Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, జయదేవ్‌కి నిజం తెలిసిపోయిందని నీతో పాటు నా పని కూడా అయిపోతుందని దేవయాని టెన్షన్ పడుతుంది. నీ కోసం నా జీవితం సర్వనాశనం చేసిందని దేవయాని అంటుంది. లక్ష్మీ మన ఇద్దరి చెంపలు వాయించేస్తుందని ఈరోజుతో మన చాప్టర్ క్లోజ్ అని దేవయాని వణికిపోతుంది. మిత్రతో అందరూ హాల్‌లో లక్ష్మీ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో లక్ష్మీ, జయదేవ్ ఇంటికి వస్తారు.  


మిత్ర: మామ కోడళ్లు ఎక్కడికి వెళ్లారు. మళ్లీ సీబీఐ ఎంక్వైరీకి వెళ్లారా.
జయదేవ్: అవునురా మూసుకుపోయిన నీ కళ్లు తెరిపించడానికి వెళ్లాం. నువ్వు ఎవర్ని గుడ్డిగా నమ్ముతున్నావో వాళ్లే నిన్ను మోసం చేశారని నిరూపించడానికి వెళ్లాం.
మిత్ర: మీరు ఎవరి గురించి అంటున్నారు.
లక్ష్మీ: ఇంకెవరు ఈ నయ వంచనీ గురించి తేల్చడానికి వెళ్లాం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన దీని గురించి మీ పక్కనే ఉంటూ మిమల్ని మోసం చేసిన ఈ మోసగత్తె గురించి.
మనీషా: ఏం మాట్లాడుతున్నావ్ లక్ష్మీ మాటలు మర్యాదగా రానివ్వు. 
లక్ష్మీ: ఇంత చేసిన నీకు మర్యాద ఏంటి అసలు ఆడదానివేనా నువ్వు అని లక్ష్మీ లాగి పెట్టి కొడుతుంది.
జయదేవ్: దీన్ని ఊరి తీసినా పర్లేదు. 
లక్ష్మీ: తను ఒకటి కాదు రెండు కాదు వంద తప్పులకు పైగానే చేస్తూ వచ్చిందండి. తను నాకు ఏం చేసినా బరించా కానీ ఇప్పుడు నా చెల్లి జోలికి వచ్చింది. తను హారం కొట్టేసి నా చెల్లి మీద పెట్టేసింది. సరయు పీఏ మొత్తం చెప్పేశాడు. ఈ వీడియో చూడండి అని లక్ష్మీ మిత్రకు వీడియో చూపిస్తుంది.


లక్ష్మీ సీక్రెట్‌గా తీసిన వీడియో మిత్రకు చూపిస్తుంది. అందులో సరయు, మనీషాల గురించి పీఏ రాజు చెప్పిన విషయాలు అన్నీ ఉంటాయి. అది చూసి మిత్ర షాక్ అవుతాడు. మనీషా తల దించుకుంటుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. సైట్‌లో తన మీద జరిగిన యాక్సిడెంట్‌తో సహా అన్నీ సరయు, మనీషా చేశారని ఊరు వెళ్లినప్పుడు బస్ యాక్సిడెంట్ చేయించడంతో పాటు లక్కీని దూరం చేయడానికి పార్వతిని దింపింది కూడా మనీషానే అని లక్కీని బీహార్ గ్యాంగ్‌కి మనీషా అమ్మేయాలి అని మొత్తం లక్ష్మీ చెప్పడంతో మిత్ర కోపంతో రగిలిపోతాడు. అబద్ధం అని నేను నిన్ను ప్రేమించిన దాన్ని నీకు కాబోయే భార్యని అని మనీషా చెప్తుంది. లక్ష్మీకి మతిలేని ముసలోడు హెల్ప్ చేస్తున్నాడని మనీషా జయదేవ్‌ని అనగానే మిత్ర మనీషా చెంప పగలగొడతాడు. 


మిత్ర: ఇప్పటి వరకు లక్ష్మీ కంటే ఎక్కువ నిన్నే నమ్మాను. లక్ష్మీని కాదని నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ నువ్వు నాకు లక్కీని దూరం చేయాలి అనుకున్నావ్. ఎన్ని తప్పులు చేసినా క్షమించే వాడిని కానీ లక్కీని విషయంలో తప్పు చేశావ్.
మనీషా: లేదు మిత్ర నేను ఏం తప్పు చేయలేదు లక్ష్మీ అబద్ధం చెప్తుంది. ఆ సరయు ఎవరో నాకు తెలీదు.
మిత్ర: షట్ అప్ ఇంకా నిన్ను నమ్మడానికి నేను వెర్రి వాడిని కాదు. నా పక్కనే ఉండి నాకే గోతులు తీయాలు అనుకున్నావా. ఇన్నాళ్లు లక్ష్మీని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అనుకున్నా. కానీ నిన్ను ప్రేమించడమే అసలైన తప్పు అని ఇప్పుడు అర్థమైంది. ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అవుట్..  
మనీషా: ఏంటి మనీషా నన్ను పొమ్మంటున్నావా. అవును నేను తప్పులే చేశాను కానీ నీ కోసం మన కోసం చేశాను. మన మధ్య ఈ లక్ష్మీ, లక్కీ ఉండకూడదని చేశాను. కానీ ఆ తప్పు నేను ఒక్కదాన్నే చేయలేదు ఇదిగో మీ పిన్ని కూడా నాకు హెల్ప్ చేసింది. ఇద్దరం కలిసే అన్నీ చేశాం.
దేవయాని: ఏయ్ ఏంటే నన్ను కలుపుతున్నావ్. నాకేం తెలీదు మిత్ర. బావ గారు నన్ను క్షమించండి ఏదో బుద్ధి గడ్డి తిని దీంతో చేతులు కలిపాను. నా కొడుకు మీద ఒట్టు వేసి చెప్తున్నా వాడి మీద ప్రేమే తప్ప నీ మీద పగ లేదు మిత్ర. నాకు నచ్చని కోడలిని తెచ్చారని లక్ష్మీపై కోపమే కానీ పగలేదు. నన్ను నమ్ము లక్ష్మీ.
మనీషా: ఇక్కడ నిన్ను నన్నూ ఎవరూ నమ్మరు ఆంటీ.
మిత్ర: తను మా పిన్ని మా ఫ్యామిలీ తప్పు చేసినా క్షమిస్తాం. నువ్వు వెళ్లు ఇక్కడి నుంచి.
మనీషా: మిత్ర నువ్వు నన్ను ప్రేమించావ్ మిత్ర. నన్ను వెళ్లగొట్టడం నీ వల్ల కాదు. 
మిత్ర: నీ మీద ప్రేమ ఇందాకే చచ్చిపోయింది. ఇంకొక్క క్షణం నువ్వు నా ముందు ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ అవుట్.
మనీషా: మిత్ర నువ్వు లేకుండా నేను బతకలేను నిన్ను బతకనివ్వను. నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను.
మిత్ర: ఏంటి నువ్వు చంపేసేది నా ఫ్యామిలీ జోలికి వస్తే నేనే నిన్ను చంపేస్తా  అని మిత్ర మనీషాని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు. 


తీరా చూస్తే ఇదంతా మనీషా కల. ఇక అప్పుడే లక్ష్మీ, జయదేవ్ వస్తారు. మిత్ర వాళ్ల ఏం ఇన్వెస్ట్ చేశారని అడుగుతాడు. దానికి లక్ష్మీ మామయ్య గారికి బాలేదని హాస్పిటల్‌కి వెళ్లామని చెప్తారు. మనీషా దేవయాని ఏదో అయిందని అనుకుంటారు. నిజం తెలిసి కూడా లక్ష్మీ సైలెంట్‌గా ఉందంటే ఏదో విషయమే ఉందని మనీషా అంటుంది. ఇక ఫ్లాష్ బ్యాక్‌లో లక్ష్మీ జయదేవ్‌తో నిజం మిత్రకు చెప్పొద్దని అలా చెప్తే మనీషాతో పాటు దేవయానికి కూడా మిత్ర గెంటేస్తాడని వివేక్ కూడా బాధ పడతాడని తాను కూడా తల్లి వెనకే వెళ్లిపోతాడని ఫ్యామిలీ విడిపోతుందని అందుకే ఏం చెప్పొద్దని మామయ్యతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప రెస్టారెంట్.. నిప్పు రాజేసిన పేరు.. భార్య వల్ల కార్తీక్ బికారీ అయిపోతాడా?