Chinni Serial Today Episode: సుబ్బు, స్వరూపలో మ్యాడీతో కొన్ని పరిస్థితులు మీ ఇద్దరి మధ్య దూరం పెంచాయి కానీ చిన్ని నీకు మోసం చేయలేదు.. ఎడబాటు తెలిసిన భార్యాభర్తలు కాబట్టే ఆ సీతారాములు మిమల్ని విడదీయకూడదు అని ఇలా వాళ్ల సమక్షంలో మీ తంతు జరిపించారు.. చిన్ని మీద కోపం పెంచుకోవద్దు బాబు.. తనని అర్థం చేసుకో అని స్వరూప, సుబ్బులు వేడుకుంటారు.

Continues below advertisement

చంటి బావ దగ్గరకు వచ్చి అమెరికా అబ్బాయిగా పరిచయం అయి బావగా మారిపోయారు.. అమెరికా అబ్బాయిగా ఉన్నప్పుడు మా అక్కతో బాగుండేవాళ్లు.. బావగా మారి దూరం పెరిగింది.. అందుకే మళ్లీ అమెరికా అబ్బాయి అంటున్నా మా అక్కని బాగా చూసుకో అమెరికా అబ్బాయి అని చంటి చెప్తాడు. మ్యాడీ చిన్ని వైపు ప్రేమగా చూస్తాడు. లోహిత శ్రేయతో సెంటిమెంట్ డ్రామాతో కొట్టారు. మ్యాడీ ఆ డ్రామాలో పడిపోడు కదా అని అంటుంది. మరోవైపు దేవా మనుషులు బాలరాజు కోసం అడ్రస్‌కి బయల్దేరుతారు. మధ్యలో కారు ఆగిపోతుంది. దాంతో అందరూ నడుచుకుంటూ వెళ్తారు. దేవా టెన్షన్ పడుతూ ఈ పాటికి బాలరాజు దొరికేసుంటాడు కదా.. ఇంకా ఏంటి కాల్ చేయలేదు అని అనుకుంటాడు. ఇంతలో చిన్ని మామ దగ్గరకు కాఫీ తీసుకొని వస్తుంది. 5 నిమిషాల్లో మా నాన్న ఆచూకీ తెలిసిపోతుంది అన్నారు కదా ఇంకా తెలీలేదా.. అని  అడుగుతుంది. ఇంతలో దేవాకి కాల్ రావడంతో మా నాన్న గురించేనేమో మాట్లాడండి మామయ్య అని అంటుంది. 

దేవా కాల్ లిఫ్ట్ చేస్తే చిన్ని మనల్ని మోసం చేసింది సార్.. ఎస్‌పీ గారు ఇచ్చిన అడ్రస్ ప్రకారం వచ్చాం సార్ ఇది డెడ్ ఎండ్.. ఇక్కడ ఏం లేదు.. ఆ చిన్ని మనల్ని తెలివిగా రాంగ్ ట్రాక్ పట్టించిందని అంటారు. మా నాన్న దొరుకుతారు అనుకున్నారు కదా.. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మామయ్య గారు తప్పు లేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో రెచ్చిపోకూడదు.. మీరు ఇలా రెచ్చిపోతారు అని తెలిసే స్ట్రాంగ్ కాఫీ తెచ్చా.. త్వరగా తాగేయండి లేదంటే చల్లారిపోతుంది అని అంటుంది. దేవా కోపంతో కాఫీ విసిరేస్తాడు. మ్యాడీ చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చిన్ని కిచెన్‌లో వంట చేస్తూ ప్రమీలతో నవ్వుకుంటూ ఉంటే మ్యాడీ దూరం నుంచి చూస్తూ మురిసిపోతాడు. లోహిత, శ్రేయ అది చూస్తారు.  మ్యాడీ తనని చూడంటం చిన్ని కూడా చూస్తుంది. మ్యాడీని అలా చూస్తుంటుంది. మ్యాడీ గదిలోకి వెళ్లిపోతాడు. చిన్ని వెనకాలే వెళ్తుంది. మ్యాడీ మొక్క పట్టుకొని నవ్వుకోవడం చూస్తుంది. 

Continues below advertisement

లోహిత జరిగింది అంతా తలచుకొని కోపంతో గదిలో అన్నీ తన్నేస్తుంది. ఏమైందని వరుణ్ వచ్చి అడుగుతాడు. నీ ప్రాబ్లమ్ ఏంటి అని వరుణ్ అడిగితే చిన్నినే నా ప్రాబ్లమ్.. మీ అత్తయ్య వాళ్లు తనకి చాలా చేస్తున్నారు.. కనీసం నాకు అలా ఒక్కటి కూడా చేయలేదు నాకు బాధ ఉండదా అని అంటుంది. మనతో పెళ్లి తంతు జరిపించారా.. ఇవన్నీ చేశారా.. నాకు ఆ మాత్రం బాధ ఉండదా అని అడుగుతుంది. దానికి వరుణ్ నీ బాధకి కారణం నువ్వే.. మన పెళ్లి అయి ఇంత కాలం అయినా మీ పేరెంట్స్‌ని తీసుకొచ్చావా.. ఏ రోజు అయినా ఫోన్ చేసి అయినా మా అత్తయ్య వాళ్లతో మాట్లాడించావా.. అమెరికాలో ఉన్నారు.. ఆఫ్రికాలో ఉన్నారు అంటావ్ అని అంటాడు. వార్ జరుగుతుంది కదా ఆగిపోయారు అని కవర్ చేస్తుంది. 

రాత్రి పడుకున్నప్పుడు చిన్ని నిద్రలో మ్యాడీ మీద కాలు వేస్తుంది. మ్యాడీ లేచేస్తాడు. కాలు తీసి పక్కన పెడితే చిన్ని చేయి మీద వేస్తుంది. అలా చిన్నిని చూస్తూ ఉండిపోతాడు. మ్యాడీ చిన్ని జుట్టు సర్దుతూ ఉంటే చిన్ని చూసేస్తుంది. మ్యాడీ కంగారు పడిపోతాడు. నువ్వు నా మీద కాలు వేశావ్.. అది తీస్తే చేయి వేశావ్ అని అంటాడు. మీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి నా కాలు కింద మీరు కాలు వేశారు.. అని రివర్స్‌లో అడుగుతుంది. మ్యాడీని కావాలనే రెచ్చ గొడుతుంది. ఈ మాత్రం మార్పు వస్తే చాలు నిన్ను నేను పూర్తిగా మార్చేసుకుంటా అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.