Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఆఫీస్‌కి వచ్చిన లక్ష్మీ, మిత్రలు జాను మాటలు తలచుకొని బాధపడుతుంటారు. ఇంతలో వివేక్ లక్ష్మీ దగ్గరకు వస్తాడు. జాను అలా మాట్లాడినందుకు సారీ చెప్తాడు. నా చెల్లినే కదా తన గురించి నువ్వు సారీ చెప్పొద్దని అంటుంది. మనీషా, తన తల్లి కలిసి జానుని పొల్యూట్ చేశారని చెప్తాడు. నాకు తెలుసు అని లక్ష్మీ అంటుంది. 


మిత్ర: జాను అన్నదాంట్లో తప్పేముంది వివేక్ తను అడిగిన దానిలో న్యాయం ఉంది కదా.
లక్ష్మీ: అవును వివేక్ నీకు ఓ సొంత గుర్తింపు ఉండాలని మేం అనుకుంటున్నాం.
మిత్ర: త్వరలోనే నీతో సొంతంగా ఓ బిజినెస్ పెట్టిస్తాం. జాను కోరుకున్నట్లు చేస్తాం.
వివేక్: వద్దు అన్నయ్య నాకు విడిగా బిజినెస్ చేయాలి అని లేదు నాకు అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. విడిగా బిజినెస్ చేయడం అంటే మీతో విడిపోవడమే ఆ పని నేను ఎప్పుడూ చేయను. నా చిన్నప్పుడే డాడ్ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మీ చేయి పట్టుకొనే తిరిగాను. మీ కళ్లతో ప్రపంచం చూశాను మీరు చూపించిన దారిలో నడిచాను.  వదిన నాకు ఎన్నో నేర్పించింది. నన్ను మరిదిలా కాకుండా తమ్ముడిలా సొంత కొడుకులా చూసుకుంది. అవన్నీ మా అమ్మ మర్చిపోయి ఉండొచ్చు. జానుకి తెలియకపోవచ్చు కానీ నేను మర్చిపోను అన్నయ్య. మీరు ఏం చెప్పినా నేను వినను సారీ వదిన.
లక్ష్మీ: వివేక్ బాధపడినా సరే చిన్నత్తయ్య జాను అడిగింది మనం చేయాలి అండీ.
మిత్ర: నేను అదే అనుకుంటున్నా లక్ష్మీ కానీ వివేక్కి ఇష్టం లేకుండా ఏం చేస్తాం. సరే నువ్వేం చేస్తావో చేయు లక్ష్మీ. నేను సపోర్ట్ చేస్తా.


మనీషా, జానుని తీసుకొని తన ఫ్రెండ్స్‌ని కలుస్తుంది. అందులో ఒకామె త్వరలో బిజినెస్ చేయబోతున్నా అని జానుని పార్టనర్‌ని చేయాలి అనుకుంటున్నా అని చెప్పి జానుని ఎత్తేస్తుంది. జాను చాముతో ఇన్వెస్టిమెంట్‌కి ఎంత కావాలి అని అంటే 3, 4 కోట్లు కావాలని అంటుంది. దాంతో జాను నాకు అంత లేదు అని అంటుంది. మనీషా నువ్వు ఊ అంటే నీ కళ్ల ముందు ఉంటుందని చెప్పి చప్పట్లు కొడుతుంది. దాంతో జాను ఊరిలో పొలం కొనడానికి వచ్చిన వారు వస్తారు. వాళ్లకి పొలం అమ్మేయమని మనీషా జానుతో చెప్తుంది. జాను ఆలోచించి చెప్తా అంటుంది. మనీషాకి లక్ష్మీ కాల్ చేస్తుంది. నువ్వు చేస్తున్న పిచ్చి పనులు అన్నీ ఆపేయ్ అని తిడుతుంది.


సరయుతో చేసింది చాలడం లేదా ఇప్పుడు నా చెల్లి మీద పడ్డావా అని కోప్పడుతుంది. నువ్వేం చేస్తావ్ లక్ష్మీ అని మనీషా అడుగుతుంది. లక్ష్మీ అరుస్తుంది. త్వరలో నేను ఏం చేయబోతున్నానో తెలుసుకో నీ గుండె ఆగిపోతుందని అంటుంది. లక్ష్మీ మళ్లీ మనీషా ఏం చేయబోతుందో అని కంగారు పడుతుంది. ఆలోచిస్తుంది. ఇక మనీషా దేవయాని వాళ్ల ఫ్యాక్టరీ ప్రెసిడెంట్‌ని పిలిచి డబ్బు ఇచ్చి ఫ్యాక్టరీలో స్ట్రైక్ సైరన్‌ మోగించమని మీ డిమాండ్స్ నెరవేర్చమని అడుగుతుంది. మళ్లీ డబ్బులు ఇచ్చి స్ట్రైక్‌కి కారణం ఏమైతే బాగుంటుందో అలోచించు అంటే ఆయన వర్కర్‌కి గాయమై ఏమైనా అయితే యాజమాన్యం పట్టించుకోక పోతే చేయొచ్చని అంటే అదే ఫాలో అవ్వమని చెప్తుంది. ఇదంతా జరిగితే ఫ్యాక్టరీలో ఓనర్ మారుతుందని అప్పుడు ఆ అవకాశం మీకు వస్తుందని చెప్తుంది. 


జాను ఆఫీస్‌కి లంచ్ తీసుకొని వస్తుంది. వివేక్‌ క్యాబిన్ ఎక్కడా అని అడిగితే వివేక్‌కి క్యాబిన్ లేదని వివేక్ ఎక్కడున్నాడో చూపిస్తుంది. జాను వివేక్ దగ్గరకు వెళ్తుంది. మీకు క్యాబిన్ లేదా అని అడుగుతుంది. లేదు అని వివేక్ చెప్తే ఆవిడకు మాత్రం క్యాబిన్ ఉంటుంది మీకు ఉండదా అంటే వివేక్ గొడవ చేయకుండా నువ్వు ఇంటికి వెళ్లు అని అంటాడు. వివేక్‌ని తీసుకొని జాను లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. రేపటి నుంచి మా ఆయన ఈ ఆఫీస్‌కి రావడం లేదని ఈ రోజే రిజైన్ చేస్తున్నాడు అని చెప్తుంది. వివేక్ ఏంటిది అని అడిగితే మనం వేరే కంపెనీ పెట్టబోతున్నాం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత పని చేశావ్ జ్యో.. కూలీగా దీప కంటపడ్డ కార్తీక్.. ఇది మామూలు షాక్ కాదుగా!