Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్య ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. శౌర్యని చూడటానికి దీప, కార్తీక్ వెళ్తారు. పాప దీప, కార్తీక్‌లతో నాకు ఏమైంది అని అడుగుతుంది. ఇంటికి ఎప్పుడు వెళ్లిపోతాం అని అడుగుతుంది. ఇంతలో డాక్టర్ వచ్చి నువ్వు ఇంకా వారం ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. కార్తీక్, దీప కూడా ఉంటాం అని చెప్పడంతో నేను ఉంటానని శౌర్య చెప్తుంది. డాక్టర్ పాపని చెక్ చేసి ఇక ఏ ప్రాబ్లమ్ లేదని చెప్తాడు. పాపని పడుకోమని చెప్తే కథ చెప్పమని కార్తీక్‌ని అడుగుతుంది. దాంతో కార్తీక్ కథ చెప్తాడు.
వారం తర్వాత కార్తీక్, దీపలు పాపని తీసుకొని ఇంటికి వెళ్తే అనసూయ దిష్టి తీస్తుంది. జ్యోత్స్న దూరం నుంచి అదంతా చూస్తుంది. అందరూ శౌర్యని ముద్దాడుతారు. అమ్మ చెప్పినట్లే వినాలి అని అందరూ శౌర్యకి చెప్తారు. జ్యోత్స్న వెళ్లిపోతుంటే కార్తీక్ చూస్తాడు. బయటకు వెళ్తాడు. జ్యోత్స్న కారుకి ఎదురుగా సైకిల్ విసురుతాడు. జ్యోత్స్న కారు ఆపితే వెళ్లి జ్యోత్న్సని బయటకు లాగుతాడు.
కార్తీక్: నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావ్. డేంజర్ కంటే డేంజర్ నువ్వు. పురుగుల మందుని పిల్లలకు దూరంగా ఉంచండి అని రాసుంటుంది. నువ్వు అయితే పిల్లలకే కాదు పెద్దలకు కూడా దూరంగా ఉంచాలి.
జ్యోత్స్న: నా గురించి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావ్ బావ.
కార్తీక్: మనిద్దరం కలిసి పెరిగాం అని ఫ్రెండ్‌గా అనుకుంటే ఇంటి పరువు బజారున పెట్టావ్. నా టిఫెన్ బండి కాల్చావ్. నా కూతురి అనారోగ్యంతో నా భార్య మాంగల్యం రేటు కట్టావ్ నీ లాంటి దానికి ఎంత దూరం అంటే అంత మంచిది.
జ్యోత్స్న: నేను నిన్ను ప్రేమిస్తున్నా బావ నువ్వు నాకు కావాలి. నీ కోసం నా ఆస్తి మొత్తం రాసిస్తా బావ.
కార్తీక్: అది మీ తాత వింటే నా ఆస్తి ఎవరికి రాసిస్తావ్ అని రోడ్డు మీద తిప్పి కొడతాడు.
జ్యోత్స్న: పుట్టినప్పటి నుంచి నేను నీ కోసం కలలు కంటున్నా నిన్ను వదలను బావ. నాకు నువ్వే కావాలి.
కార్తీక్: పెళ్లి అయిన మగాడి వెనక పడే ఆడదాన్ని బజారు దానిలా చూస్తారు. నువ్వు నన్ను టార్చర్ చేయకు జ్యోత్స్న.
జ్యోత్స్న: జ్యోత్స్న పుట్టింది కార్తీక్ కోసమే నేను బతికినా చచ్చినా నీ కోసమే.
కార్తీక్: దయచేసి నువ్వు నా ఫ్యామిలీ జోలికి రావొద్దు. ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమిస్తున్నాను అంటే తల్లి లాంటి నా అత్తని చూసి మాత్రమే. కొట్టే అంత వరకు తెచ్చుకోకు.
దీపని రెస్ట్ తీసుకోమని అనసూయ చెప్పినా దీప వినదు. ఇక ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. శాంతి హోమం చేయించాలని మొక్కుకున్నానని రేపే చేయిద్దామని కాంచన అంటుంది. దాంతో కార్తీక్ సరే అంటాడు. కావాల్సిన వాళ్లందరినీ హోమానికి పిలవమని కార్తీక్ దీపతో చెప్తాడు. అందరూ వెళ్లిన తర్వాత కాంచన ఏడుస్తుంది. అనసూయ ఏమైందని అడిగితే నా పుట్టిళ్లు గుర్తొచ్చిందని రెండిళ్లలో ఏం జరిగినా పుట్టింటి వాళ్లు బట్టలు పెట్టడం అనవాయితీగా ఉందని రేపు నాకు నా కొడుకుకి బట్టలు పెట్టడానికి నా పుట్టింటి వాళ్లు రారు కదా అని ఏడుస్తుంది. దీప ఆ మాటలు వింటుంది. అనసూయ ఓదార్చుతుంది.
జ్యోత్స్న శౌర్య ఆపరేషన్‌కి ఎవరు డబ్బు ఇచ్చారా అని తల్లి మీద అనుమానంతో నగలు తాకట్టు పెట్టి ఇచ్చిందేమో అని నగలు చెక్ చేస్తుంది. నగలు అక్కడే ఉండటంతో తల్లి కాదని అనుకుంటుంది. సుమిత్ర వచ్చి నేను డబ్బు ఇవ్వలేదు జ్యోత్స్న అంటుంది. ఈ ఇంట్రస్ట్ బిజినెస్ మీద పెడితే బెటర్ అంటుంది. ఇక దీప పిలుపు చేయడానికి జ్యోత్స్న ఇంటికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!