Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode ఇంట్లో అందరితో మిత్ర మనీషాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మనీషా, దేవయానిలు మాత్రం చాలా సంతోషిస్తారు. తనని ప్రేమించి ఇన్నాళ్లు తన కోసం వెయిట్ చేసి రిస్క్ చేసి తనని సేవ్ చేసిందని లక్కీని కూడా బాధ్యతగా చూసుకుంటుందని అందుకే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని మిత్ర చెప్తాడు.


దేవయాని: చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ మిత్ర. మనీషా చేసిన త్యాగానికి తగిన ఫలితం ఇస్తున్నావ్. మనీషా నీకు భార్య అయితే నీకు ఇక ఏ లోటు ఉండదు.
మిత్ర: మనీషా నీకు ఇష్టమేనా.
మనీషా: ఇష్టమే మిత్ర.
మిత్ర: మామ్ మా ఇద్దరి ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరగబోతుంది వెంటనే ఏర్పాట్లు చేయండి.


మిత్ర పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో కృష్ణాష్టమి రోజునే మనీషా రాత్రి పూట క్రాకర్స్ కాల్చుకొని హ్యాపీగా ఉంటుంది. ఇక దేవయాని మనీషా దగ్గరకు వచ్చి ఈ పెళ్లి అయితే ఇంటి పెత్తనం నాకు వస్తుందని ఇద్దరూ చాలా సంతోషపడతారు. ఇక దేవయాని మనీషాకు జాగ్రత్తలు చెప్తుంది. సంయుక్త అలియాస్ లక్ష్మీ పెళ్లి ఆపే అవకాశం ఉందని అంటుంది. మరోవైపు అరవింద, జయదేవ్, వివేక్, జాను, సంయుక్తలు బాధ పడుతుంటారు. 


అరవింద: ఏంటి లక్ష్మీ నీకు చీమ కుట్టినట్లు కూడా లేదా నీ ముందే నీ భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నీకు అర్థమవుతుందా. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటావా. నువ్వు మిత్రకు నిజం చెప్పకపోతే నేను చెప్పేస్తా నిజం చెప్తే నేను జైలుకి వెళ్తా అనుకుంటున్నావ్ కానీ నీ జీవితం గురించి ఆలోచించు. అంటే మిత్ర మనీషాల  పెళ్లి నువ్వు ఒప్పుకుంటున్నావా.
లక్ష్మీ: లేదు అత్తయ్య గారు లేదు. సంయుక్తలా నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి అత్తయ్య గారు.
జాను: అక్క అత్తయ్య గారు చెప్తున్నారు కదా ఒక్కసారి మాట విను.
అరవింద: వినదు జాను తను వినదు. ఇక నీతో మాట్లాడి ప్రయోజనం లేదు ఈ విషయాన్ని నేను మిత్రతో తేల్చుకుంటా మనీషాని పెళ్లి చేసుకోవద్దని నేనే చెప్తా.
లక్ష్మీ: ఎందుకు చేసుకోకూడదు అని ఆయన అడిగితే ఏం చెప్తారు. మన ఇంట్లో ఉన్న సంయుక్త నీ భార్య లక్ష్మీ ఇన్నాళ్లు నిన్ను ద్రోహం చేసిందని చెప్తారా. ఇప్పటికే నేను ద్రోహం చేశానని ఆయన అనుకుంటున్నారు దానికి మరోకటి కలుపుతారా. పొనీ మనీషా చెడ్డది అని చెప్తే సాక్ష్యాలు చూపించగలరా. ఆయనతో చెప్పడానికి సరైన కారణం ఏముంది.
జయదేవ్: అరవింద లక్ష్మీ చెప్తుంది నిజమే మన దగ్గర సరైన కారణం లేదు.
లక్ష్మీ: ఆ విషయం నాకు వదిలేయండి నాకు లేని బాధ మీకు ఎందుకు. పెళ్లికి ఇంకా టైం ఉంది కదా నేను ఏదో ఒకటి చేస్తా
అరవింద: మనీషా నీకు అంత టైం ఇవ్వదు లక్ష్మీ. 


జున్నుని ప్రిన్సిపల్ మేడం పిలిచి ఫాం సరిగా నింపలేదని మీ తండ్రి పేరు ఏంటని అడుగుతుంది. జున్ను చెప్పకపోవడంతో లక్ష్మీకి కాల్ చేసి రమ్మని పిలుస్తారు. అర్జున్‌కి విషయం చెప్పి లక్ష్మీ కంగారుగా బయల్దేరుతుంది. ఇక ప్రిన్సిపల్ మేడం మనీషా, దేవయానిల దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్లే తను ఇక్కడికి వస్తుందని అంటుంది. దేవయాని, మనీషా జున్ను తల్లిని చూడబోతున్నందుకు సంబర పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: సుమన, పెద్దబొట్టమ్మ కలిసి పెద్ద ప్లానే వేశారుగా.. మణి కోసం పేపర్లు తీసుకొని వెళ్లిపోతారా?