Chinni Serial Today Episode లోహిత వరుణ్‌కి కలుస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను వరుణ్ నీకు పెళ్లి ఫిక్స్ అయితే చనిపోతా అని బెదిరిస్తుంది. దాంతో వరుణ్ ఏది ఏమైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. దాంతో లోహిత ఇంట్లో నీకు సపోర్ట్ చేసే మ్యాడీకి మన విషయం చెప్పు.. మనకి సాయం చేస్తాడని అంటుంది. ఇప్పుడే విషయం చెప్తానని వరుణ్ వెళ్తాడు.
లోహితకు తన ఫ్రెండ్ ఫోన్ చేసి పెయింటర్ గురించి ఏం చేస్తాం అంటే వాడికి తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకో నేను చెప్పే వరకు వాడిని వదలొద్దుని అంటుంది. మరోవైపు మధు మ్యాడీని గుడికి రమ్మని పిలిచి మ్యాడీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మ్యాడీ వస్తాడు. మధు మ్యాడీతో ఈ అమ్మవారు చాలా పవర్ ఫుల్ ఏదైనా కోరిక కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారు మన కోరికల్ని కచ్చితంగా నెరవేర్చుతుందని మా నమ్మకం నువ్వు కోరుకో అని అంటుంది.
మ్యాడీ చిన్ని ఎలా అయినా తనకు దక్కేలా చూడమని కోరుకుంటాడు. మధు మనసులో ఇప్పటి వరకు మ్యాడీ నాకు దక్కాలి అని కోరుకున్నా ఇప్పటి నుంచి మ్యాడీకి ఏం కావాలి అది ఇవ్వాలని కోరుకుంటున్నా మ్యాడీ కోరిక నెరవేర్చమని కోరుకుంటుంది. ఇక అమ్మవారి దగ్గర ఓ గాజు తీసుకొని మ్యాడీకి ఇచ్చి మనస్ఫూర్తిగా మన కోరిక కోరుకొని త్రిశూలంలో వేస్తే మన కోరిక నెరవేరుతుంది. నువ్వు నీ కోరిక కోరుకొని వేయు అని ఇస్తుంది. మ్యాడీ సంతోషంగా గాజు తీసుకొని వెళ్తాడు మొక్కుకుంటాడు. కానీ గాజు పడకపోతే నేను తీసుకోలేను మధు అని వెనక్కి తగ్గుతాడు. దాంతో మధు అలా ఏం కాదు మ్యాడీ మన కోరిక నిజమైంది మంచిది అయితే అమ్మవారే మనకు అండగా ఉంటుంది అని ధైర్యంగా గాజు వేయు అని చెప్తుంది.
మ్యాడీ చిన్ని గురించి మొక్కుకొని గాజు వేస్తాడు. గాజు త్రిశూలంలో పడుతుంది. ఆ సంతోషంలో త్రీ ఫీట్ డిస్టెన్స్ పాటించే మ్యాడీ మధు దగ్గరకు పరుగులు తీసి మధుని హగ్ చేసుకొని గిరగిరా తిప్పేస్తాడు. తర్వాత మధుకి సారీ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇక వెళ్తూ మధు జడలో నుంచి గులాబి పడితే మ్యాడీ పట్టుకుంటాడు. పువ్వు తీసి మధు జడలో పెడతాడు. మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది.
లోహిత మనిషి పెయింటర్‌కి ఫుడ్ ఇస్తాడు. దాంతో పెయింటర్ అతన్ని నెట్టేసి పారిపోతాడు. వేరే వ్యక్తికి ఫోన్ అడిగి తన రూమ్‌మేట్‌కి కాల్ చేసి కిడ్నాప్ గురించి చెప్తాడు. మ్యాడీ గురించి చెప్పి లైఫ్ అండ్ డెట్ మ్యాటర్ అంటరా అని వెళ్లి మీట్ అవ్వు అని చెప్తాడు. పెయింటర్ కలుస్తా అని అంటాడు. లోహిత వరుణ్‌కి కాల్ చేసి మ్యాడీకి మన మ్యేటర్ చెప్పావా అంటే ఇంకా చెప్పలేదు అని వరుణ్ అంటాడు. నేను అంతా చూసుకుంటా నువ్వేం భయపడకు అని వరుణ్ లోహితకు చెప్తాడు. తర్వాత లోహితకు తన ఫ్రెండ్ కాల్ చేసి పెయింటర్ పారిపోయాడని చెప్తాడు. లోహిత షాక్ అయి ఫ్రెండ్ మీద అరుస్తుంది.
లోహిత ఏం చేయాలా అనుకుంటూ సంజయ్‌ని చూసి కావాలనే రెచ్చగొట్టాలని తన ఫ్రెండ్స్‌తో ప్లాన్ చేసి మధు బట్టలు ఇప్పి కొట్టింది కదా దమ్ముంటే నీ పౌరుషం దానికి చూపించని రెచ్చగొడుతుంది. సంజు ఆవేశం వెళ్లి కాలేజ్ గోడల మీద మధు మ్యాడీ కోసం నువ్వు నా లవ్ నువ్వు లేకుండా నేను లేను నిన్నే కోరుకుంటుంది నా మనసు.. ఇట్లు మధు.. అని మధు రాసినట్లు.. నిన్ను చూస్తుంటే పోతుంది నా మతి.. ఏం అందం నీది నన్ను ప్రేమించు ప్రియతమా ఇట్లు మ్యాడీ అని మ్యాడీ రాసినట్లు రాసి మధు, మ్యాడీ లవ్ అని గోడలు మొత్తం నిండిపోయి ఉంటాయి. మధు రాగానే అందరూ కామెంట్స్ చేస్తారు. ఏమైందా అని మధు స్వప్న అనుకుంటారు. మరో అమ్మాయి వచ్చి గోడల మీద మీ గురించి ఎవరో బ్యాడ్‌గా రాశారని చెప్పడంతో మధు పరుగులు తీస్తుంది. ఆ రాతలు చూసి ఏడుస్తుంది. బాధతో పేపర్లు అన్నీ చింపేస్తుంది. ఇదంతా అబద్ధం నిజం కాదు అని అంటుంది. సంజు, లోహిత వాళ్లు చూసి నవ్వుకుంటారు. శ్రేయ కూడా చూస్తుంది. కోపంగా మధు దగ్గరకు వచ్చి ఏయ్ అంటుంది. మధు ఏడుస్తూ శ్రేయ ఇదంతా అబద్ధం ఇదంతా ఎవరో కావాలని చేశారని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.