Seethe Ramudi Katnam Serial Today April 7th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: 'సీత సర్టిఫికేట్ ఇస్తేనే గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటా..'   

Seethe Ramudi Katnam Today Episode మిధున మహా ఇంటికి వచ్చి గౌతమ్ గురించి సీత తప్పుగా చెప్పింది సీత వచ్చి గౌతమ్ మంచోడు అంటేనే పెళ్లి చేసుకుంటా అని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Seethe Ramudi Katnam Serial Today Episode గౌతమ్ మిధునతో పెళ్లికి ఒప్పుకోవడంతో అందరూ సంతోషంగా ఉంటారు. చలపతి వచ్చి మిధున ఎందుకు పెళ్లికి ఒప్పుకుందో అప శకునంలా మాట్లాడుతాడు. మహాలక్ష్మీ చలపతిని ఆపి మిధున గౌతమ్‌ హ్యాండ్‌షమ్‌గా ఉంటాడని పెళ్లికి ఒప్పుకుందని మిధున, గౌతమ్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తామని అంటుంది. ఇంతలో మిధున అక్కడికి వస్తుంది. మహాలక్ష్మీ, గౌతమ్‌లు మిధునని వెల్‌కమ్ చెప్తారు. గౌతమ్ మెలికలు తిరుగుతూ పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చెప్తాడు. 

Continues below advertisement

మిధున: మీ లాంటి జాయింట్ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి జాయింట్ ఫ్యామిలీస్ చాలా రేర్‌గా ఉంటాయి. అందుకే ఈ ఇంటికి కోడలిగా రావాలి అని రామ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ రామ్‌ సీతని తప్ప ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునేలా లేడు. నాకు ఈ ఫ్యామిలీ నచ్చి ఈ ఇంటి కోడలు అవుదాం అనుకున్నా కాబట్టి గౌతమ్‌ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ నా ఎంక్వైరీలో గౌతమ్ వెరీ బ్యాడ్ పర్సన్ అని తేలింది.
గౌతమ్: ఎవరు చెప్పారు నేను చాలా మంచి వాడిని.
మిధున: నీ మీద కంప్లైంట్ ఇచ్చిందని సుమతి అంటీని నువ్వు చంపేశావని బయట టాక్ ఉంది. 
మహాలక్ష్మీ: అదంతా అబద్ధం మిధున.
జనార్థన్: ఇదంతా నీకు ఎవరు చెప్పారు మిధున.
మిధున: స్వయానా మీ కోడలు సీతే చెప్పింది. 
గౌతమ్: సీతకి నేను అంటే పడదు అందుకే నా గురించి బ్యాడ్‌గా చెప్పింది.
మిధున: ఆ రోజు సీత తండ్రి వచ్చింది మీ అందరి వేలిముద్రలు తీసుకోవడానికే కదా. ఆ రిజల్ట్ ఏమైంది. 
త్రిలోక్: నేను చెప్తా. ఈ ఫ్యామిలీ వేలిముద్రలు మ్యాచ్ అవ్వలేదు. వీళ్లంతా నిరపరాదులే. గౌతమ్‌తో సహా. ఇదిగో రిపోర్ట్స్. 
మిధున: ఇది మహాలక్ష్మీ ఇళ్లా లేక మీ పోలీస్ స్టేషన్‌నా సీఐ గారు. మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు.
మహాలక్ష్మీ: రిపోర్ట్స్ తీసుకురమ్మని నేను చెప్పాను. నువ్వు వస్తున్నట్లు మాకు కూడా తెలీదు కదా మిధున. 
మిధున: ఈ సీఐ మీ మనిషి అని బయట టాక్ ఉంది. సో నేను నమ్మను. ఈ గౌతమ్ గురించి సీత చెప్పింది మాత్రమే నమ్ముతాను. నువ్వు మంచి వాడివి అని ఆ సీత చెప్తేనే నమ్ముతాను. మన పెళ్లి జరగాలి అంటే నువ్వు ఆ సీత చేతే సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. సీతతో చెప్పించండి ఈ పెళ్లికి నాకు ఏం ఇబ్బంది లేదు. 
అర్చన: మిధున ఇలాంటి ఫిటింగ్ పెట్టింది ఏంటి మహా.
గౌతమ్: సీత చచ్చినా నాకు సర్టిఫికేట్ ఇవ్వదు.
చలపతి: ఈ పెళ్లి జరగదు సీత చచ్చినా సర్టిఫికేట్ ఇవ్వదు. 

మిధున వెళ్తూ అటుగా వచ్చిన రామ్‌ని ఢీ కొడుతుంది. రామ్ మిధునని పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు. సీఐ వచ్చి శఖిలించడంతో ఇద్దరూ లేస్తారు. లోపల గౌతమ్‌తో పెళ్లి చర్చలు.. రామ్‌తో రొమాంటిక్ చర్చలా అని అంటాడు. సీతని తెచ్చుకోలేదు సీత నీతో రాను అనిందా అని మిధున అడుగుతుంది. సీత దూరం అయితే తట్టుకోలేవా అంత ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. సీత ఏ తప్పు చేయలేదు అని తెలుసా నీకు చేయని తప్పునకు సీతకి శిక్ష వేస్తున్నా అని ఎప్పుడూ అనిపించలేదా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!

Continues below advertisement
Sponsored Links by Taboola