Ennallo Vechina Hrudayam Serial Today Episode త్రిపురను వాసుకి, నాగభూషణం తన అక్కాచెల్లెళ్లు అలా ఇలా అని బాధ పడేలా మాట్లాడుతారు. బాల త్రిపురతో సుందరి వీధి కుక్కలు అరుస్తాయి పట్టించుకోవద్దని అంటాడు. అలా అనొద్దు నాన్న అని యశోద చెప్తుంది. అందరూ అక్కడనుంచి వెళ్లిపోతారు. బాల సుందరితో సుందరి నువ్వు నా ఏంజెల్ నువ్వు బాధ పడొద్దు ప్లీజ్ అని అంటాడు. అనంత్ గాయత్రీకి పెళ్లి అవ్వాలని నేను దేవుడికి దండం పెట్టుకున్నా వాళ్ల పెళ్లి జరుగుతుంది నువ్వు బాధ పడొద్దని అంటాడు. గాయత్రీ, అనంత్ ఓ చోట కలుస్తారు.
అనంత్: గాయత్రీ ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు.గాయత్రీ: అవును నాకు అదే డౌట్ ఉంది.అనంత్: ఊర్లో ఉన్నప్పుడు నీకు పెళ్లి అయిపోయిందని నాతో చెప్పారు. ఇప్పుడు ఇలా ఫొటోలతో మా ఇంట్లో గొడవ పెట్టారు. ఎవరా కావాలనే టార్గెట్ చేశారు.గాయత్రీ: ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. (అటుగా వెళ్తున్న ఊర్వశి, రమాప్రభ వాళ్లని చూసి ఆగుతారు)అనంత్: గాయత్రీ నేను ఎవరు నీ గురించి చెప్పినా నమ్మను. గాయత్రీ: నువ్వు నమ్మవు అనంత్ కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ మీ ఇంట్లో వాళ్లది. వాళ్లే కదా నన్ను నమ్మనిది.అనంత్: త్రిపుర గారు నీ మీద పడిన నింద నిరూపించి ఎలా అయినా మన పెళ్లి చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరు ఏమనుకున్నా నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేను నాకు కాబోయే భార్యవి నువ్వే గాయత్రీ.
అనంత్, గాయత్రీలను చూసేసిన తల్లీకూతుళ్లు..
ఇద్దరూ హగ్ చేసుకోవడం చూసి తల్లీకూతుళ్లు రగిలిపోతారు. వాళ్లు ఎన్ని కలలు కన్నా అవి నెరవేరవు అని రమాప్రభ అంటుంది. ఇప్పుడు వాళ్లు ఉన్న ఆలోచనల నుంచి బయటు వచ్చేలోపు నీకు అనంత్‌కి పెళ్లి చేసేస్తా అంటుంది. అందుకు పంతుల్ని తీసుకొని అనంత్ వాళ్ల ఇంటికి వెళ్తారు.
బ్యాడ్ గల్స్ వచ్చేశారు..
బాల షర్ట్ వేసుకొని బటన్స్ సరిగా పెట్టుకోకపోతే త్రిపుర పెడుతుంది. బాల గెంతులేస్తూ కిందకి వచ్చి ఊర్వశి వాళ్లని చూసి బ్యాడ్ గల్స్ అనుకుంటాడు. రమాప్రభ పంతులు పెళ్లెంతో కలిసి వస్తుంది. ఏమైంది అని అడిగితే ఆడపిల్ల తరపు వాళ్లం కదా తొందరపడుతున్నాం అంటుంది. ఏమైందని అందరూ అడుగుతారు. జరిగింది పిన్ని గారికి చెప్పలేదా త్రిపుర అని త్రిపురని ఇరికిస్తుంది.
వీడియో చూపించిన ఊర్వశి..
బాల వెళ్లి సమయానికి ఆపకపోతే ఘోరం జరిగిపోయేది అని ఆ దారుణం ఇంట్లో వాళ్లకి చూపించు అని ఊర్వశికి చెప్తుంది. ఊర్వశి అందరికీ అనంత్ గాయత్రీని పెళ్లి చేసుకోవాలి అనుకున్న వీడియో చూపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో అనంత్ ఇంటికి వస్తాడు. త్రిపుర కంగారు పడుతుంది. ఎందుకు విషయం చెప్పలేదని త్రిపురని వాసుకి వాళ్లు నిలదీస్తారు.
నేను గాయత్రీనే ప్రేమించా..
అనంత్‌ని బామ్మ నిలదీస్తుంది. దాంతో అనంత్ నేను గాయత్రీని ప్రేమించా అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అంటాడు. గాయత్రీ ఎలాంటిదో తెలుసు కాదా అని వాసు అంటే గాయత్రీ ఎలాంటిదో నాకు తెలుసు నేను గాయత్రీని నమ్ముతున్నా అని అంటాడు. అనంత్ గాయత్రీనే పెళ్లి చేసుకోవాలి అదే కరెక్ట్ అని బాల అంటాడు. రమాప్రభ త్రిపురతో నువ్వు నీ చెల్లి చేసిన పనులకు మేం నుయ్యో గొయ్యో చూసుకోవాలి అని అంటుంది.
ఊర్వశిని వదిలేసి గాయత్రీ ఎందుకురా..
వాసుకి, నాగభూషణం గాయత్రీ గురించి లేనిపోని మాటలు అంటారు. చక్కగా సాంప్రదాయంగా ఉండే ఊర్వశిని వదిలేసి ఎవడితోనో తిరిగే గాయత్రీని ఎందుకు పెళ్లి చేసుకుంటావురా అని అడుగుతారు. అనంత్ వాళ్ల వైపు కోపంగా చూస్తాడు. బాల కూడా సీరియస్‌గా చూస్తాడు. గాయత్రీ చాలా మంచిది అని బాల అంటాడు. నా గాయత్రీ గురించి ఇంకోకసారి అలా మాట్లాడితే బాగోదని అనంత్ అంటాడు. మా మాట కాదని వెళ్లి తనకి తాళి కట్టబోయావు అంటే మా మాట మీద నీకు ఏం గౌరవం ఉందని ప్రశ్నిస్తారు.
వెంటనే ముహూర్తం పెట్టండి.. అందరూ పరువు తీశావని అనంత్‌ని తిడతారు. దాంతో బాల ఓరేయ్ అనంతూ నీకు ఊర్వశి ఇష్టం లేదని చెప్పరా అంటాడు. ఇక బామ్మ తమ పరువు కోసం వెంటనే ముహూర్తాలు పెట్టమని పంతులుతో చెప్తుంది. దాంతో పంతులు రేపు సాయంత్రం 4 గంటలకు ముహూర్తం అని చెప్తారు. దాంతో బామ్మ పెళ్లి ఫిక్స్ చేస్తుంది. త్రిపుర ఎదురుగానే తాంబూలాలు మార్చుకుంటారు. అనంత్ ఏం మాట్లాడకుండా గాయత్రీ గురించి ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. ఎక్కువ టైం లేదు ఏం చేసినా అయినా అవి మార్ఫింగ్ ఫొటోలు అని నిరూపించాలని త్రిపుర అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!