Brahmamudi Serial Today Episode: రాజు ఇంటికి వచ్చిన సాహు వాళ్ల అమ్మ లక్ష్మీ చేత చేపల పులుసు చేయించుకుని తింటుంటే అప్పుడే దెబ్బలతో వెంకట్‌ ఇంటికి వస్తాడు. వెంకట్‌ ను చూసి అందరూ కంగారు పడుతుంటారు.

Continues below advertisement

రాజు: అరేయ్‌ ఏమైందిరా ఈ దెబ్బలేంటి..? ఎలా తగిలాయి..

వెంకట్‌: ఏమో అన్నయ్యా రోడ్డు మీద బైక్‌ దగ్గర నిలబడి ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను ఎవడో కారుతో ఫాస్ట్‌గా వచ్చి అలా తగిలించి వెళ్లాడు. కొద్దిలో మిస్‌ అయింది. కానీ అది ఎవరో కావాలని చేసినట్టు ఉంది

Continues below advertisement

లక్ష్మీ: నువ్వైనా చూసుకోవాలి కదరా..?

రాజు: పెద్ద గాయాలేం చేయలేదు కదా ఒకసారి చూడనివ్వు..

వెంకట్: నువ్వేంటి అన్నయ్య ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌ చేసేవాడివి ఇలా చూస్తున్నావు

సాహు: అన్నదమ్ముళ్ల లవ్‌ అలాగే ఉంటుంది బ్రదర్‌ ఎప్పుడూ గొడవలు పడుతున్నటే ఉంటారు కానీ కష్టం వచ్చిందంటే ఇలా కంగారు పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ బ్లడ్‌లో ఉన్న లవ్‌ అలాంటిది.. రాజు ఇక నేను వెళ్తాను.. బయటకు వస్తావా..? ( రాజు, లక్కీ బయటకు వెళ్తారు.) ఇవాళ దెబ్బలతో మిస్‌ అయింది. రేపు ప్రాణం మీదకు రావొచ్చు.. లేదంటే ఇంటి మీదకు రావొచ్చు. నీకు అర్థం అయింది అనుకుంటా

అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు సాహు. రాజు, లక్కీని ఐశ్వర్యకు ఫోన్‌ చేయమంటాడు.

లక్కీ: రేయ్‌ అదేమన్నా లాలీపప్ప అడిగింది అనుకుంటున్నావా..? కిడ్నాప్‌ చేయమని అడిగిందిరా

రాజు: కిడ్నాప్‌ మాత్రమే కాదు ఏం చేయడానికైనా నేను రెడీ ఉన్నాను

లక్కీ: రేయ్‌ ఏం అంటున్నావురా..?

రాజు: అవున్రా ఇన్ని రోజులు మనం తప్పులు మోసాలు చేసినా.. అది మన వరకే ఉండేది. కానీ అది ఈరోజు తమ్ముడి వరకు వచ్చింది. రేపు అమ్మనాన్నల వరకు వస్తుంది. అలా జరగకూడదురా..? నేను ఏ రోజు ఈ ఇంటికి ఏమీ చేయలేదు వెంకీ గాడే నా స్థానంలో ఉండి అమ్మానాన్నలను ఈ ఇంటిని చూసుకుంటున్నాడు. నా వల్ల వాళ్లకు ఏదైనా జరిగితే నేను జీవితాంతం క్షమించుకోలేను.. నా కుటుంబం కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ ముందు ఫోన్‌ చేయ్‌ కలుద్దాం

అని చెప్పగానే.. లక్కీ ఐశ్వర్యకు ఫోన్‌ చేస్తాడు. ముగ్గురు ఒక రెస్టారెంట్‌లో కలుస్తారు. లక్కీ, రాజు తాము కిడ్నాప్‌ చేయడానికి రెడీగా ఉన్నామని ఎవరిని చేయాలని అడుగుతారు. ఐశ్వర్య ఇందు ఫోటో చూపిస్తుంది. ఈ అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తే డబ్బులు ఎవరు ఇస్తారు అంటూ అనుమానంగా రాజు అడగ్గానే.. ఐశ్వర్య పూర్తి వివరాలు చెప్తుంది. ఇందు ఒక్క సంతకం చేస్తే కోట్లు వస్తాయని మా ఆంటీ చెప్తుంది. అందుకే ఈ అమ్మాయిని కిడ్నాప్‌ చేస్తే మా ఆంటీ మనకు అడిగినంత డబ్బు ఇస్తుందనగానే.. రాజు, లక్కీ ఓకే అంటారు. మరోవైపు రేఖ, ఇందు కోసం కొత్త బట్టలు ఇచ్చి రేపు బర్తుడే కోసం వేసుకోమని చెప్తుంది. అందరి ముందు నువ్వు బుట్టబొమ్మలా కనిపించాలని చెప్తుంది. సరే అంటూ బట్టలు తీసుకుని వెళ్లిన ఇందును అపర్ణ తిడుతుంది. సంతకం పెట్టడానికే నిర్ణయించుకున్నావా..? అని అడగ్గానే.. మీ కోసం సంతకం పెట్టాలని ఉంది కానీ దేవుడు ఎలాగైనా ఆపేస్తాడని నమ్మకం ఉందని చెప్తుంది ఇందు. మరోవైపు ఇందును కిడ్నాప్‌ చేసేందుకు రాజు, లక్కీ ప్లాన్‌ చేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!