Chiranjeevi Lakshmi Sowbhagyavathi : రాఖీ పండుగ సందర్భంగా లక్కీ వాళ్ల అన్నకు రాఖీ కడుతుంది. అందుకు ప్రతిఫలంగా మిత్ర బొమ్మను పెన్సిల్‌తో గీసి బహుమతిగా ఇవ్వడంతో లక్కీ ఎంతో సంతోషపడుతుంది. వాళ్ల నాన్న గుర్తుకు వచ్చి ఏడుస్తుంది లక్కీ. లక్ష్మీమిత్రా గురించే ఆలోచిస్తుండటంతో అర్జున్ ఆమెను సముదాయిస్తాడు. బాధపడుతూ కూర్చుంటే పరిష్కారం కనుగొనలేమని హితబోధ చేస్తాడు, పోలీసులను నమ్ముకుంటే లాభం లేదని వివేక్ అంటాడు. అసలు మిత్రాను కిడ్నాపర్లు ఎందుకు అపహరించారో తెలియడం లేదని ముగ్గురూ అనుకుంటారు.
వివేక్: ఖచ్చితంగా వాళ్లు డబ్బుకోసమే అన్నయ్యను కిడ్నాప్ చేసి ఉంటారు
లక్ష్మీ: లేదు వివేక్..డబ్బు కోసమే అయితే ఈపాటికి వాళ్లు ఫోన్ చేసి డబ్బులు అడిగే వారు..ఇంకా ఏదో కారణం అయి ఉంటుంది.అందేంటో మనం కనుక్కోవాలి.
అర్జున్: కనుక్కోవాలి అంటే...అసలు ఎవరు కిడ్నాప్ చేశారో మనకు తెలియాలి కదా...కనీసం ఒక్క ఆధారం కూడా లేదు.
మిత్రా కనిపించకపోవడంతో మనీషా చాలా కంగారుపడుతుంటుంది. నేనే ఓ నాలుగు అడుగులు ముందుకు వేసి మిత్రాను కనిపెట్టి తీరతానంటుంది. దీంతో దేవయాని ఆమెను వారిస్తుంది. పోలీసులు, సంయుక్త వాళ్లు వెతుకుతున్నారు కదా...మధ్యలో నీకు ఎందుకు కంగారు అని వారిస్తుంది. మిత్రకోసం నేను తాపత్రయపడుతున్నానని మిత్రకు తెలియాలని మనీషా అంటుంది. ఆపద నుంచి కాపాడినందుకైనా తనను పెళ్లి చేసుకోవాలని మిత్రాకు ఆలోచన వస్తుందంటుంది. దీనికి దేవయాని కంగారు పడొద్దని చెబుతుంది. మనం అనుకున్నట్లు సంయుక్తే లక్ష్మీ అయి ఉంటే ఖచ్చితంగా మిత్ర కోసం వెతుకుతుంది. మనం సంయుక్తను ఫాలో అయితే సరిపోతుంది. చివరి నిమిషంలో మిత్రను మననే రక్షించామని క్రెడిట్ కొట్టేయవచ్చని సలహా ఇస్తుంది. స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోమంటుంది.
లక్ష్మీ, అర్జున్, వివేక్ ముగ్గురు కలిసి మిత్రాను కిడ్నాప్ చేసిన చోటకు వెళతారు.అక్కడ ఏమైనా ఆధారాలు లభిస్తాయోమనని వెతుకుతారు. వాళ్లను మనీషా దేవయాని ఫాలో అవుతారు. మిత్రాను కిడ్నాప్ చేసిన కారు పాతకారు కాబట్టి...అది ఖచ్చితంగా పాతకార్లు కొనే షాపులోనే కొనిఉంటారని లక్ష్మీ చెబుతుంది. మనం అక్కడి వెళ్లి ఎంక్వయిరీ చేద్దామంటుంది. వివేక్‌ను వెళ్లి ఆరా తీయమని చెబుతుంది. దీంతో అతను వెళ్లిపోతాడు. నెంబర్ ప్లేట్ లేని కారులో ప్రయాణం చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉండటంతో వారు మిత్రాను సిటీలోనే ఎక్కడో దాచిపెట్టి ఉంటారని లక్ష్మీ చెబుతుంది. దీంతో అర్జున్ ఈ రోడ్డు నుంచి వెళ్లే దారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తానని వెళ్లిపోతాడు. ఆ తర్వాత లక్ష్మీ ఎస్సైను కలవడానికి వెళ్తుంది.
మిత్రా ఎక్కడికి వెళ్లాడో తెలియదని అరవింద, దేవయాని వెళ్లి దీక్షితులు గారికి చెబుతారు. మీరు హెచ్చరించిన తర్వాత మేం వెళ్లి కాపాడే సరికి అతన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చెబుతారు. దీంతో అతన్ని మృత్యువు వెంటాడుతోందని దీక్షితులు హెచ్చరిస్తాడు. ఈ గండం నుంచి గట్టెక్కించమని అరవింద ప్రాధేయపడగా...వరలక్ష్మీ వ్రతం చేయాల్సిందిగా ఆయన సూచిస్తాడు. మిత్ర భార్య లక్ష్మీయే చేయాలని చెబుతాడు. దీంతో అరవింద కంగారుపడుతుంది. లక్ష్మీ మన దగ్గర లేదని చెబుతుంది. ఏడ్చుకుంటూ అరవింద అక్కడి నుంచి వెళ్లిపోగానే....జయదేవ్ దీక్షితులతో లక్ష్మీ బ్రతికే ఉందని చెబుతాడు. ఆ విషయం తనకు తెలుసునని దీక్షితులు చెబుతాడు. తన ఉనికి గురించి బయటకు తెలిస్తే నందన్ కుటుంబానికి ప్రమాదమని తాను బయటపడలేదని...నేను కూడా తన గురించి చెప్పకూడదని తన వద్ద ప్రమాణం తీసుకుందని దీక్షితులు చెబుతాడు. అందుకే ఇన్నాళ్లు మీకు చెప్పలేదంటాడు. ఏదేమైనా లక్ష్మీ మాకోసం తిరిగొచ్చి అది చాలంటాడు. ఈ వ్రతం కూడా ఎవరికీ తెలియకుండా లక్ష్మీతో చేయిద్దామని జయదేవ్ చెబుతాడు. ఇంట్లో తనతో పూజ చేయించే అవకాశం లేదు కాబట్టి గుడిలో చేయిద్దామి జయదేవ్ చెబుతాడు.
ఎస్‌ఐని కలిసి లక్ష్మీ నేరస్థుల లిస్టు అడుగుతుంది. వాళ్ల లిస్టు తీసుకుని ఏం చేసుకుంటారని ఎస్‌ఐ అడగగా...కేవలం కిడ్నాప్ చేసే వారి జాబితా ఇస్తే చాలంటుంది. గతంలో చేసిన వారే ఇప్పుడు చేశారని ఎలా అనుకుంటారు అని ఎస్‌ఐ అడగ్గా...సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే..వాళ్ల చాలా ఫ్రొపెషనల్‌గా చేశారని తెలిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా పాత కిడ్నాపర్లే అయి ఉంటారని అంటుంది. దీంతో ఆ లిస్ట్ లక్ష్మీకి అందిస్తాడు ఎస్‌ఐ. ఈలోగా వివేక్ పాత కార్లు అమ్మే దుకాణాలకు వెళ్లి ఎంక్వయిరీ చేస్తాడు. మరోవైపు అర్జున్ సీసీ కెమెరాలు శోధిస్తుంటాడు. ఇలా ముగ్గురు మూడు దారుల్లో పరిశోధన చేస్తుంటారు. కిడ్నాప్లు చేసే వాళ్ల ఫోన్ నెంబర్లను ఎస్‌ఐ నుంచి లక్ష్మీ సేకరిస్తుంది. ఇవన్నీ చాటుగా గమిస్తూ లక్ష్మీ ఏం చేస్తుందోనని ఆమెను మనీషా, దేవయాని ఫాలో చేయడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.