Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: నడిరోడ్డుపై రౌడీలు ఓ వ్యక్తిని పొడిచిపడేయడంతో శ్రీలక్ష్మీ అది చూసి అతన్ని కాపాడి ఆస్పత్రికి తీసుకొస్తుంది. వెంటనే చికిత్స చేయమని వేడుకుంటుంది.ఇంతకీ ఇతను ఎవరమ్మా...నీకు ఏమవుతాడని వైద్యులు శ్రీలక్ష్మీని ప్రశ్నిస్తారు. నువ్వు ఇతని కుమార్తెవా అని అడుగుతారు. దీంతో ఏం చేయాలో తెలియక..ఆయన నాకు కన్నతండ్రిలాంటివారని చెబుతుంది. 
 
వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయమని ప్రాథేయపడుతుంది.దీంతో వైద్యులు చికిత్స మొదలుపెడతారు. రౌడీలు కూడా అదే ఆస్పత్రికి వచ్చి జరిగిన విషయం మొత్తం ఫోన్‌లో ప్రియంవదకు చెబుతారు. మీరు చెప్పినట్లే అతన్ని జాగ్రత్తగా పట్టుకుని తీసుకొస్తుంటే... మామీద తిరగబడినాడని చెబుతారు. అందుకే మేమే కత్తితో పొడిచామని చెప్పడంతో ప్రియంవద వాళ్లపై మండిపడుతుంది. 
 
నేను చంపమని చెప్పలేదు కదా అని అరుస్తుంది. కానీ ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కత్తితో పొడిచేశామని చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగిందని ప్రియంవద అడగ్గా....అతన్ని ఓ  అమ్మాయి ఆస్పత్రికి తీసుకెళ్లిందని ఇప్పుడు మేం కూడా అక్కడే ఉన్నామని చెబుతారు. అయితే నేను వెంటనే ఆస్పత్రి వస్తున్నానని చెబుతుండగా... సూర్యనారాయణ వింటాడు. ఎవరికి ఏం జరిగిందని నిలదీస్తాడు.  తన ప్రెండ్‌ వాళ్ల అబ్బాయికి చిన్న  యాక్సిడెంట్ జరిగిందని చెబితే చూసి రావడానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడుతుంది.
 
కాలేజీలో మ్యాడీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటుంది త్రిష. మ్యాడీరాగానే హుషారుగా అతని వద్దకు పరుగెడుతుంది. పిచ్చ కోపంతో వచ్చిన మ్యాడీ త్రిష చెంపపగులగొడతాడు. అసలు ఎందుకు కొట్టాడో అర్థంగాక త్రిష తలబాదుకుంటుంది. నన్ను కొట్టే హక్కు నీకు ఉన్నా... ఎందుకు కొట్టావో చెప్పాల్సిన అవసరం ఉందని అంటుంది. నీకు తెలియదా ఎందుకు కొట్టానే అని అంటాడు. 
 
గుడిలో కొబ్బరి చిప్పి విసిరి ఆ ఎర్రబస్సు కాలికి గాయం చేసింది చూసేశాడా అని ఆలోచిస్తుంది. ఎందుకు కొట్టావని మళ్లీ అడగ్గా.....శ్రీలక్ష్మీకి యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది నువ్వు కాదా అని నిలదీస్తాడు. ఆ మాటలు విన్న త్రిష షాక్‌ తింటుంది. ఎర్రబస్సు దగ్గర నుంచి శ్రీలక్ష్మీ వరకు వెళ్లిపోయాడని బాధపడుతుంది. అసలు ఎపరు చెప్పారు నేను యాక్సిడెంట్ చేశానని అంటుంది. 
 
వెంటనే తన ఫోన్‌లో ఉన్న వీడియో తీసి చూపిస్తాడు. అడ్డంగా దొరికిపోయానని భావించిన త్రిష నిజం ఒప్పుకుటుంది. ఆ ఎర్రబస్సు కాలజేలో పోస్టర్‌లు వేసి నీ పరువు తీసిందన్న కోపంతోనే నేను  ఈ పని చేశానని చెబుతుంది. నన్ను ఎవరు ఏం అన్నా సహిస్తాను కానీ... నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను తట్టుకోలేనని అంటుంది. దీంతో మ్యాడీ త్రిషను తిడతాడు.మనం కూడా శ్రీలక్ష్మీ అడ్మిషన్‌ చెడగొట్టడానికి ఎన్నో వెదవ వేషాలు వేశాం కదా అని అంటాడు. కాలేజీ  అన్న తర్వాత ఇలాంటివి సహజమని...అలాంటిదానికే చంపుకునే వరకు వెళ్తారా అని అంటాడు.  శ్రీలక్ష్మీ కాలేజీకి రాలేదని తెలుసుకుని ఫోన్ చేయగా....ఆస్పత్రిలో ఉన్నానని విషయం చెప్పడంతో మ్యాడీ  అక్కడికి బయలుదేరతాడు.
 
ఆస్పత్రికి వచ్చిన ప్రియంవద తన భర్తను చూసి పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటుంది. తనకు  బిడ్డ పుట్టిన వెంటనే నర్సుకు డబ్బులిస్తానని ఆశచూపించి ఆ బిడ్డ వైపు కన్నెత్తి చూడకుండానే బయటపడేసి రమ్మని చెబుతుంది. ఇప్పుడు ఆ బిడ్డ కోసం తన భర్త వస్తాడని...దీన్ని అడ్డుపెట్టుకుని వాడిని జీవింతాంతం సాధించవచ్చని ప్రియంవద అనుకుంటుంది. 
 
ఆమె అనుకున్నట్లే ప్రియంవద భర్త బిడ్డ కోసం రాగా....తన బిడ్డను తీసుకుని పారిపోయాడంటూ కేకలు వేసి అందిరనీ పిలుస్తుంది. నర్సుకు డబ్బులు ఇచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తుంది. ఇతనే చంటిబిడ్డను తీసుకుని వాళ్ల బంధువులకు ఇచ్చి పంపించేశాడని నర్సు చెప్పడంతో ప్రియంవద భర్తన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. అలా భర్త, బిడ్డను ప్రియంవద శాశ్వతంగా దూరం చేసుకుంటుంది. ఇంతకీ ఇతన్ని కాపాడి రక్తం ఇస్తుంది ఎవరా అని చూడగా....పక్కబెడ్‌పై శ్రీలక్ష్మీ పడుకుని ఉండటం చూసి ప్రియంవద షాక్‌ తింటుంది.