాళ్లకు బామ్ రాస్తుంది. ఇక పార్టీలో మిత్ర, లక్ష్మీ ఒక్క దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటారు. మనీషా దూరం నుంచి చూసి రగిలిపోతుంది. లక్ష్మీ మిత్రతో మీరు నన్ను ఇలా అందరి ముందు పొగుడుతుంటే సిగ్గేస్తుందని అంటుంది. 

Continues below advertisement

మనీషా ఇద్దరి రొమాన్స్ చూడలేకపోతున్నా అని మాల్ తీసుకురమ్మని అంజలితో చెప్తుంది. ఇక అంజలి పార్టీ మొదలు పెడుతుంది. అందరు జంటలు డ్యాన్స్ చేయాలని చెప్తుంది. ముందుగా మిత్ర, లక్ష్మీలను పిలుస్తుంది. లక్ష్మీ రాను సిగ్గు అంటే మిత్ర పర్లేదని తీసుకెళ్తాడు. ఇద్దరూ కలిసి నిజమేలే చెబుతున్నా జానే జానే అంటూ డ్యాన్స్ చేస్తారు.  అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే మనీషా మాత్రం ఏంటీ ఖర్మ అనేలా ముఖం కిందకి పెట్టుకుంటుంది. మిత్ర లక్ష్మీని ఎత్తుకొని తిప్పేసి మరీ డ్యాన్స్ చేస్తాడు. తర్వాత మనీషాకి డ్యాన్స్ చేయమంటే కాలేజ్ లవర్ ఉన్నాడు కదా మిత్ర మనీషాతో డ్యాన్స్ చేస్తాడని అంటారు. మిత్ర, మనీషా డ్యాన్స్ చేస్తే లక్ష్మీ ఫీలవుతుందని అందరూ అనుకొని మనీషా డ్యాన్స్ స్కిప్ చేద్దామంటారు. దాంతో లక్ష్మీ నాకేం ప్రాబ్లమ్ లేదు. వాళ్లిద్దరూ కాలేజ్‌లో లవర్స్, డ్యాన్స్ పార్టనర్స్ కదా డ్యాన్స్ చేసినంత మాత్రాన కపుల్స్ అయిపోరని డ్యాన్స్ వేయమని చెప్పడంతో మిత్ర, మనీషా డ్యాన్స్ చేస్తారు. మిత్ర నిమ్మకు నీరెత్తనట్లు ఉండిపోతే మనీషా మిత్ర చుట్టూ దీవాలి దూపాన్ని అనే పాటకు డ్యాన్స్ చేస్తుంది.

మరోవైపు జయదేవ్ అక్క రాజేశ్వరి దేవికి మిత్ర గండం గురించి చెప్తాడు. మిత్ర, లక్ష్మీలను ఇంటికి పిలిచేద్దామని రాజేశ్వరి దేవి అంటే లక్ష్మీ ఉండగా ఏం ప్రమాదం రాదని జయదేవ్ చెప్తాడు. ఇక రాజేశ్వరి దేవి లక్ష్మీకి కాల్ చేసి జాగ్రత్తలు చెప్తానంటుంది. ఈ రోజు గడియలు బాలేవని దీక్షితులు చెప్పారని ఇద్దరూ ఇంటికి వచ్చేయండి అని అంటే లక్ష్మీ నేను చూసుకుంటానని అంటుంది. మనీషా విషయంలో జాగ్రత్తగా ఉండమని రాజేశ్వరి దేవి చెప్తుంది. ఇక మనీషా ఏదో భారీ ప్లాన్ చేసిందని ఇద్దరూ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం లక్ష్మీ వింటుంది. మిత్ర కోసం మనీషా ఏమైనా చేస్తుందని అనుకుంటారు. తర్వాత లక్ష్మీ వచ్చి మిత్ర దగ్గర కూర్చొంటుంది. కొందరు అబ్బాయిలు మిత్రని డ్రింక్ చేయమని అంటారు. లక్ష్మీ కూడా వెళ్లమని అంటుంది. దాంతో మిత్ర ఒకప్పుడు ఒళ్లు తెలియనంత తాగానని ఇప్పుడు వద్దని అంటాడు. 

రాజేశ్వరిదేవి జాను, దేవయానిలను పిలిచి ఇంట్లో దీపాలు వెలిగించమని అంటుంది. ఇప్పుడు ఎందుకని అందరూ అడిగితే ఏ కష్టాలు రాకుండా వెలిగించమని అంటుంది. తల్లిదండ్రుల కోసం అయితే మేం దీపాలు వెలిగిస్తామని పిల్లలు అంటారు. జాను పిల్లల్ని తీసుకొని దీపాలు వెలిగించడానికి వెళ్తుంది. ఇక దేవయాని మనీషాకి కాల్ చేస్తుంది. అంతా ఓకేనా అని అడుగుతుంది. దానికి మనీషా ఇంకాసేపట్లో పని జరిగిపోతుందని అంటుంది. ఇక దేవయాని ముసలావిడకు అనుమానం వచ్చినట్లు ఉందని చెప్తుంది. ఇక అంజలి మాల్ తీసుకొచ్చి మనీషాకి ఇస్తుంది. చాలా పవర్ ఫుల్ అని డోస్ ఎక్కువ అయితే ప్రాణాలు పోతాయని అంటుంది. మనీషా అంజలితో మాటల్లో పెట్టి లక్ష్మీని దూరం తీసుకెళ్లమని అంటుంది. అంజలి లక్ష్మీని పక్కకు తీసుకెళ్తుంది. మనీషా డ్రింక్‌లో డ్రగ్స్ కలిపేస్తుంది. మిత్ర దగ్గరకు వెళ్లి కూల్‌ డ్రింక్ ఇస్తుంది. మిత్ర తాగేస్తాడు. మిత్ర మనీషాతో ఇది కూల్ డ్రింక్‌ ఏనా తల తిరిగేస్తుందని అంటాడు. మనీషా మిత్రని తీసుకొని వాటర్ తాగొచ్చని తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!

Continues below advertisement