Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జయదేవ్ వాళ్లు పార్వతిని తమతో పాటే తమ ఇంట్లో ఉండమని కోరుతారు. పార్వతి మాత్రం నేను నా కూతురిని పోషించుకుంటా నాకు నా కూతురిని ఇచ్చేయండి వెళ్లిపోతా అని పట్టుపడుతుంది. ఆ రోజు అక్కర్లేదు అని అన్నారు ఇప్పుడు కావాలి అంటున్నారు అంతా మీ ఇష్టమేనా అని లక్ష్మీ అంటుంది. ఇక జయదేవ్ ఒప్పించే ప్రయత్నం చేస్తే పార్వతి ఒప్పుకోదు. మిత్ర కూడా బతిమాలుతాడు. కనీసం మూడు రోజులు అయినా ఉండమంటాడు.


పార్వతి: 3 రోజులు కాదు 3 గంటలు కూడా ఉండను వెంటనే నా పాపని నాకు ఇవ్వండి.
లక్ష్మీ: ఇవ్వం. అయినా ఎందుకు ఇవ్వాలి. పాప కన్న తల్లి మీరే అనడానికి సాక్ష్యం ఏంటి. హఠాత్తుగా వచ్చి పాప ఇవ్వమంటే ఎలా ఇస్తాం. 3 రోజులు ఉండమని చెప్పినా వినడం లేదా.
పార్వతి: నా స్థానంలో మీరు ఉంటే ఒప్పుకునే వారా. చెప్పండి నా పరిస్థితే మీకు వస్తే ఏం చేస్తారు.
లక్ష్మీ: ముందుగా నా బిడ్డను వదిలేసి వెళ్లేదాన్ని కాదు. పరిస్థితులు ఏవైనా నా బిడ్డతోనే ఉండేదాన్ని మిమల్ని అవమానించాలి అని చెప్పడంలేదు. విధి నా బిడ్డను నాకు దూరం చేసుంటే నా బిడ్డను వెతికి తనకి ఆశ్రయం ఇచ్చిన వాళ్లకి రుణ పడేదాన్ని. కన్న ప్రేమ ఎంత గొప్పదో పెంచిన బంధం కూడా అంతే గొప్పదని అనుకునేదాన్ని. పెంచిన వాళ్ల కోసం నేను వెనక్కి తగ్గిపోయేదాన్ని. 8 ఏళ్లు ఆగిన మీరు 3 రోజులు ఆగలేను అంటున్నారు. నేను అయితే ఆ మాటే అనుండేదాన్ని కాదు. అందుకే పాపని ఇవ్వను అంటున్నాను.
దేవయాని: తీగ లాగితే మొదటికే మోసం వస్తుంది ఉండమను మనీషా. మనీషా సైగ చేస్తుంది.
పార్వతి: సరే అండీ 3 రోజులు ఉంటాను తర్వాత నా పాపని తీసుకొని వెళ్లిపోతా.
మిత్ర: థ్యాంక్స్ లక్ష్మీ నువ్వు గట్టిగా అడగటం వల్లే ఆవిడ ఉండటానికి ఒప్పుకుంది.



లక్ష్మీ జయదేవ్, వివేక్‌లతో తన మీద నాకు అనుమానం ఉందని పాప కనిపించగానే గుండెలకు హత్తుకోలేదు ఏడ్వలేదు కానీ పాపని ఎత్తుకుపోవాలనే ఏదో మెకానికల్‌గా నటిస్తోందని అంటుంది. 3 రోజుల్లో తన గురించి ఎంక్వైరీ చేస్తానని లక్ష్మీ అంటుంది. మనీషా, దేవయానిలు పార్వతితో మాట్లాడుతారు. మిత్రని చూస్తే తనకే బాధగా ఉందని మీకు లేదా అని పార్వతి అంటుంది. రేపో ఎల్లుండో నిన్ను పాపని పంపించే బాధ్యత మాది అని మనీషా అంటుంది. లక్కీని ఇచ్చి పార్వతిని తొందరగా పంపకపోతే లక్ష్మీ కనిపెట్టేస్తుందని అనుకుంటారు. మరోవైపు వివేక్, లక్ష్మీలు పార్వతి కోసం ఓ స్లమ్ ఏరియాకి వస్తారు. అక్కడే కనిపించిన ఓకామె దగ్గరకు లక్ష్మీ వెళ్లి పార్వతి గురించి అడుగుతుంది. పాప కోసం వెళ్లిందని ఇక ఆవిడ పార్వతి గురించి మంచిగా చెప్తారు. ఆవిడ సరయుతో మాట్లాడి మీరు చెప్పినట్లే చెప్పానని అంటుంది.


మరోవైపు జాను లక్కీ, జున్నులకు భోజనం తినిపిస్తుంటే లక్కీ వద్దని బాధగా ఉందని చెప్తుంది. లక్కీని చూసి మిత్ర బాధపడతాడు. మిత్ర ప్లేట్ తీసుకొని లక్కీకి తినిపిస్తే నువ్వు తినకుండా నేను తినను నాన్న నేను వెళ్లిపోతా అని బాధ పడుతున్నావని ఏడుస్తుంది. మిత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జయదేవ్ రావడంతో మిత్ర లక్ష్మీ వల్లే కాదని లక్కీ శాశ్వతంగా తన దగ్గర ఉండేలా మనీషా చేయగలదని మనీషాని అడుగుతానని మనీషా దగ్గరకు వెళ్తాడు. ఇక మనీషా పార్వతి గురించి సరయుతో మాట్లాడుతుంది. మనీషా మాటలు మిత్ర వినేశాడేమో అని మనీషా, దేవయాని కంగారు పడతారు. కానీ మిత్ర వినడు. లక్కీ నాకు కావాలి ఏదో ఒకటి చేయు అని మిత్ర అడుగుతాడు. దానికి మనీషా లక్కీ మన డాటర్ తన కోసం ఆ పార్వతి కాళ్లు అయినా పట్టుకుంటా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అయ్యే సీన్ ఇదే.. మిస్ ఇండియా అంటూ ఫ్లర్ట్ చేసిన రాకేశ్!