Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా ముక్కు నుంచి బ్లడ్ రావడంతో తుడుచుకుంటూ ఉంటే దేవయాని చెంపకు కూలింగ్ వాటర్ పెట్టుకుంటుంది. నిన్ను నీ సవతి నన్ను నా తోటికోడలు చితక్కొట్టారని దేవయాని అంటుంది. ఉదయం ఎవరి ముఖం చూశామో ఇద్దరూ చితక్కొంటారని అంటుంది. లక్ష్మీ అక్కడికి వస్తుంది. పనిష్మెంట్ బాగుందా అంటుంది.
అతి త్వరలో నిన్ను భయపెడతా..
లేని కడుపు ఉందని నాటకం ఆడే నీకే ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది మనీషా అని లక్ష్మీ అడుగుతుంది. నువ్వేం చేసినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని అంటుంది. దానికి మనీషా అంత లేదు అరవింద ఆంటీ నావైపు ఉందని అంటుంది. అదే నీ ధైర్యం అయితే అతి త్వరలో నిన్ను భయపెడతా అని లక్ష్మీ అంటుంది. నువ్వు మిత్రని అరవింద అత్తయ్యని చీట్ చేస్తున్నావ్ ఈ రోజు నీకు అర్హత లేదని వాళ్లకి అర్థమవుతుందో అప్పుడు నీ బతుకు వ్యర్థమవుతుందని లక్ష్మీ అంటుంది. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావ్ అప్పుడు నిన్ను ఎవరూ చంపనవసరం లేదు నువ్వే చస్తావ్ అని అంటుంది.
జాగ్రత్త మనీషా..
దేవయాని మనీషాతో లక్ష్మీ మాటలు అంత తేలికగా తీసుకొవద్దని అంటుంది. తెలివి తనకే కాదు నాకు ఉందని మనీషా అంటుంది. తెలివికి తెగింపు తోడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటుంది. ప్రాజెక్ట్ వచ్చినందకు మిత్రకు బిజినెస్ పార్టనర్స్ వచ్చి శుభాకాంక్షలు చెప్తారు. మిత్రని పొగిడేస్తారు. మనీషా, దేవయాని చాటుగా వింటారు.
అంతా లక్ష్మీ ఇష్టమే..
వాళ్లు బిజినెస్ గురించి మాట్లాడితే మిత్ర ఛైర్మన్ లక్ష్మీ తో మాట్లాడండి అని చెప్పి పంపేస్తాడు. మిత్ర అన్నింటికీ లక్ష్మీని అంటున్నాడని ప్రాజెక్ట్‌తో లక్ష్మీ ప్రాధాన్యత పెరిగింది నీ విలువ తగ్గిపోతుందని అంటుంది. మిత్ర తన టార్గెట్ అని మనీషా అంటుంది. ఇక ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఏప్రిల్ 10న అని దానికి సెంట్రల్ మినిస్టర్ వస్తారని లక్ష్మీ వాళ్లతో మ్యానేజర్ చెప్తాడు. ఇక అతను తెచ్చిన ఫైల్ మీద లక్ష్మీ, మిత్రలు సంతకాలు పెడతారు.
ఏప్రిల్ 10 డెడ్ లైన్..
జయదేవ్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే అరవింద క్యాలెండర్‌లో ఏప్రిల్ 10 త్రయోదశి ఆ రోజు ఆవిష్కరణ వద్దని భర్తతో చెప్తుంది. అన్నీ క్యాన్సిల్ చేయమని అంటుంది. ఇప్పుడు కుదరదు అని జయదేవ్ అంటే అరవింద ఒప్పుకోదు. ప్రతీ త్రయోదశికి మిత్రకు ప్రాణ గండం ఉంది. మిత్ర ఆ రోజు బయటకు వెళ్తే మిత్రకు ప్రాణగండం అని అంటుంది. ఆ మాటలు లక్ష్మీ వినేస్తుంది. చేతిలో ఉన్న కాఫీ కప్పులు పడేస్తుంది. అరవింద దగ్గరకు వెళ్లి మిత్ర గారికి ప్రాణగండమా అని అడుగుతుంది. జయదేవ్ అవును అని చెప్తాడు. నాగసాధువు చెప్పినట్లు విషయం చెప్తారు లక్ష్మీ షాక్ అయిపోతుంది.
మిత్రను నువ్వు కాపాడలేవు..
మిత్రని కాపాడాలి అంటే అది కేవలం మిత్ర రక్తం పంచుకుపుట్టిన ఆడబిడ్డకే ఉంది. కానీ నువ్వు నీ మాతృత్వం దానం చేసి మిత్రను కాపాడే అవకాశం పోగొట్టావ్. అందుకే మనీషా కడుపులో బిడ్డ కావాలని అంటున్నాను. లక్ష్మీ ఏడుస్తుంది. ముందే నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. బిడ్డ పుట్టే వరకు మిత్రని ఎలా కాపాడుకోవాలో తెలీడం లేదని అరవింద ఏడుస్తుంది. మనీషా బిడ్డ పుట్టిన వరకు మిత్రను జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ లేని మనీషా కడుపు మీద వీళ్లు ఆశలు పెట్టుకున్నారు. మిత్ర గారిని ఎవరు కాపాడుతారని లక్ష్మీ ఏడుస్తుంది..
మిత్రను కాపాడిని జున్ను..
లక్కీ, జున్నులు మిత్ర కళ్లకు గంతలు కట్టి ఆడుతుంటారు. లక్ష్మీ మిత్ర దగ్గరకు వెళ్తుంది.. మిత్ర కళ్లకు గంతలు ఉండటం వల్ల మిత్ర పడిపోబోతే లక్కీ పట్టుకుంటుంది. లక్ష్మీ ఆ సీన్ చూస్తుంది. కావాలనే అలా చేశానని లక్కీతో మిత్ర అంటే లక్కీ అలిగిపోతుంది. ఇక లక్ష్మీ వచ్చి ఇలాంటి ప్రమాదమైన ఆటలు ఏంటి అని కోప్పడుతుంది. మనీషాకి పని మనిషి జ్యూస్ ఇస్తుంది. మనీషా మిత్రను పిలిచి పక్కన కూర్చొమంటుంది. మన బేబీ నీ మాటలు వింటాను అంటోంది కూర్చొ మిత్ర అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!